బరువు తగ్గకుండా అడ్డుకునే 6 ఆరోగ్యవంతమైన ఆహారాలు మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్న ఆహారాలన్నీ ఆరోగ్యవంతమైనవే. కానీ, బరువు తగ్గాలి అని అనుకునే వారికి మాత్రం ఎంతమాత్రం ఉపయోగపడేటివి కాదు. అలా కోరుకొనే వారికీ ఇవి ఎటువంటి మంచి చేయవు.

ఆరోగ్యవంతమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవడానికే ఈ మధ్య ప్రజలు అందరు మొగ్గు చూపుతున్నారు. కానీ, బరువు తగ్గాలనుకుంటే కూడా అలాంటి ఆహారమే సరిపోతుంది అని అనుకుంటే పొరబడినట్లే. మీరు ఆరోగ్యవంతమైన ఆహారం తింటున్నప్పుడు కూడా, కొన్ని సార్లు బరువు తగ్గాలనుకుంటే మాత్రం కష్టతరం అవుతుంది. ఆరోగ్యవంతమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడానికి మరియు బరువు తగ్గడానికి తీసుకొనే ఆహారానికి చాలా వ్యత్యాసం ఉంది.

ఇప్పుడు మీరు పోషకాలు తో కూడిన ఆరోగ్యవంతమైన ఆహారం తింటున్నప్పటికీ కూడా, బరువు తగ్గడానికి ఉపయోగపడని 6 ఆరోగ్యవంతమైన ఆహారాల కోసం గురించి తెలుసుకోబోతున్నాం.అవేంటో ఇప్పుడు చూద్దాం...

1. ఉష్ణ మండల పళ్ళు :

1. ఉష్ణ మండల పళ్ళు :

బరువు తగ్గాలనుకునే వారికి, పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి అనే విషయం అందరికి ఎంతో బాగా తెలుసు. అయితే, ఉష్ణ మండల పండ్లు అయిన మామిడి పండు, అనాస పండుని బరువు తగ్గాలనుకునే వారు అస్సలు తీసుకోకూడదు. ఇవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. కానీ, వీటిల్లో ఎన్నో కేలరీలు కూడా దాగి ఉంటాయి. వీటిని గనుక తీసుకున్నట్లైతే బరువు తగ్గటం మాట అటు ఉంచి, బరువు పెరిగే అవకాశం ఉంది. కావున, ఇటువంటి పండ్లను ఎప్పుడో ఒకసారి తీసుకోండి లేదా పుల్లని పండ్లను ఎక్కువగా సేవించండి.

2. తేనె :

2. తేనె :

ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలని ఏ వ్యక్తి అయితే భావిస్తారో, ముఖ్యంగా బరువు తగ్గాలి అనేవారి మెదడులోకి మొదట వచ్చే పదం తియ్యటి తేనె. కానీ, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, శరీర బరువు తగ్గకుండా తేనె నియంత్రిస్తుందట. శిలింద్ర నివారకములుగా మరియు సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు ఎన్నో, ప్రకృతి సహజంగా లభించే ఈ తియ్యటి తేనే లో ఉంటాయి. అయితే చక్కెర కంటే కుండా తేనె చాలా మందంగా ఉంటుంది. కాబట్టి, మీరు ఒకటి లేదా రెండు స్పూన్ల కంటే తేనెను ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల, అది మీ బరువు తగ్గటం పై ఎలాంటి ప్రభావం చూపించదు.

3. వేరుశెనగ వెన్నె :

3. వేరుశెనగ వెన్నె :

వేరుశెనగ వెన్నె చాలా ఆరోగ్యవంతమైనది మరియు వాటిల్లో ఉండే కొవ్వు పదార్ధాలు కూడా చాలా మంచివి. కానీ, అందరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే అది కూడా కొవ్వే. ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగ వెన్నెతీసుకుంటే, 200 కేలరీల శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది.అన్నింటికంటే భయానకమైన విషయం ఏమిటంటే, బయట నిల్వచేసిన వేరుశెనగ వెన్నెలో కొన్ని రకాల చక్కెర పదార్ధాలను కలుపుతున్నారు. కావున మీరు ఇలాంటి డబ్బాని తీసుకునేటప్పుడు అతి తక్కువ చక్కెర వేసిన వేరుశెనగ వెన్నె తీసుకోవడం మంచిది.

4. ప్రకృతి సహజంగా తయారయిన పెరుగు :

4. ప్రకృతి సహజంగా తయారయిన పెరుగు :

పాల పదార్ధాల్లో అత్యధికంగా పోషకాలు లభించే పోషక పదార్ధం ప్రకృతి సహజంగా తయారయిన పెరుగు. ఇలాంటి పదార్ధం స్వీకరించడం వల్ల ఎముకలు బాగా బలపడతాయి, జీర్ణక్రియ బాగా జరుగుతుంది మరియు కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీరు బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే అందరు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, పెరుగులో కొవ్వు శాతం అధికముగా ఉంటుంది. కావున, పెరుగు ఆరోగ్యవంతమైనది అని చెప్పి విపరీతంగా తింటే మీరు బరువు తగ్గరు. రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్ల పెరుగు మాత్రమే వాడండి.

5. గింజలు :

5. గింజలు :

విటమిన్ ఈ, ఇనుము, పొటాషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తో పాటు మరెన్నో పోషకాలు గింజల్లో ఉంటాయి. కానీ, అవి లా చిన్నవిగా ఉంటాయి. దీనివల్ల మన కడుపు అంత తొందరగా నిండదు. అందుచేత చాలామంది వీటిని చాలా ఎక్కువగా తినేస్తుంటారు. గింజల్లో 50 నుండి 75% వరకు కొవ్వు పదార్ధాలు ఉంటాయి. కావున శృతిమించి గింజలు గనుక తిన్నట్లైతే, మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. కాబట్టి, రోజుకి ఎన్ని గింజలు తినాలి అనే విషయమై నియమం పెట్టుకోండి.

6. కొబ్బరి కాయ :

6. కొబ్బరి కాయ :

కొబ్బరికాయ నుండి వెలువడే కొబ్బరి నీళ్లు, నూనె, చక్కెర, పిండి, పాలు మరియు క్రీము వల్ల ఎన్నో ఆరోగ్యవంతమైన లాభాలు ఉన్నాయని చెబుతారు. వీటి యొక్క ప్రాముఖ్యతను చాలా ఆలస్యంగా గుర్తించారు. జీర్ణ క్రియ బాగా అవడం దగ్గర నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందించడం వరకు ఇలా కొబ్బరికాయ ఎన్నో రకాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుంది. కొబ్బరికాయలో లారిక్ ఆమ్లం అనేది ఉంది. ఈ ప్రత్యేకమైన కొవ్వు పదార్ధం వల్లనే కొబ్బరికాయలో ఎన్నో ఆరోగ్యవంతమైన లాభాలు ఉన్నాయి. కానీ, అది కూడా కొవ్వే అని మనం అందరం గుర్తు ఉంచుకోవాలి. కాబట్టి, రోజుకు ఎంత శాతం తినాలి అనే విషయమై మీ అంతటామీరే ఒక ప్రామాణికాన్ని నిర్దేశించుకొని కొబ్బరిని తీసుకోవడం మంచిది.

English summary

Six Healthy Foods That Might Be Stopping You From Losing Weight

A healthy diet is the way to go! But that's not the case when you are trying to reduce some pounds. Even after being on a healthy diet, you may sometimes find yourselves having a tough time trying to lose weight. There is a difference in eating a healthy-nutritious diet and a diet designed for you to lose weight.
Story first published: Wednesday, February 14, 2018, 14:20 [IST]