Latest Updates
-
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది!
KGF actor Yash:రాఖీ భాయ్ ఫిట్ నెస్ రహస్యాలేలివే...
KGF స్టార్ హీరో యష్ ఫిట్ నెస్ రహస్యాలేంటి? అలాంటి బాడీ కోసం ఏమి చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
కన్నడ సూపర్ స్టార్ హీరో యష్ తన నటనతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. KGF సినిమాతో తన పేరు ప్రపంచమంతా మారుమోగిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అదే పంథాను కొనసాగిస్తూ కేజీఎఫ్ చాప్టర్-2లోనూ అదరగొట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాలో పర్ఫెక్ట్ బాడీ కోసం, బలమైన ఫిజిక్ కోసం తను చాలానే కష్టపడ్డాడు. దీని కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా చెమట చుక్కలను చిందించాడు. ఈ సందర్భంగా యష్ తన పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం ఏమి చేశాడు.. ఎంతమేరకు కష్టపడ్డాడు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

KGF హీరో యష్ డైట్ ప్లాన్..
Healthogi.comలోని ఓ నివేదిక ప్రకారం, కన్నడ స్టార్ హీరో యష్ కఠినమైన డైట్ ప్లాన్ ను పాటించేవాడు. తన బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా పిండి పదార్థాలను చేర్చుకునేవాడు. యష్ నట్స్ తో కూడిన ఒక బౌల్ జాజికాయ, ఐదు ముక్కల బ్రౌన్ బ్రెడ్ మరియు ఎనిమిది గుడ్లలోని తెల్లసొనను కూరగాయలతో కలుపుకుని తింటాడు. వీటితో పాటు చిన్న పుచ్చకాయ లేదా బొప్పాయి వంటి పండ్లను కూడా తన ఆహారంలో రెగ్యులర్ గా చేర్చుకుంటాడు.

వర్కవుట్ల ప్లాన్..
యష్ వారంలో ఆరుసార్లు వర్కవట్ల శిక్షణ తీసుకుంటాడు. తన వర్కవుట్లలో భాగంగా కార్డియో మరియు కండరాల శిక్షణ కలయిక ఉంటుంది. ఇది తన బాడీని పర్ఫెక్ట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. తను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వ్యాయమం ప్రారంభిస్తాడు. జూమ్ టీవీలోని ఒక నివేదిక ప్రకారం, యష్ ఒక గంట కార్డియోకు కేటాయించి, ఆపై బరువులు ఎత్తేందుకు ప్రాధాన్యత ఇస్తాడు. అలాగే వివిధ రకాల వర్కవుట్లు చేస్తాడు. కనీసం ఒక గంట సమయం ABS వర్కౌట్లు చేస్తాడు. అలాగే అరగంట పాటు పుష్ అప్స్, పుల్ అప్స్ వంటి వాటిని ఖాళీ కడుపుతో కఠినమైన శిక్షణ తీసుకుంటాడు. ఇక రోజులో రెండుసార్లు వర్కవుట్లు చేస్తుంటాడు. విశ్రాంతి తీసుకోవడానికి మరియు తనకు నచ్చిన ఆహారాన్ని తినడానికి వారానికి ఒకరోజు చీట్ డేని ఫాలో అవుతాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Healthogi.comలోని ఓ నివేదిక ప్రకారం, కన్నడ స్టార్ హీరో యష్ కఠినమైన డైట్ ప్లాన్ ను పాటించేవాడు. తన బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా పిండి పదార్థాలను చేర్చుకునేవాడు. యష్ నట్స్ తో కూడిన ఒక బౌల్ జాజికాయ, ఐదు ముక్కల బ్రౌన్ బ్రెడ్ మరియు ఎనిమిది గుడ్లలోని తెల్లసొనను కూరగాయలతో కలుపుకుని తింటాడు. వీటితో పాటు చిన్న పుచ్చకాయ లేదా బొప్పాయి వంటి పండ్లను కూడా తన ఆహారంలో రెగ్యులర్ గా చేర్చుకుంటాడు.
యష్ వారంలో ఆరుసార్లు వర్కవట్ల శిక్షణ తీసుకుంటాడు. తన వర్కవుట్లలో భాగంగా కార్డియో మరియు కండరాల శిక్షణ కలయిక ఉంటుంది. ఇది తన బాడీని పర్ఫెక్ట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. తను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వ్యాయమం ప్రారంభిస్తాడు. జూమ్ టీవీలోని ఒక నివేదిక ప్రకారం, యష్ ఒక గంట కార్డియోకు కేటాయించి, ఆపై బరువులు ఎత్తేందుకు ప్రాధాన్యత ఇస్తాడు. అలాగే వివిధ రకాల వర్కవుట్లు చేస్తాడు. కనీసం ఒక గంట సమయం ABS వర్కౌట్లు చేస్తాడు. అలాగే అరగంట పాటు పుష్ అప్స్, పుల్ అప్స్ వంటి వాటిని ఖాళీ కడుపుతో కఠినమైన శిక్షణ తీసుకుంటాడు. ఇక రోజులో రెండుసార్లు వర్కవుట్లు చేస్తుంటాడు. విశ్రాంతి తీసుకోవడానికి మరియు తనకు నచ్చిన ఆహారాన్ని తినడానికి వారానికి ఒకరోజు చీట్ డేని ఫాలో అవుతాడు.

Click it and Unblock the Notifications