Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
Weight Loss Diet Tips: తినేటప్పుడు చేసే ఈ తప్పులే బరువు పెరగడానికి కారణం
Weight Loss Diet Tips: అధిక బరువు ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారింది. బరువు తగ్గడానికి, ఫ్యామిలీ ప్యాక్ పోగొట్టుకోవడానికి చాలా మంది వ్యాయామాలకు వెళ్తుంటారు.. డైట్ పాటిస్తుంటారు. అయితే కొందరు ఎంత డైట్ చేసినా బరువు మాత్రం తగ్గరు.

తినేటప్పుడు చేసే ఈ తప్పుల వల్లే ఎక్కువ మంది బరువు పెరుగుతుంటారు. అసలు ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తగినంత ప్రోబయోటిక్స్ తీసుకోకపోవడం
ఆరోగ్యకరమైన జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి, ప్రేగుల్లో బ్యాక్టీరియా యొక్క మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి పెరుగు వంటి ప్రోబయోటిక్స్‌ను తగినంతగా తీసుకోవాలి. వీటి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావు. ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలు దరిచేరవు.

కొవ్వు పదార్థాలను తగినంతగా తీసుకోకపోవడం
బరువు తగ్గాలన్నా, మంచి బరువు మెయింటైన్ చేయాలన్నా కొవ్వు అస్సలే తినొద్దని కొందరు అనుకుంటారు. కొవ్వు పదార్థాలను పూర్తిగా దూరం పెడతారు. అయితే శరీరానికి శక్తి వచ్చేది కొవ్వు పదార్థాల నుండే. కాబట్టి రోజు శరీరానికి ఎంత అవసరమే అంత కొవ్వు తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. రోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. అయితే చెడు కొవ్వును కాకుండా మంచి కొవ్వును తీసుకోవాలి. గింజలు, అవకాడోలు, ఆలివ్ నూనె మొదలైన కొవ్వు ఆమ్లాలను తీసుకోవడం చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

సమతుల్య ఆహారం తీసుకోకపోవడం
తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉందో లేదో అనేది చాలా చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం అంటే.. అందులో కొవ్వులు, ఫైబర్, పోషకాలు, విటమిన్లు అన్నీ శరీరానికి కావాల్సినంతగా ఉండటం ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, కోడి గుడ్లు, నూనెలు తీసుకోవడమే సమతుల్య ఆహారం. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల సగం రోగాలను దూరం ఉంచవచ్చు.

అల్పాహారం చేయకపోవడం
ఉదయం రాజులా తినాలి, మధ్యాహ్నం రాకుమారుడిలా తినాలి, రాత్రి పేదవాడిగా తినాలి. అనేది నానుడి. అంటే ఉదయం వేళ మంచి ఆహారం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. పగటివేళ మితాహారం తీసుకోవాలి, రాత్రి వేళ చాలా తక్కువ మాత్రమే తినాలి.
అల్పాహారం చేయకపోవడం వల్ల మధ్యాహ్నం ఎక్కువ మొత్తంలో తినాల్సి వస్తుంది. అలాగే రాత్రి కూడా ఎక్కువ తినేస్తాం. దీని వల్ల బరువు పెరుగుతాం.

అదే నూనెను మళ్లీ ఉపయోగించడం
స్వీట్లు, చిరుతిళ్లు చేసినప్పుడు ఎంతో కొంత నూనె మిగిలిపోతుంది. ఈ నూనెను మళ్లీ మరో వంటకానికి ఉపయోగిస్తారు చాలా మంది. కానీ ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది.



Click it and Unblock the Notifications
