Latest Updates
-
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా?
ప్రాణాంతక డెంగ్యూని నివారించడానికి ఇంట్లోనే చక్కటి పరిష్కారాలు
ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న డెంగ్యూ మహమ్మారిని తరిమికొట్టడానికి ఇంట్లోనే చక్కటి పరిష్కారాలున్నాయి. ఉన్నట్టుండి జ్వరంతో మొదలై.. కొన్ని వారాలపాటు వ్యాధి లక్షణాలు రోగులను వేధిస్తున్నాయి. తీవ్ర తలనొప్పి, కీళ్ల నొప్పులు డెంగ్యూ వ్యాధి ప్రధాన లక్షణాలు. చర్మంపై దురదలు కూడా డెంగ్యూ లక్షణాల్లో ఒకటి.
READ MORE: రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 10 ఉత్తమ ఆహారాలు
ఈడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం సోకుతోంది. డెంగ్యూ సోకినప్పుడు నొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. జ్వరం తగ్గినా.. ఈ నొప్పులు కొన్ని వారాలపాటు బాధిస్తాయి. ఆకలి ఉండదు. చర్మంపై దురదలు, మచ్చలు రావడం, ప్లేట్ లెట్స్ తగ్గిపోతాయి. ఈ వైరస్ సోకిందని నిర్ధారణ అయినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇది తీవ్రం కాకుండే.. ఇంట్లోనే పరిష్కార మార్గాలు ఫాలో అవడం మంచిది. డెంగ్యూ నివారించడానికి ఇంట్లో ఉన్న చక్కటి మార్గాలేంటో తెలుసుకుందాం..

తులసి ఆకులు
డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి తులసి ఆకులు చక్కటి పరిష్కారం. రోజుకి రెండు సార్లు.. 10 నుంచి 15 తులసి ఆకులు నమలడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

కొత్తిమీర
కొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సహజ మందులా పనిచేస్తుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలతో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవాలి.

ఉమ్మెత్త ఆకులు
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఉమ్మెత్త ఆకులు బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ వైరస్ బారి నుంచి తగ్గించి.. జ్వరాన్ని నివారించడానికి ఈ ఆకులు తోడ్పడతాయి.

మెంతులు
డెంగ్యూ నివారణలో చక్కటి పరిష్కారంగా మెంతులు చెప్పవచ్చు. మెంతులతో చేసిన టీ తాగితే మంచిది. నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించి.. ప్రశాంతతో కూడిన నిద్రకు మెంతులు సహకరిస్తాయి.

ఉసిరి రసం
ఉసిరి జ్యూస్ తాగడం వల్ల.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే.. రోజుకు ఒకసారి ఉరిసి జ్యూస్ తాగండి.

ఆరంజ్ జ్యూస్
డెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ వైరస్ ని నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి.

బొప్పాయి రసం
రోజుకి ఒక గ్లాస్ బొప్పాయ రసం తాగడం వల్ల డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టవచ్చు. ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కి శక్తినిస్తుంది.

దానిమ్మ జ్యూస్
డెంగ్యూ జ్వరంలో ముందుగా వేధించే పెద్ద సమస్య ప్లేట్ లెట్స్ పడిపోవడం. కాబట్టి.. దానిమ్మ జ్యూస్, బార్లీ గ్రాస్ టీ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ ని పెంచవచ్చు. ప్లేట్ లెట్స్ స్థాయిని పెంచడంలో బార్లీ గ్రాస్ టీ బాగా సహాయపడుతుంది.

వేపాకు
వేపాకులను ఉడకబెట్టి.. ఆ నీటిని తాగడంవల్ల.. వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్ లెట్స్ ని పెంచవచ్చు. దీంతో పాటు.. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

నీళ్లు
మంచి నీళ్లు ఎలాంటి రోగానికైనా.. చక్కటి పరిష్కారం. అయితే.. డెంగ్యూ జ్వరం నివారణలో నీళ్లు బాగా సహకరిస్తాయి. బాడీ పెయిన్స్, తలనొప్పి, కండరాల నొప్పులను నివారించడానికి నీళ్లు బాగా తాగాలి. శరీరంలో ఉన్న విషాన్ని బయటకు పంపడానికి కూడా నీళ్లు ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications
