Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
అల్జైమర్ పేషంట్స్ కోసం సాఫ్ట్ ఫుడ్స్: ప్రపంచ అల్జైమర్ డే
ఈ రోజు అంటే సెప్టెంబర్ 21 ప్రపంచ అల్జైమర్ డే. ఒక వయస్సు దాటాక మతిమరుపు రావడం అనేది సహజం. వృద్ధాప్యంలో వచ్చే అల్జైమర్స్ వ్యాప్తి ఇటీవల బాగా పెరిగింది. దాంతో అల్జైమర్స్ రోగుల సంఖ్యం కూడా పెరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు ఆయు:ప్రమాణాలు పెరగడంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. దాంతో అల్జైమర్స్ బారీన పడే వారి సంఖ్య ఆందోళ కలిగిస్తోంది. అల్జైమర్స్ అంటే అదేదో మతిమరపు వ్యాధి మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. కానీ దీని తీవ్రత అంత కంటే ఎక్కువే. నేడు వరల్డ్ అల్జైమర్స్ యాక్షన్ డే సందర్భంగా అల్జైమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఈ కథనం.
మనందరం ఏదో ఒక విషయాన్ని మరిచిపోతుంటాం. ఇలా మరిచిపోవడం వల్ల కలిగే నష్టం తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా దాని వల్ల మన రోజువారీ పనులకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. కాస్త వయస్సు పైబడ్డ తర్వాత మతిమరుపు వచ్చిందనుకోండి. దానివల్ల కొన్ని నష్టాలున్నా జీవితం పెద్దగా అస్తవ్యస్తం కాదు. కానీ అల్జైమర్స్ అలా కాదు. మరుపు, మతిమరుపునకు తారాస్థాయిగా అల్జైమర్స్ ను పేర్కొనవచ్చును.
అల్జైమర్స్ కు ఒక చిన్ ఉదాహరణ చూద్దాం.. ఐదు నిముషాల క్రితం అక్కడే ఉంచిన తాళాలు ఎక్కడుంటాయో తల బాదుకున్నా ఒక్కోసారి గుర్తురావు. ఫ్రిజ్‌దాకా వెళ్లి ఎందుకోసం వచ్చామో ఎంతకీ తట్టదు. మళ్లీ పొయ్యి దగ్గరకు వెళ్లగానే గుర్తొస్తుంది. ఫలానా స్నేహితురాలు ఫోన్‌చేసినపుడు ఫలానా విషయం చెబుదామని అనుకుంటాం. ఆ విషయం ఫోన్ పెట్టిన తరువాత గుర్తొస్తుంది. అలాగని అన్నీ మర్చిపోతామా అంటే లేదు. చిన్ననాటి సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పమంటే రెడీ! ఫలానా పండుగరోజు ఏం చేశామన్నది టీకా, తాత్పర్యాలతో సహా గుర్తే! మరి వయసుతో వచ్చే ఈ మతిమరుపును చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అధిగమించొచ్చు.
అల్జైమర్స్ ను నివారించడానికి కొన్ని సాఫ్ట్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఈ పరిస్థితిని కంట్రోల్ చేయవచ్చు . ఈ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, వేగవంతంగా వచ్చే డెత్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ను నిరోధిస్తుంది. మరి ఆ ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

ఓట్స్:
ఓట్స్ ఒక హెల్తీ సాప్ట్ ఫుడ్. కాబట్టి ఈ ఫుడ్ ను అల్జైమర్స్ ఉన్నపేషంట్ ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది . బ్రేక్ ఫాస్ట్ కోసం తీసుకొనే ఒక కప్పు ఓట్స్ వారిని యాక్టివ్ గా ఉంచుతుంది. ఓట్స్ కు పాలు జోడించడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది.

రైస్ పోరిట్జ్:
మతిమరపు ఉన్నవారికి రైస్ పోరిట్జ్ ఒక హెల్తీ స్మూత్ డ్రింక్. ఈ రైస్ గంజిని మతిమరుపు ఉన్న వారికి అందివ్వడం వల్ల మతిమరుపున్న పేషంట్స్ కు అవసరం అయ్యే కార్బోహైడ్రేట్స్ అందుతాయి . అలాగే ఫైబర్ కూడా అందివ్వవచ్చు . రైస్ వాటర్ లేదా గంజి మతిమరుపున్న వారు తీసుకోవడం ద్వారా వారిలో వ్యాధినిరోధకత పెరుగుతుంది. బ్రెయిన్ కు మంచిది.

కిచిడి:
కిచిడిలో న్యూట్రీషియన్స్, ప్రోటీనులు, మరియు ఇతర మినిరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఒక బౌల్ కిచిడి తినడం వల్ల హెల్తీ ట్రీట్ వంటిది. ఆల్జైమర్స్ పేషంట్స్ కు ఇది ఒక డైలీ రొటీన్ ఫుడ్. దీన్ని వారంలో కనీసం మూడుసార్లైనా తీసుకోవడం మంచిది

పెరుగు :
పెరుగు అన్నం వంటి సాప్ట్ ఫుడ్ ను ఆల్జైమర్స్ పేషంట్స్ కు అందివ్వడం ఆరోగ్యకరం . అలాగే ఈ పెరుగు అన్నంలో కొద్దిగా పండ్ల ముక్కలు జోడించడం వల్ల మరింత ఆరోగ్యం.

మిల్క్ రైస్:
మతి మరుపున్న పేషంట్స్ యొక్క డైట్ విషయంలో మీరు రైస్ చేర్చాలనుకొన్నప్పుడు, ఇలా పాలు, పెరుగు వంటి ఆహారాలతో రైస్ ను జోడించి ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి సాఫ్ట్ డ్రింక్ వల్ల ఆల్జైమర్స్ పేషంట్స్ కు అవసరం అయ్యే క్యాల్షియం, మరియు ఫైబర్ పుష్కలంగా అందుతాయి . ఇలాంటి సాఫ్ట్ ఫుడ్స్ ఏ పేషంట్ కు అయినా ఫర్ఫెక్ట్ మీల్.

వాటర్:
సాఫ్ట్ ఫుడ్స్ ఎన్ని తీసుకొన్నా, అవి సరిగా జీర్ణం అవ్వడానికి సరిపడా నీరు త్రాగాలి . మరియు నీరు అధికంగా ఉన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి . ఆరెంజ్, మోసంబి, వాటర్ మెలోన్, నిమ్మరసం వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం, ఆల్జైమర్స్ పేషంట్స్ కు చాలా అవసరం.



Click it and Unblock the Notifications