Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
తరచుగా మూత్ర విసర్జనకి వెళ్ళాలనిపిస్తోందా??పొత్తి కడుపు లో ఏదోపొడుస్తున్నట్లు నెప్పి వస్తోందా??
మీకు తరచుగా మూత్ర విసర్జనకి వెళ్ళాలనిపిస్తోందా??పొత్తి కడుపు లో ఏదోపొడుస్తున్నట్లు నెప్పి వస్తోందా?? "ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్" ఒక దీర్ఘకాలిక వ్యాది. దీనివల్ల విపరీతమయిన అసౌకర్యం మరియు నెప్పి కలుగుతాయి.కొన్ని తీవ్రమైన కేసులలో అయితే కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ లేదా రుమటాయిడ్ ఆర్ధరైటిస్ తో బాధపడే వారిలా జీవితం అయిపోతుంది.
వింటుంటేనే భయంకరం గా ఉంది కదూ?? అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది దీని నివారణా మార్గాలేమిటి?? కొన్ని అతి సామాన్య పదార్ధాలనుపయోగంచి ఈ వ్యాధి ని దూరం పెట్టవచ్చా?? తెలుసుకోవాలనుందా, అయితే చదవండి.
READ MORE: మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే హోం రెమెడీస్
"ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్" లేదా "ఐ.సీ" గా పిలవబడే ఈ వ్యాధి మూత్రాశయానికి సంబంధించినది.మన శరీరం లో మూత్రాశయం ఒక బెలూన్ లా ఉంటుంది. శరీరం నుండి మూత్రం విసర్జింపబడటానికి ముందు ఇక్కడ నిలువ చేయబడుతుంది.మూత్రాశయ గోడలు కండరాలతో చెయ్యబడటం వల్ల మూత్రాశయం నిండగానే కండరాలు వ్యాకోచించి, ఖాళీ అయినప్పుడు సంకోచిస్తాయి.ఈ గోడలకి వేల కణాలు పూత(లైనింగ్)గా ఉండటం వల్ల ప్రత్యక్షం గా మూత్రం మూత్రాశయ గోడలని తాకదు.
ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్ వ్యాధి లో మూత్రాశయ గోడల లైనింగ్ వాచడం వల్ల మూత్రం నిండగానే మూత్రాశయం సాధారణం గా వ్యాకోచించినట్లు వ్యాకోచించదు.అందువల్లనే మూత్ర విసర్జన సమయం లో లోపలనుండి పొడుస్తున్నట్లున్న నెప్పి.
ఈ ఐ.సీ. ని యూటీఐ(యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్) అనుకుని పొరపడుతుంటారు. ఐ.సీ అసలు బాక్టీరియా వల్ల కలగదు అందువల్ల మీరు తీసుకునే యాంటీబయోటిక్స్ కూడా నిరుపయోగం.మొట్టమొదట ఐ.సీ. వ్యాధి లక్షణాలు హార్మోనులు లేదా వ్యాధి నిరోధక శక్తి లక్షణాలయిన "ఎండోమెట్రోసిస్" లేదా ట్యూమర్ లక్షణాలయిన "యుటెరిన్ ఫైబ్రాయిడ్స్" లా ఉంటాయి.
READ MORE: పీరియడ్స్ ముందు మరియు తర్వాత శృంగారం: ప్రభావాలు
ఈ వ్యాధి కలగడానికి ఇదీ ఫలానా కారణం అని తెలీదు. ఒక్కోమనిషిలో ఒక్కో కారణం వల్ల కలుగుతుంది.కానీ ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని ముందస్తు లక్షణాలని లేదా ఈ వ్యాధి కలగచేసే రుగ్మతలని మాత్రం పరిశోధకులు కనుగొన్నారు.అవేమిటంటే.

ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్ లక్షణాలు
మూత్రాశయ గోడల లైనింగ్ లొ లోపం వల్ల విషపూరితమయిన మూత్రం మూత్రాశయ గోడలని తాకుతుంది.

ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్ లక్షణాలు
‘మస్ట్ సెల్స్" అనబడే ఒక ప్రత్యేక కణాల వల్ల హిస్టమైన్ అనే హానికారక రసాయనం అతిగా ఉత్పత్తి అవుతుంది.ఈ "మస్ట్ సెల్స్" సాధారణం గా శరీరాన్ని అలెర్జీల నుండి రక్షించడానికి ఉత్పత్తి అవుతాయి.

ఇంటర్ స్టీషియల్ సిస్టిటిస్ లక్షణాలు
"ఆటో ఇమ్యూన్" రుగ్మత వల్ల శరీరం ఆరోగ్యం గా ఉన్న శరీర భాగాల మీద, కణాల మీద దాడి చేస్తుంది. ఈ దాడిలో ఆరోగ్యం గా ఉన్న కణాలు నాశనమవ్వడం వల్ల మీకు హాని కలుగుతుంది.

పొత్తి కడుపు నెప్పి మరియు తరచుగా మూత్ర విసర్జన చెయ్యడం లాంటి సూచనల వల్ల ఐ.సీ. లక్షణాలుగా దాదాపు గుర్తించవచ్చు.
పొత్తికడుపులో అసౌకర్యం.జననాంగం, పాయువు మధ్యలో నెప్పి

పొత్తి కడుపు నెప్పి మరియు తరచుగా మూత్ర విసర్జన చెయ్యడం లాంటి సూచనల వల్ల ఐ.సీ. లక్షణాలుగా దాదాపు గుర్తించవచ్చు.
పొడుస్తున్నట్లుండే పొత్తి కడుపు నెప్పి

పొత్తి కడుపు నెప్పి మరియు తరచుగా మూత్ర విసర్జన చెయ్యడం లాంటి సూచనల వల్ల ఐ.సీ. లక్షణాలుగా దాదాపు గుర్తించవచ్చు.
కొంచెం కొంచెం అయినా తరచూ మూత్ర విసర్జన చెయ్యాల్సిరావడం

పొత్తి కడుపు నెప్పి మరియు తరచుగా మూత్ర విసర్జన చెయ్యడం లాంటి సూచనల వల్ల ఐ.సీ. లక్షణాలుగా దాదాపు గుర్తించవచ్చు.
అకస్మాతుగా మూత్ర విసర్జన చెయ్యాలనిపించి నిద్ర నుండి లేవడం.ఐ.సీ రోగులు దాదాపు 50 సార్లు మూత్ర విసర్జన చేస్తారు

పొత్తి కడుపు నెప్పి మరియు తరచుగా మూత్ర విసర్జన చెయ్యడం లాంటి సూచనల వల్ల ఐ.సీ. లక్షణాలుగా దాదాపు గుర్తించవచ్చు.
బాధాకరమైన/నెప్పితో కూడిన కలయిక

పొత్తి కడుపు నెప్పి మరియు తరచుగా మూత్ర విసర్జన చెయ్యడం లాంటి సూచనల వల్ల ఐ.సీ. లక్షణాలుగా దాదాపు గుర్తించవచ్చు.
మూత్రాశయం నిండగానే అతి తీవ్ర సౌకర్యం , ఖాళీ అవ్వగానే వెంటనే ఉపశమనం
ముందే చెప్పినట్లు ఈ వ్యాధి లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు.ఈ లక్షణాలు ఒక్కోసారి అప్పుడప్పుడు మాత్రమే ఉండటం వల్ల మీకు ఐ.సీ వ్యాధి ఉన్నాకూడా అకస్మాత్తుగా ఉపశమనం లభిస్తూ ఉంటుంది.



Click it and Unblock the Notifications