Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ఆయుర్వేదిక్ రెమెడీస్ ...
దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. ప్రపంచాన్నే వనికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. ఒక సారి వచ్చిందంటే తర్వాత చచ్చే వరకూ పోదు. కాబట్టి, దీన్ని నివారించుకోలేము కాబట్టి, డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. ఒక వేళ డయాబెటిస్ కు గురైనట్లైతే శరీరంలో షుగర్ లేదా ఇన్సులిన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఇన్సులిన్ సరిగా లేనందున ఇన్సులిన్ రెస్టిటెంట్ డయాబెటిస్ కు కారణమవుతుంది.
డయాబెటిస్ అన్ని వయస్సుల వారికి వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ తో బాధపడే వారిలో నీరసం, అలసట, బరువు తగ్గిపోవడం, తరచూ మూత్ర సమస్య, కంటి చూపు బ్లర్ గా కనిపించడం , తరచూ ఎక్కువ ఆకలిగా ఉండటం ఇవన్నీ డయాబెటిస్ కు ముఖ్య లక్షణాలు. డయాబెటిస్ ఉన్న వారిలో కాళ్లలో వాపు, నొప్పి, తిమ్మెర్లుగా ఉండటం జరుగుతుంది..
డయాబెటిస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ స్టైల్ మరియు ఆహారపు అలవాట్లలో మార్పుల తప్పనిసరిగా చేసుకోవాలి. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదిక్ రెమెడీస్ కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో ఆయుర్వేద రెమెడీస్ బాగా పనిచేస్తాయి. డయాబెటిస్‌ను తగ్గించడంలో ఇవి న్యాచురల్ రెమిడీస్‌గా పనిచేస్తున్నాయి. మోడ్రన్ మెడిసిన్స్‌తో పోల్చితే ఇవి చాలా సురక్షితం కూడా. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

మెంతులు :
డయాబెటిస్ తో బాధపడుతున్నట్లయితే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే సాపోనిన్స్ అనే మిశ్రమం భోజనం తర్వాత కార్బోహైడ్రేట్స్ గ్రహించడాన్ని స్లో అయ్యేలా చేస్తుంది. అంతే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.

దాల్చిన చెక్క:
బ్లడ్ షుగర్ ను నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంుదలో ఉన్న హైడ్రాక్సిచల్ కోన్ మిశ్రమం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచుతుంది.

నేరేడు పండ్లు:
నేరేడు పండ్లలో యాంటీబయోటిక్ గుణాలున్నాయని విశ్వసిస్తారు. ఈ పండ్లలో ఉండే జాంబొలైన్ అనే కెమికల్ బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది.

తిప్పతీగ:
ఇందులో యాంటీబయోటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఇందులో ఉండే జాంబొలైన్ అనే కెమికల్ బ్లడ్ షుగర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రంలో షుగర్ పోవడాన్ని తగ్గిస్తుంది.

వేపాకులు:
వేపాకులను రెండు మూడు నోట్లో వేసుకుని నమిలి మింగడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడం వల్ల ఇది గ్రేట్ ఆయుర్వేదిక్ రెమెడీ. వేపలో ఉండే ఔషధలక్షణాల వల్ల , ఇది ఒక ఉత్తమం యాంటీ హైపర్ గ్లిసిమక్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉన్నది.

ఆమ్లా:
ఆమ్లాను ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు., టైప్ 2 డయాబెటసి్ ను నివారించడంలో ఇది ఒక అమ్మమ్మల మెడిస్ . ఆమ్లాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి, ఇన్సులిన్ ఉత్పతి క్రమబద్దం చేస్తుంది. ఆమ్లా జ్యూస్ లేదా ఆమ్లా పౌడర్ ను గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.

కాకరకాయ రసం:
కాకరకాయలో ఫైటోన్యూట్రీయంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ ను కాలేయం, మజిల్స్ వంటి ఇతర బాగాలకు అందేలా చేస్తుంది . డయాబెటిక్ ఉన్నవారిలో ఇన్సులిన్ లెవల్స్ తగ్గించడానికి అందేలా చేస్తుంది . అలాగే ఆల్ఫా గ్లూకోసిడైజ్ ఎంజైమ్ ను తగ్గిస్తుంది ఇది హైపర్ గ్లూకోమియా లెవల్స్ తగ్గిస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి .

ప్యానాక్స్ జెన్సింగ్:
ఆయుర్వేదంలో ఇది ఒక పాపుల్ హెర్బ్, పానాక్స్ జన్సింగ్ వేర్లు లేదా పండ్లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుందని కనుగొన్నారు . జెన్సింగ్ వేర్లను ఎండబెట్టి, పౌడర్ చేసి , యాబెటిస్ ఉన్నవారు తీసుకోవాలి .

గుర్ మర్:
పురాత కాలం నుండి గుర్ ముర్ వాడుకలో ఉన్నది, ఇందులో క్లింబర్ అనే కంటెంట్ కనుగొనడంజరిగింది. ఇది టైప్ 2 డయాబెటిస్ కు ఒక ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీ .. కొన్ని గుర్ మర్ మెక్క ఆకులు తీసుకొని , శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమలాలి. లేదంటే ఈ ఆకులను ఎండబెట్టి, టీ లాగా మరిగించాలి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తులసి ఆకులు
తులసి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి. తులసి ఆకులలో ఆక్సీకరణ ఒత్తిడి ఉపశమనానికి శక్తివంతమైన యాంటీఆక్సిడాంట్స్ కలిగి ఉంటాయి. మధుమేహం సమస్యల కాంపౌండ్స్ ఒత్తిడిని తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
