Latest Updates
-
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో?
స్లిమ్‌గా, నాజూగ్గా తయారవ్వడానికి సింపుల్ అండ్ న్యాచురల్ టిప్స్..!!
హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయినప్పుడు మాత్రమే.. బరువు తగ్గడం సాధ్యమవుతుంది. వ్యాయామం, ఇతర శారీరక యాక్టివిటీస్ వల్ల శరీరం షేప్ లో ఉంటుంది, కానీ.. మీరు బరువు తగ్గాలి అనుకుంటే.. న్యాచురల్ పద్ధతులు పాటించండి. ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌పై నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ప్రధాన సమస్య ఊబకాయం, బరువు పెరగడం. అందుకే త్వరగా బరువు తగ్గిపోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కొందరైతే జిమ్ లకు పరుగులు పెడతారు. మరి కొందరు ఆస్పత్రులు, క్లినిక్ లను నమ్ముకుంటారు. కానీ అలాంటి ప్రయాసలు అవసరం లేకుండా స్లిమ్‌గా మారేందుకు చక్కటి టిప్స్ మీ కోసం.. ఫాలో అవ్వండి సన్నని మెరుపుతీగలా మారిపోండి.

బ్రేక్ ఫాస్ట్
ఉదయం ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న బ్రేక్ ఫాస్ట్ తినాలి. అలా తినడం వల్ల మిగతా రోజంతా ఆకలి అంతగా ఉండదు. అదనంగా తినడం తగ్గుతుంది.

నీళ్లు
భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగాలి. మూడు నెలలపాటు ఇలా చేస్తే బరువు తగ్గే వేగం 44 శాతం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

పైబర్
సాల్యుబుల్ పైబర్ కొవ్వును తగ్గిస్తుంది. అది కూడా పొట్ట ప్రాంతంలో..అందుకని సాల్యుబుల్ పైబర్ కలిగి ఉన్న ఓట్ బ్రాన్, బార్లీ, నట్స్, సీడ్స్, బీన్స్, లెంటిల్స్ , బఠాణీలు, కొన్ని పళ్లు, కూరగాయాల వంటివి తినాలి.

ప్రాసెస్ చేయని ఆహారం
ప్రాసెస్ చేయని ఆహారాన్నే తినాలి. ఈ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్టని నిండుగా ఉంచి మితంగా తినేలా చేస్తాయి.

పళ్ల రసాలు
తియ్యటి పానీయాలు, పళ్ల రసాలు దరిచేయనీయొద్దు. ఇవి శరీరంలోకి కొ్వ్వును చేరుస్తాయి. అందుకని వీటికి దూరంగా ఉంటే బరువు తగ్గడం తేలికవుతుంది.

కాఫీ, టీ
కాఫీ, టీ లు సేవించే అలవాటు ఉందా..అయితే ఎంచక్కా వాటిని తాగొచ్చు. వీటిలో ఉంటే కెపైన్ జీవక్రియల్ని 3.11 శాతం పెంచుతుంది.

చిన్న ప్లేట్స్‌లో
చిన్న ప్లేట్స్‌లో తింటే మీకు తెలియకుండానే తక్కువ తింటారని పరిశోధల్లో వెల్లడైంది. సో..ఇక నుంచి చిన్న పళ్లాల్లోనే తినడం మొదలు పెట్టండి.

గబగబా తినే అలవాటు
గబగబా తినే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానాలి. ఎందుకంటే ఇలా తినేవాళ్లు కొంతకాలంలోనే ఎక్కువ బరువు పెరుగుతాయి. నెమ్మదిగా తినేవాళ్లకి పొట్ట నిండుగా ఉంటుంది. బరువును తగ్గించే హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.

నిద్ర
ప్రతిరోజు రాత్రి హాయిగా నిద్రపోండి. సరిగా నిద్రపోలేదో బరువు పెరిగిపోతారు. అందుకని నిద్ర పట్ల దృష్టి పెట్టండి.

వ్యాయామం
అన్నింటి కంటే ముఖ్యంగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడే.. మీరు అనుకున్న దానికంటే.. ముందే.. బరువు తగ్గుతారు.



Click it and Unblock the Notifications