Latest Updates
-
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.!
ప్రాణాంతక డెంగ్యూ నివారించే.. ఎఫెక్టివ్ హోం రెమిడీస్..!!
ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న డెంగ్యూ మహమ్మారిని తరిమికొట్టడానికి ఇంట్లోనే చక్కటి పరిష్కారాలున్నాయి. ఉన్నట్టుండి జ్వరంతో మొదలై.. కొన్ని వారాలపాటు వ్యాధి లక్షణాలు రోగులను వేధిస్తున్నాయి. తీవ్ర తలనొప్పి, కీళ్ల నొప్పులు డెంగ్యూ వ్యాధి ప్రధాన లక్షణాలు. చర్మంపై దురదలు కూడా డెంగ్యూ లక్షణాల్లో ఒకటి.
డెంగ్యూ మహమ్మారిని గుర్తించే 10 లక్షణాలు
ఈడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం సోకుతోంది. డెంగ్యూ సోకినప్పుడు నొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. జ్వరం తగ్గినా.. ఈ నొప్పులు కొన్ని వారాలపాటు బాధిస్తాయి. ఆకలి ఉండదు. చర్మంపై దురదలు, మచ్చలు రావడం, ప్లేట్ లెట్స్ తగ్గిపోతాయి. ఈ వైరస్ సోకిందని నిర్ధారణ అయినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి.
ప్రతి ఏడాది వర్షాకాలంలో.. డెంగ్యూ ఫీవర్ చాలా వేగంగా, ఎక్కువగా వ్యాపిస్తుంది. డెంగ్యూ అన్ని వయసుల వాళ్లపై దుష్ర్పభావం చూపుతుంది. తక్కువ ఇమ్యునిటీ లెవెల్ ఉన్నవాళ్లలో.. ఇది మరింత ఎక్కువ దుష్ర్పభావం చూపుతుంది. వర్షపు నీళ్ల వల్ల దోమలు, క్రిములు, కీటకాలు ఎక్కువగా వస్తాయి. ఈడిస్ ఈజిప్టై దోమ వల్ల ఇన్ఫెక్షన్ ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది.
అయితే.. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే అలర్ట్ అవ్వాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అయితే.. మొదటి దశలో ఉన్నప్పుడు కొన్ని హోం రెమిడీస్ ని ఫాలో అవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. డెంగ్యూని ఎఫెక్టివ్ గా తరిమికొట్టవచ్చు.

వేపాకులు
కొన్ని వేపాకులు తీసుకుని వాటిని ఉడికించాలి. అవి చల్లారిన తర్వాత.. రోజంతా ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఇది.. ఇమ్యునిటీ లెవెల్ ని మెరుగు పరిచి.. బ్లడ్ ప్లేట్ లెట్ లెవెల్స్ ని పెంచుతుంది.

జామ జ్యూస్
ఒక టీ స్పూన్ తేనెను జామ జ్యూస్ లో కలిపి... రోజుకి ఒకసారి తీసుకుంటే.. డెంగ్యూని తేలికగా నివారించవచ్చు.

నీళ్లు
మంచి నీళ్లు ఎలాంటి రోగానికైనా.. చక్కటి పరిష్కారం. అయితే.. డెంగ్యూ జ్వరం నివారణలో నీళ్లు బాగా సహకరిస్తాయి. బాడీ పెయిన్స్, తలనొప్పి, కండరాల నొప్పులను నివారించడానికి నీళ్లు బాగా తాగాలి. శరీరంలో ఉన్న విషాన్ని బయటకు పంపడానికి కూడా నీళ్లు ఉపయోగపడతాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు.. వైరస్ వల్ల శరీరానికి హాని కలుగకుండా ఉంటుంది.

మెంతులు
మెంతుల పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే.. జర్వం తేలికగా తగ్గుతుంది. మంచి నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

తులసి
కొన్ని తులసి ఆకులు తీసుకుని నములుతూ ఉండాలి. ఇది ఇమ్యునిటీని పెంచి.. వైరల్ ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తాయి.

అలోవెరా జ్యూస్
అలోవెరా ఎమినో యాసిడ్స్ పెంచి, బ్లడ్ ప్లేట్లెట్ లెవెల్స్ ని పెంచుతుంది. డెంగ్యూ ఫీవర్ బారిన పడినవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ముందు బ్లడ్ ప్లెట్లెట్స్, ఎమినో యాసిడ్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి.

ఉసిరి
ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ రూపంలో లేదా ఫ్రూట్ రూపంలో తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ లెవెల్ పెరుగుతుంది. వేగంగా.. డెంగ్యూ ఫీవర్ తగ్గుతుంది.

పసుపు
పసుపు న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. అర టీస్పూన్ పసుపును గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తీసుకోవడం వల్ల.. ఇమ్యునిటీ లెవెల్ పెరగడంతో పాటు.. శరీరంలో మలినాలను తొలగిస్తుంది.

బొప్పాయి ఆకులు
పచ్చి బొప్పాయి ఆకులు తీసుకుని గ్రైండ్ చేయాలి. రసం వడకట్టి.. ప్రతి రోజూ ఒక టీ స్పూన్ తీసుకోవాలి. ఇది.. బ్లడ్ ప్లేట్ లెట్స్ ని ఊహించని రీతిలో పెంచుతుంది.

దానిమ్మ జ్యూస్
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే .. బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి రోజుకి రెండుసార్లు దాన్నిమ్మ జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ నివారించవచ్చు.

బొప్పాయి రసం
రోజుకి ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టవచ్చు. ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉండటం వల్ల ఇమ్యూన్ ని మెరుగుపరుస్తుంది.

ఉమ్మెత్త ఆకులు
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఉమ్మెత్త ఆకులు బాగా ఉపయోగపడతాయి. డెంగ్యూ వైరస్ బారి నుంచి తగ్గించి.. జ్వరాన్ని నివారించడానికి ఈ ఆకులు తోడ్పడతాయి.

ఆరంజ్ జ్యూస్
డెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ వైరస్ ని నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి.

కొత్తిమీర
కొత్తిమీరలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సహజ మందులా పనిచేస్తుంది. కాబట్టి డెంగ్యూ లక్షణాలతో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవాలి.



Click it and Unblock the Notifications