కీమోథెరఫీ చేయించుకునే క్యాన్సర్ పేషంట్స్ ఖచ్చితంగా తినాల్సిన 12 హెల్తీ ఫుడ్స్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ప్రాణాంతక వ్యాధులలో క్యాన్సర్ ఒకటి అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పుడే కాదు, పురాతన కాలం నుండి క్యాన్సర్ తో పోరాడుతూనే ఉన్నారు. క్యాన్సర్ ఒక సైలెంట్ కిల్లర్ సరైన సమయంలో గుర్తించకపోతే, ప్రాణాలను తీసుకునే పోతుంది.

గతంలో క్యాన్సర్ కు చికిత్సకానీ, మందులుకానీ లేకపోవడం వల్ల క్యాన్సర్ బారీన పడినవారు మరిణించే వారి సంఖ్య క్రమంగా పెరిగేది, . కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్జానం, శాస్త్రీయత పెరగడం వల్ల క్యాన్సర్ నివారణకు కొన్ని మందులను కనుగొనడం జరుగుతోంది. క్యాన్సర్ నివారణ చికిత్సలో ఒకటి కీమోథెరఫీ కూడా ఒకటి.

క్యాన్సర్ ప్రారంభదశలో ఉన్న పేషంట్స్ లో రేడియోషన్ థెరఫీ ద్వారా శరీరంలో ఉండే క్యాన్సర్ సెల్స్ ను సులభంగా పోగొడుతున్నారు. అలాగే తిరిగి క్యాన్సర్ సెల్స్ పెరగకుండా, శరీరంలో వ్యాప్తి చెందకుండా చేయడానికి ఈ రేడియేషన్ థెరఫీ సహాయపడుతున్నది.

healthy foods for cancer patients,

ఈ రేడియేషన్ ప్రొసెస్ లో క్యాన్సర్ పేషంట్స్ జీవనశైలిలో అనేక మార్పులు జరుగుతాయి, జుట్టు రాలిపోవడం, బరువు తగ్గడం, అలసట, వాంతులు, మరియు మెమరీ లాస్, ఏకాగ్రతను కోల్పోవడం వంటి ఎన్నో మార్పులు వారి శరీరంలో జరుగుతాయి.

కానీ, అవేకాకుండా, వారు రుచిని కోల్పోవడం, నాలుక మీద టేస్ట్ బడ్స్ తొలగిపోవడం వల్ల రుచిని కోల్పోవడం జరుగుతుంది. అలాంటప్పుడు వారికి ఏం తినాలన్నా ఇష్టం ఉండదు. కానీ, ఇష్టమున్నా లేకున్నా, క్యాన్సర్ ను జయించాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రేడియోషన్ థెరఫీ తీసుకునే వారికి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం.

ఈ బాధాకరమైన రేడియేషన్ థెరఫీని తట్టుకునే శక్తి పొ్ందడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే శరీరంలో క్యాన్సర్ సెల్స్ తొలగి పోయి వాటి స్థానంలో మంచి కణాలు ఉత్పత్తి అవ్వడానికి కూడా ఇవి సహాయపడుతాయి.

అందువల్ల, ఎవరైతే క్యాన్సర్ పేషంట్స్ కీమోథెరఫీ తీసుకుంటున్నారో వారికి, ఈ క్రింది సూచించిన న్యూట్రీషియన్స్ చాలా అవసరం అవుతాయి. మరి అవేంటో తెలుసుకుందాం...

త్రుణ ధాన్యాలు:

త్రుణ ధాన్యాలు:

బ్రౌన్ రైస్, వీట్ బ్రెడ్, బార్లీ, మిల్లెట్, మరియు మరికొన్ని ఇతర ఆహారపదార్థాలు త్రుణధాన్యాలగా సూచిస్తారు. ఒక పూట ఈ త్రుణధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన సెలీనియం, మెగ్నీషియం, ఫైబర్, థైమిన్, విటమిన్ బి6, నియాసిన్ వంటివి పొందవచ్చు. ఇవి హెల్తీ మీల్ మరియు రుచిగా కూడా ఉంటాయి. అంతే కాదు, క్యాన్సర్ తో పోరాడే ఫైటిక్ యాసిడ్స్ ఉండటం వల్ల నార్మల్ మనుషులు కూడా వీటిని తీసుకోవడం వల్ల ముందు ముందు క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు. క్యాన్సర్ తో బాధపడే వారికి క్యాన్సర్ కణాల ఉత్పత్తిని ఆపు చేస్తుంది.

ఆరెంజ్ జ్యూస్ :

ఆరెంజ్ జ్యూస్ :

కీమోథెరఫీ కారణంగా నోరు తడిఆరిపోవడం జరుగుతుంది. శరీరంలో నీరు తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. కీమోథెరఫీ పేషంట్స్ కు ఆరెంజ్ జ్యూస్ ప్రయోజనకరం. ఇది నోరు తడి ఆరకుండా, హైడ్రేషన్ అందిస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ లాలాజల గ్రంథులను ఉప్పత్తి చేసి లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది. అదే విధంగా, క్యాన్సర్ పేషంట్స్ లో గొంతునొప్పి, సోర్ థ్రోట్ ను నివారిస్తుంది.

అల్లం:

అల్లం:

కీమోథెరఫీ చేయించుకునే క్యాన్సర్ పేషంట్స్ లో వికారం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి జింజర్ క్యాండీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఆహారాన్ని తీసుకోవడానికి ముందు కొద్దిగా అల్లం లేదా అల్లం ఆకు , జింజర్ క్యాండీస్ వంటిని చప్పరించడం వల్ల పొట్ట బెట్టర్ గా ఫీల్ అవుతుంది. ఎక్కువగా ఆహారాన్ని తీసుకోగలుగుతారు.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

క్యాన్సర్ పేషంట్స్ కు ఉల్లిపాయలు గ్రేట్ రెమెడీ. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతాయి. కాబట్టి, ఉడికించి లేదా పచ్చివి కూడా తినడం మంచిది. ఉల్లిపాయలు శరీరంలో క్యాన్సర్ సెల్స్ పెరగకుండా చేస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

రేడియేషన్ థెరఫీ వల్ల క్యాన్సర్ పేషంట్స్ ఎప్పుడు వీక్ గా కనబడుతారు. కాబట్టి, వ్యాధినిరోధకతను పెంచి స్ట్రాంగ్ గా ఉండటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. దాంతో శరీరంలో క్యాన్సర్ తో పోరాడే శక్తిని కలిగిఉంటుంది. అందువల్ల రోజుకు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల వ్యాధినిరోధకతను పెంచుకోవడమే కాదు, ప్రాణాంతక వ్యాధి నుండి ప్రాణాలను కాపాడుకోవచ్చు.

బ్రాజిల్ నట్స్ :

బ్రాజిల్ నట్స్ :

బ్రాజిల్ నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో లుకేమియా మరియు మెలనోమా వంటి క్యాన్సర్ నివారించడంలో సహాయపడుతుంది. రోజుకు 4 నట్స్ తినడం వల్ల యాంటీ క్యాన్సర్ గా పనిచేసి, వ్యాధినిరోధకతను పెంచుతాయి.

ఓట్స్ :

ఓట్స్ :

త్రుణధాన్యాలలో ఓట్స్ ఒకటి, ఇది పొట్టను నిండుగా ఉన్న అనుభూతి కలిగించడం మాత్రమే కాదు, క్యాన్సర్ పేషంట్స్ కుముఖ్యంగా కీమోథెరఫీ చేయించుకునేవారికి ఆకలి అనిపించకుండా చేస్తుంది. వ్యాధినిరోధకతను పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే ఇన్సు లిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. రెగ్యులర్ గా మెరుగుపరుస్తుంది. ఇటువంటి గొప్ప ప్రయోజనాలున్న ఓట్స్ ను తప్పనిసరిగా రెగ్యులర్ డైట్ లో ఒక బాగం చేసుకోవడం చాలా అవసరం.

సన్ ఫ్లవర్ సీడ్స్ :

సన్ ఫ్లవర్ సీడ్స్ :

సన్ ఫ్లవర్ సీడ్స్ లో జింక్, విటిమన్ ఇ మరియు సెలీనియం పుష్కలం. ఇవి క్యాన్సర్ పేషంట్స్ కు చాలా అవసరం. ఇవన్నీ ప్రొస్టేట్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి.అలాగే నయం చేసే గుణాలు పెరుగుతాయి. ఒక రోజుకు 25 గ్రాములు సన్ ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం కీమోథెరఫీ పేషంట్స్ కు చాలా అవసరం.

నువ్వులు :

నువ్వులు :

క్యాన్సర్ తో పోరాడే గుణాలు నువ్వుల్లో అధికం. ఇవి రక్తపోటును కంట్రోల్ చేసే శక్తి వీటిలో ఉన్నాయి. అలాగే మానవశరీంలో లిప్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు ఆరోగ్యకరం అని క్లీనికల్ గా నిర్థారించబడినది.

 నట్స్ :

నట్స్ :

బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, హాజల్ నట్స్, పిస్తా వంటి నట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉండదు. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నివారిస్తాయి. రెగ్యులర్ గా కొన్ని నట్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలుండవు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్స్ ,మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ప్రతిఒక్కరిఆరోగ్యానికి చాలా అవసరం, ముఖ్యంగా క్యాన్సర్ ఫేషంట్స్ ఎక్కువగా అవసరం అవుతాయి. క్యాన్సర్ కణాలతో మరియు క్యాన్సర్ కు కారణం అయ్యే బ్యాక్టీరియతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. అలాగే యాంటీ వైరల్ గుణాలుండటం వల్ల ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలు, గ్రీన్ కొల్లార్డ్, కేలా వంటి సలాడ్స్ రూపంలో తీసుకోవాలి.

ధాన్యాలు :

ధాన్యాలు :

పచ్చిబఠానీలు, లెంటిల్స్, బీన్స్, పప్పులు వంటివాటిలో న్యూట్రీషియన్ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ పేషంట్స్ కు తగిన శక్తిని ఇచ్చి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. వీటిలో ఉండే యాంటీ క్యార్సినోజనిక్ గుణాలు, సెలీనియం, డైటరీ ఫైబర్, జింక్, ఫొల్లెట్ వంటి శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల న్యూట్రీషియన్స్ ను అందించి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని అందిస్తాయి..

English summary

Foods That Are Good For Cancer Patients Undergoing Chemotherapy

Having a healthy diet is essential for a cancer patient who is undergoing radiation. Food gives them the strength to combat the painful process of radiation, wherein you can lose your good cells even. So, it is vital that a nutritious diet chart is followed for a patient undergoing chemotherapy.