For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అలవాట్లు మగవారి వీర్యాన్ని తూట్లుగా తూట్లుగా నాశనం చేస్తాయి, అందుకే పిల్లలు పుట్టరు,షాకింగ్ నిజాలు

|

సంతాన లేమి...ఇప్పుడు ఈ సమస్య చాలా మంది దంపతులను వేధిస్తోంది. పెళ్లయి మూడు నాలుగేళ్లయినా ఇంకా పిల్లలు పుట్టలేదా అంటూ అందరూ అడుగుతుంటే చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అంతేకాదు సమస్య నీదా? అమ్మాయిదా? అంటూ గుచ్చి గుచ్చి అడిగే మహానుభావులూ ఉంటారు.

పిల్లలు లేనిదానికంటే ఇటువంటి మాటలు విన్నప్పుడు కలిగే వేదన మాటల్లో చెప్పలేనిది. కారణం ఏదయినా.. పెళ్ళై అయిదేళ్లు దాటినా ఇంకా పిల్లలేరని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని ఓ అధ్యయనం వెల్లడించింది.

పుట్టకపోవడానికి కారణం ఎవరో తెలుసా?

పుట్టకపోవడానికి కారణం ఎవరో తెలుసా?

భార్యాభర్తల్లో పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరో తెలుసా?

ఆడవారు 33%, మగవారు 33%, ఇతర కారణాలు 34% అట. ఇక గర్భం దాల్చే అవకాశాలు ఇలా ఉంటాయి.. పెళ్లయిన అయిదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50%.ఏడాదిలోపైతే 75%... రెండేళ్లలో 85 నుంచి 90 శాతం గర్భం వచ్చే అవకాశాలున్నాయట.

మగవారిలో వంధత్వానికి కారణాలు

మగవారిలో వంధత్వానికి కారణాలు

మగవారిలో వంధత్వానికి కారణాలు ఇవే.. పొగతాగడం, మద్యం సేవించడం. అలాగే గతుకుల రోడ్డు మీద వాహనాలను ఎక్కువగా నడపడం, వృషణాలకు వేడి తీవ్రత ఎక్కువగా గురయ్యే పరిశ్రమల్లో పనిచేయడం వంటివి కూడా మగవారికి పిల్లలు కలగకుండా చేస్తాయి. వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా చికిత్స అయి ఉండడం, గవద బిళ్లలు, సుఖరోగాల ఉండడం కూడా కారణాలే.

పిల్లలు కలగకపోవడానికి ఆడవారిలో కారణాలు

పిల్లలు కలగకపోవడానికి ఆడవారిలో కారణాలు

ఆడవారిలో కారణాలు ఈ విధంగా ఉంటాయి. 18-36 వయస్సులో ఉన్న వారికి గర్భాన్ని దాల్చడానికి అనువైన వయస్సు. 18 లోపు 34 దాటిన వారికి అండాశయ సమస్యలు ఎక్కువ. ఫెలోపియన్‌ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు. అలాగే క్రమరహిత రుతుస్రావం,పెల్‌విక్‌ ఇన్‌ఫెక్షన్స్‌, టి.బి (క్షయ) వంటి రోగాలు, పొగ తాగడం, మద్యం సేవించడం, అండాశయ సమస్యలు కూడా ఆడవారికి పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు.

వ్యాయామం ఎక్కువ చేయొద్దు

వ్యాయామం ఎక్కువ చేయొద్దు

వ్యాయామం కూడా పిల్లలు పుట్టే విషయంలో కీలక పాత్ర వహిస్తుందని మీకు తెలుసా? స్త్రీ పురుషులు ఎంతసేపు వ్యాయామం చేస్తారన్న దాన్నిబట్టి పిల్లలు కలగడమా? కలగకపోవడమా?అన్నది ఉంటుందని ఎప్పుడైనా విన్నారా..?

సాధారణ బరువు ఉన్న ఓ స్త్రీ.. వారానికి అయిదు గంటలకు మించి వ్యాయామం చేస్తే సంతానం కలగడం ఆలస్యమవుతుందట. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నా సరే, పిల్లలు ఆలస్యంగా పుట్టే అవకాశం ఉందట. అదే పురుషుల విషయానికి వస్తే మాత్రం వ్యాయామం చేసే సమయం ఎక్కువగా ఉంటేనే మంచిదట. వారానికి కనీసం 15 గంటల పాటు జిమ్‌లో కష్టపడే వారిలో వీర్యకణాల వృద్ధి 73 శాతం ఎక్కువగా ఉంటుందట.

మగాళ్లూ.. టీవీలు చూస్తే మటాషే

మగాళ్లూ.. టీవీలు చూస్తే మటాషే

ఆఫీసులో ఫుల్లుగా కష్టపడిపోయామని ఇంటికి వచ్చాక తీరిగ్గా టీవీల ముందు కూర్చునే పురుషులు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. గంట, రెండు గంటలయితే సరేకానీ.. వచ్చినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ కొందరు టీవీని అస్సలు వదలరు. అలాంటి వాళ్లు సంతానం విషయంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువేనని బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. వారానికి 20 గంటలకు మించి టీవీల ముందు కూర్చునే పురుషుల్లో వీర్యకణాల వృద్ధి తగ్గిపోతుందట.

మాంసానికి దూరంగా ఉంటే.. మనసంతా హాయి

మాంసానికి దూరంగా ఉంటే.. మనసంతా హాయి

వీకెండ్‌ వచ్చిందంటే చాలు మాంసం దుకాణాల ముందు క్యూలు కనిపిస్తుంటాయి. ఒక్క హైదరాబాద్‌లోనే నెలకు ఓ వ్యక్తి సగటున అయిదు కిలోల మాంసం తింటున్నాడని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. దేశంలోనే అత్యంత ఎక్కువగా మాంసం వినియోగం ఇక్కడే ఉందట. అయితే మాంసాహార అలవాటు కూడా సంతాన లోపానికి ఓ కారణమట. ఎద్దు, గొర్రె, పంది, మేక, గుర్రం వంటి మాంసాలను ఎక్కువగా తినే పురుషుల్లో వీర్యకణాల వేగం మందగించడంతోపాటు, వాటి వృద్ధి కూడా తగ్గిపోతుందట.

లావెక్కువైతే కష్టమే

లావెక్కువైతే కష్టమే

పిల్లలు పుట్టడం, పుట్టకపోవడం అనేది భార్యాభర్తల లావు కూడా నిర్ణయిస్తుందట. లావుగా ఉండే భార్యాభర్తల మధ్య శృంగార జీవితం సంతృప్తికరమైన స్థాయిలో ఉండదనీ, బరువు తగ్గితే ఇది కొంత ఆశాజనకంగా ఉంటుందంటున్నారు వైద్యులు. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను సాధ్యమైనంత తగ్గిస్తే మేలంటున్నారు.

శృంగారం తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే

శృంగారం తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే

సంతానోత్పత్తికి శృంగారం ఎంత ముఖ్యమో వేరుగా చెప్పనక్కర్లేదు. కానీ ఉద్యోగం, డబ్బు, ఫ్రెండ్స్‌, పార్టీలు అంటూ బిజీ అయిపోయి శృంగారజీవితాన్ని మర్చిపోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. వారానికి రెండు వారాలకోసారి తూతూమంత్రంగా శృంగారంలో పాల్గొంటూ మమ అనిపిస్తున్నారు. అలాంటివారే ఎక్కువగా సంతాన సాఫల్య కేంద్రాల ముందు నిలబడుతున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారంటే, వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు లెక్క. ఈ లెక్క మించినా ఫరవాలేదు.

కానీ స్త్రీల అండోత్పత్తికి అనుగుణంగా శృంగారాన్ని సరిచూసుకుంటే మంచిది.కొందరు రోజుకు రెండుమూడు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు. దీనివల్ల మానసిక సంతృప్తి తప్పితే సంతానసాఫల్యానికి అంతగా ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే వీర్యకణాలు వృథా అవుతాయి. అండోత్పత్తి సమయంలో జరిగే శృంగారంలో తగినంత స్థాయిలో వీర్యకణాలు విడుదలవకపోతే మొదటికే మోసం వస్తుంది.

పొగరాయుళ్లకు సెగ తప్పదుమరి

పొగరాయుళ్లకు సెగ తప్పదుమరి

సిగరెట్‌ను గుప్పుగుప్పుమని తాగేవాళ్లకు పిల్లలు పుట్టే యోగ్యం తక్కువేనట. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్లల్లో 13శాతం మంది సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవాళ్లే. మహిళల్లో అండోత్పత్తికి సిగరెట్‌ అలవాటు అడ్డుపడితే, పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని నాశనం చేస్తుంది. యువకులు, కొత్తగా పెళ్ళయిన వాళ్లయినా ఈ విషయం తెలుసుకుని సిగరెట్‌ మానితే సంసార బంధం చక్కగా సాగిపోతుంది.

మొబైల్

మొబైల్

అలాగే ప్రస్తుతం కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి అవకాశాలు పుట్టుకొచ్చాయి. అమ్మ కావాలనే కోరిక ప్రతి స్త్రీకి తప్పనిసరిగా ఉంటుంది. ఎందరో స్త్రీలకు అమ్మ తనాన్ని దూరం చేస్తున్న ఒక ప్రధాన సమస్య ఉంది. మొబైల్ అనేది ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగమైంది. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి ప‌డుకునే వ‌ర‌కు, ఇంకా చెబితే బెడ్ ప‌క్కనే ఎప్పటికీ అందుబాటులో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచి ప‌డుకోవ‌డం ఇప్పుడు అంద‌రికీ అల‌వాటైపోయింది. అలవాటు అనేకంటే వ్యసనంగా మారింది.

రేడియేషన్ వల్ల

రేడియేషన్ వల్ల

ఈ క్రమంలో మొబైల్ ఫోన్స్ నుంచి వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల శ‌రీరం అనారోగ్యాల‌కు గుర‌వుతుంద‌ని ఎప్పటి నుంచో వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే కొంద‌రు సైంటిస్టులు చేసిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది ఏమిటంటే, రాత్రి పూట ఫోన్‌ను అతిగా (ఓవర్ నైట్ కూడా విడవకుండా) వాడ‌డం, లేదా ప‌క్కనే పెట్టుకుని నిద్రించ‌డం వంటి ప‌నులు చేస్తే అలాంటి వారికి సంతానం క‌లిగేందుకు చాలా త‌క్కువ‌గా అవ‌కాశం ఉంటుంద‌ని తెలిసింది. అవును, మీరు విన్నది నిజ‌మే.

పరిశోధన చేయగా

పరిశోధన చేయగా

కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ, ఒకాసా యూనివ‌ర్సిటీ, జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజన్సీ వంటి యూనివ‌ర్సిటీలు, వాటి అనుబంధ సంస్థలు రాత్రి పూట సెల్‌ఫోన్ వాడ‌కం, దాని వ‌ల్ల క‌లిగే ప్రభావాలపై ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌లు చేశారు. ఇందులో భాగంగా వారు కొన్ని ఎలుక‌ల‌ను త‌మ ప‌రిశోధ‌న‌కు ఎంచుకున్నారు. వాటిలో కొన్నింటిని అలాగే వ‌దిలేయ‌గా, మ‌రికొన్నింటిపై సెల్‌ఫోన్ డిస్‌ప్లే నుంచి వ‌చ్చే కాంతిని ప్రసారం చేశారు.

రుతుక్రమం తగ్గిపోతుంది

రుతుక్రమం తగ్గిపోతుంది

ఈ క్రమంలో చివ‌ర‌కు తేలిందేమిటంటే సాధార‌ణ ఎలుక‌లు రుతుక్రమం వ‌చ్చే స‌రికి 71 శాతం సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయ‌ని, అదే కాంతి ప్రసారం చేయ‌బ‌డ్డ ఎలుక‌ల సంతానోత్పత్తి 10 శాతానికి ప‌డిపోయింద‌ని గుర్తించారు. అంటే సెల్‌ఫోన్ డిస్‌ప్లే నుంచి వ‌చ్చే కాంతి వ‌ల్ల ఎలుక‌ల్లో సంతానోత్పత్తి అవ‌కాశం 60 శాతానికి పైగా ప‌డిపోయింద‌ని తేల్చారు. అయితే ప్రయోగాలు ఎలుక‌ల‌పై చేసినా, మ‌నుషుల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

సంతానోత్పత్తిపై ప్రభావం

సంతానోత్పత్తిపై ప్రభావం

రాత్రి పూట సెల్‌ఫోన్ వాడ‌కం వ‌ల్ల‌, ఫోన్‌ను ప‌క్కనే పెట్టుకుని నిద్రించ‌డం వ‌ల్ల సంతానోత్పత్తిపై ప్రభావం ప‌డ‌డ‌మే కాదు, ఇంకా ఎన్నో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్యలు కూడా వ‌స్తాయ‌ట‌. మ‌న శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌కు ఆటంకం క‌లుగుతుంద‌ట‌. హార్మోన్లు అస‌మ‌తుల్యంగా మారుతాయ‌ట‌. నిద్ర స‌రిగ్గా ప‌ట్టద‌ట‌.

మెలటోనిన్ హార్మోన్

మెలటోనిన్ హార్మోన్

శ‌రీరానికి ముఖ్యంగా కావ‌ల్సిన మెల‌టోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి త‌గ్గుతుంద‌ట‌. నీర‌సం, గుండె పోటు, గుండె సంబంధ వ్యాధులు, ఊబ‌కాయం, మ‌ధుమేహం వంటి అనారోగ్యాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. అంతే కాదు చ‌ర్మం త్వర‌గా ప్రభావిత‌మై వృద్ధాప్య సంకేతాలు క‌న‌బ‌డ‌తాయ‌ట‌. క‌నుక‌, సెల్‌ఫోన్‌ను రాత్రి పూట మితంగా మాత్రమే వాడండి.

పడుకునే ముందు దూరంగా పెట్టండి

పడుకునే ముందు దూరంగా పెట్టండి

పడుకొనే ముందు దాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. భార్యాభర్తలకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం మగవారికి వీర్యం తక్కువగా ఉండడం, వీర్యం నాణ్యంగా లేకపోవడమే కాదు. మగవారిలో ఉన్న వీర్యాన్ని కూడా బలహీనం చేసే అంశాలు చాలా ఉన్నాయని భార్యాభర్తలు తెలుసుకోవాలి.

తగిన జాగ్రత్తలు తీసుకుని భార్యాభర్తలిద్దరూ ఒకప్లాన్ ప్రకారం సెక్స్ లో పాల్గొంటే కచ్చితంగా త్వరగా పిల్లల్ని పొందుతారు. పిల్లలు త్వరగా కావాలంటే ముఖ్యంగా ఆడవారికి అండం విడుదలైనప్పుడు మాత్రమే మగవారు వారితో సెక్స్ లో బాగా పాల్గొనాలి. మిగతా సమయంలో పాల్గొనడం వల్ల ఎలాంటి లాభం ఉండదు... కేవలం మానసిక ఆనందం మాత్రమే కలుగుతుంది.

English summary

habits that are harming your sperm

habits that are harming your sperm
Story first published: Wednesday, June 27, 2018, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more