For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిలికోసిస్: కారణాలు, లక్షణాలు, వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స

|

సిలికా అనే పదార్ధం ఉన్న ధూళిని పీల్చే ప్రాంతాలలో పనిచేసే వ్యక్తులలో అధికశాతం మంది, ఈ సిలికోసిస్ అనబడే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధికి గురవడం జరుగుతుంటుంది. సిలికా అనేది ఒక చిన్న స్పటికాకృతిలో ఉంటుంది, ఇది రాక్, ఇసుక లేదా క్వార్ట్జ్ వంటి ఖనిజ ధాతువులలో కనిపిస్తుంది. సిలికా దుమ్ము పీడిత ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులలో, ఊపిరితిత్తులలో మరియు శ్వాస మార్గాల్లో సిలికా పేరుకుని పోతుంటుంది. క్రమంగా వ్యక్తులలో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయని ఎడల, ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు.

సిలికోసిస్, దాని లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్స మరియు నివారణా దశల గురించిన మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

Silicosis

సిలికోసిస్ అంటే ఏమిటి?

సిలికోసిస్ అనేది ఒక ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి, ఇది సిలికా ఉన్న ధూళిని పీల్చినప్పుడు వస్తుంది. సాధారణంగా తమ ఉద్యోగాల కారణంగా సిలికా ధూళికి ప్రభావితమయ్యే కార్మికులలో ఇది సంభవించడం కనిపిస్తుంది. మైనింగ్, ఫౌండ్రీ వర్క్ మరియు గ్లాస్ తయారీ వంటి వృత్తుల్లో ఉపాధి పొందుతున్న వ్యక్తులు సిలికోసిస్ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. సిలికా రేణువులకు అధికంగా ప్రభావితమవడం కారణంగా, ఊపిరితిత్తులలో అడ్డంకులు ఏర్పడుతాయి, క్రమంగా వ్యక్తి శ్వాసపై ప్రభావాన్ని చూపిస్తుంది.

Silicosis

సిలికోసిస్ సమస్యలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి :

అక్యూట్ :

ఈ స్థితిలో ఊపిరితిత్తులు ఎర్రగా మారుతాయి. మరియు అవి ద్రవంతో నిండి ఉండవచ్చు. ఇది రక్తంలో తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు మరియు శ్వాసలో తీవ్రమైన ఇబ్బందులకు కారణమవుతుంది. కొన్ని వారాల నుండి 2 సంవత్సరాల వరకు పెద్దమొత్తంలో సిలికా ప్రభావానికి గురైన వారిలో ఈ సిలికా లక్షణాలు కనపడడం మొదలవుతుంది.

క్రానిక్ (దీర్ఘకాలిక) :

పేరుకుపోయిన సిలికా ధూళి, ఊపిరితిత్తులు మరియు ఛాతీలోని లింఫ్ నోడ్స్ లో వాపుకు దారితీస్తుంది. దీని మూలంగా శ్వాస తీసుకోవడం అత్యంత కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి సిలికా ప్రభావానికి గురైన, దశాబ్దాల వరకు కూడా సమస్యలు కనపడకపోవచ్చు. లక్షణాలు మొదట సాధారణంగా ఉన్నా, తరువాతి కాలంలో శరీరాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయి.

యాక్సలరేటెడ్ :

ఈ రకంలో ఊపిరితిత్తుల్లో తీవ్రమైన వాపు ఉంటుంది. సిలికా తీవ్ర ప్రభావానికి గురైన 5 నుండి 10 సంవత్సరాల తరువాత సంకేతాలు చూపడం ప్రారంభమవుతుంది. లక్షణాలు త్వరితగతిన, తీవ్రమైన రూపానికి దారితీస్తాయి.

సిలికోసిస్ సమస్యకు గల కారణాలు :

క్రిస్టలిన్ సిలికా (స్పటిక రూపంలోని సిలికా) కు ఎక్కువగా ప్రభావితమవడం మూలంగా సిలికోసిస్ సమస్య తలెత్తుతుంది. భూమి యొక్క క్రస్ట్ కు అంతరాయం కలిగించే ఆక్రమణలు ఏవైనా సరే సిలికోసిస్ సమస్యకు దారితీస్తుంది (కట్టింగ్, డ్రిల్లింగ్, చిప్పింగ్, మట్టిని గ్రైండింగ్ చేయడం, ఇసుక లేదా గ్రానైట్ పనులు).

ఈ క్రింది వృత్తులు సిలికా విపరీత ప్రభావానికి కారణమవుతాయని చెప్పబడుతుంది :

• గ్లాస్ తయారీ

• సొరంగం పనులు

• నిర్మాణ పనులు

• మైనింగ్ (బొగ్గు లేదా హార్డ్ రాక్ మైనింగ్)

• బేల్దారి పనులు

• శాండ్ బ్లాస్టింగ్

• సిరామిక్స్ వర్క్

• క్వారీయింగ్

• స్టోన్ కట్టింగ్

• ఉక్కు కర్మాగారం పని

Silicosis

సిలికోసిస్ యొక్క ప్రమాద కారకాలు :

ప్రాథమిక ప్రమాద కారకంగా సిలికా ధూళికి బహిర్గతమవడం ఉంటుంది. స్ఫటిక సిలికా ప్రభావానికి దూరంగా ఉండడమనేది ఈ రుగ్మతను నిరోధించడానికి సూచించదగిన అత్యుత్తమ మార్గంగా ఉంటుంది. అనేక కంపెనీలు, తన మొత్తం పని జీవితకాలంలో వర్కర్ బహిర్గతం అయ్యే సిలికా పరిమితుల గురించిన మార్గదర్శకాలను నిర్దేశించుకుని, వాటిని పాటించడం ప్రారంభించాయి. అదేవిధంగా, యజమానులు తమ కార్మికులకు ఖచ్చితమైన దుస్తులు మరియు పరికరాలను కూడా అందించవలసి ఉంటుంది, తద్వారా సిలికా ప్రభావాలకు బహిర్గతం కాకుండా సంరక్షించవచ్చు. సిలికోసిస్ సమస్యతో బాధపడే రోగులకు ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, దీర్ఘకాలిక బ్రాంకైటిస్ వంటి ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదాలు అధికంగా ఉంటాయి.

Silicosis

సిలికోసిస్ ప్రారంభ లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి :

• కఫం

• అసాధారణమైన దగ్గుతో కూడిన ఇబ్బంది

• శ్వాసమీద ప్రభావం

ఆ తరువాతి అనుసంధాన లక్షణాలు క్రింద విధంగా ఉన్నాయి (ప్రారంభ లక్షణాలతో పాటుగా) :

• అలసట

• ఛాతీ నొప్పి

• బరువు నష్టం

• పెదవులు నల్లగా మారడం

• పెదాలు చిట్లడం

• కాళ్ళ వాపు

• ఆకస్మిక జ్వరం

• శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం.

సిలికోసిస్ లక్షణాలు చూసిన నేపధ్యంలో వైద్యుడు మీకు ఈ దిగువ పరీక్షలను సిఫారసు చేయవచ్చు :

ఛాతీ ఎక్స్-రే లేదా సిటి స్కాన్ :

ఈ పరీక్షలు, ఊపిరితిత్తుల సమస్యలను తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతాయి.

స్ఫూటమ్ (తెమడ) పరీక్ష :

క్షయ వంటి ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల ఉనికిని తనిఖీ చేయడానికి ఇది జరుగుతుంది.

బయాప్సీ :

ఊపిరితిత్తుల కణజాలాలలో బయాప్సీ చేయడం ద్వారా వ్యాధినిర్ధారణలో ఖచ్చితత్వం ఉంటుంది. క్రమంగా, వైద్యుడు మీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల్లోనికి ఒక సూదిని చొప్పించడం ద్వారా, ప్రభావిత ప్రాంతం యొక్క నమూనాను సేకరించగలుగుతారు. ఈ నమూనాని సిలికోసిస్ సంకేతాలను చూసేక్రమంలో భాగంగా సూక్ష్మదర్శిని కింద తనిఖీ చేయడం జరుగుతుంది.

బ్రాంకోస్కోపీ :

చిన్న కెమెరాతో పొడవైన సన్నని గొట్టాన్ని, మీ ఊపిరితిత్తుల చివరల వరకు చొప్పించి, డ్యామేజీలను చెక్ చేయడం కొరకు ఈ బ్రాంకోస్కోపీ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. (ఉదాహరణ : ఎండోస్కోపీ, కొలనోస్కోపీ).

Silicosis

సిలికోసిస్ సమస్యకు చికిత్స ఎలా?

సిలికోసిస్ సమస్యకు ప్రత్యేకించిన చికిత్స అంటూ లేదు. సిలికోసిస్ అభివృద్ధి చెందిన పక్షంలో, మీ వైద్యుడు కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారించుకుని, మీ ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించే ప్రయత్నం మాత్రం చేస్తారు. తీవ్రమైన సందర్భాల్లో, కొంతమందికి ఆక్సిజన్ కూడా అవసరం ఉండవచ్చు. క్రమంగా శ్వాసకు మద్దతుగా ఉంటుంది.

చికిత్స అనేది లక్షణాల నిర్వహణలో సహాయపడుతుంది మరియు ఈ దిగువ పేర్కొన్నవాటిని చికిత్సలో భాగంగా చేర్చవలసి ఉంటుంది :

మందులు :

పీల్చే స్టెరాయిడ్స్, ఊపిరితిత్తులలో మ్యూకస్ స్థాయిలను తగ్గించవచ్చు. శ్వాసనాళాలను సడలించడం కొరకు బ్రాంకోడైలేటర్లు సహాయపడతాయి.

ఆక్సిజన్ థెరపీ :

ఒక వ్యక్తి శ్వాసతో పోరాడటానికి మరియు అలసటను తగ్గించడానికి పోర్టబుల్ ఆక్సిజన్ ట్యాంక్ వినియోగించబడుతుంది.

ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స :

కొన్ని ఊపిరితిత్తుల నష్టం విషయంలో, అధునాతన శస్త్రచికిత్సల జోక్యం అవసరం కావచ్చు. క్రమంగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స అవసరం కావొచ్చు.

సిలికోసిస్ యొక్క సంభావ్య సంక్లిష్టతలు దిగువ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది :

• క్షయ శ్వాసకోశ వైఫల్యం

• ఊపిరితిత్తుల క్యాన్సర్

• ప్రోగ్రెసివ్ మాసివ్ ఫైబ్రోసిస్

• అనుసంధాన కణజాల వ్యాధి (రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటోసస్ మరియు స్క్లెరోడెర్మా)

సిలోకోసిస్ నివారణా చర్యలు :

సరళమైన నివారణా విధానాలుగా క్రిందివి ఉంటాయి :

• మీరు సిలికా ప్రభావానికి గురయ్యే సమయాన్ని పరిమితం చేయండి.

• సిలికా ధూళి ప్రాంతాలలో మీరు పనిచేసేటప్పుడు మాస్క్ లేదా సంరక్షణాత్మక దుస్తులను ధరించండి.

• సరైన భద్రతా పరికరాల కొరకు మీ యజమానిని సంప్రదించండి.

• పొగతాగడం తగ్గించండి. ఇది ఊపిరితిత్తుల నష్టాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.

• పరోక్ష ధూమపానాన్ని కూడా పరిహరించండి.

• వాయు కాలుష్యం, దుమ్ము మరియు అలర్జీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పరిహరించండి.

• సిలికా డస్ట్ ఉన్న ప్రదేశానికి దగ్గరల్లో తినడం లేదా తాగడం చేయవద్దు.

• పని సమయంలో సరైన వెంటిలేషన్ లేదా బ్లాస్టింగ్ క్యాబినెట్లను ఉపయోగించండి.

• సిలికా పీల్చడం నుంచి మిమ్మల్ని సంరక్షించగల రేస్పిరేటర్లను ఉపయోగించండి.

• మెటీరియల్స్ కట్ చేయడానికి, చిప్ చేయడానికి లేదా గ్రైండ్ చేయడానికి నిర్దేశించబడిన తడి విధానాలను ఉపయోగించండి.

• మీరు తినడానికి ముందు మీ చేతులను మరియు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలని గుర్తుంచుకోండి.

• పని గంటల తరువాత వెంటనే స్నానం చేసి, మీ దుస్తులను మార్చండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Silicosis: Causes, Symptoms, Diagnosis And Treatment

For people who work in silica dust-prone regions, the silica can build up in the lungs and breathing passages leading to scarring that can make it very difficult for the person to breathe normally. Limiting exposure to crystalline silica is the best way to prevent the occurrence of this ailment. There is no cure for silicosis.
Story first published: Friday, May 31, 2019, 10:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more