Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
Eluru disease: ఏలూరులో వింత వ్యాధి ఎలా వ్యాపిస్తోంది.. ఇవి ఆ వ్యాధి లక్షణాలేనా?
ఏలూరులో కొత్త వ్యాధి లక్షణాల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో ఓ మిస్టరీ డిసీజ్ అందరినీ కలవరానికి గురి చేస్తోంది. దీని దెబ్బకు వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ వింత వ్యాధి సోకిన వారికి వాంతులు కావడం, అకస్మాత్తుగా నోటిలో నుండి నురగలు రావడం వంటివి జరుగుతున్నాయి.

ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఒకరు ప్రాణాలను కూడా వదిలారు. అయితే అంతుచిక్కని ఈ వ్యాధికి గల కారణాలేంటి? అసలు ఇది ఎలా బయటపడింది.. ఇది ఎందుకు విస్తరిస్తుందనే వివరాలు ఇంకా చాలా మందికి తెలియవు..

ఈ వ్యాధి గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? దీనికి కూడా కరోనా వైరస్సే కారణమా? లేదా ఇతర కారణాలా అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

అంతుచిక్కడం లేదు..
ఢిల్లీ నుండి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు ఇది మూర్ఛ వ్యాధి అయ్యుండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఉన్నట్టుండి ఒక్కసారిగా వందలాది మందికి ఎలా వ్యాపించిందనే విషయమే ఎవ్వరికీ తెలియడం లేదు.

వ్యాధి లక్షణాలు..
ఈ వ్యాధి సోకిన వారికి ఒక్కసారిగా తల, కళ్లు తిరిగి కింద పడిపోతున్నారు.
మూర్ఛవ్యాధి వచ్చిన వారిలా నురగలు కక్కుతున్నారు.
బాధితుల్లో ఎక్కువ మంది తలనొప్పితో పాటు వాంతులతో ఇబ్బందిపడుతున్నారు.
మరికొందరు మతిమరుపు, టెన్షన్లతో గందరగోళ స్థితిలో ఉంటున్నారు.
ఇంకా కొందరు బాధితులు వెన్నునొప్పితో బాధపడుతున్నారు.
ఇంకా కొంతమంది తమ బాడీలో ఎనర్జీ తగ్గిపోయి.. బాగా వీక్ అవుతున్నారు.

దేని వల్ల వచ్చిందంటే..
ఈ వ్యాధి కరోనా కారణంగా మాత్రం రాలేదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అలాగే తాగునీటి వల్ల కూడా కాదని అధికారులు స్పష్టం చేశారు. ఎందుకంటే ఆస్పత్రిలో చేరిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరందరికీ కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో పాటు ఏదైనా విషవాయువు లీకవ్వడం వల్ల జరిగిందా అనే అనుమానాలకు కూడా తగిన ఆధారాలు దొరకలేదు. ఇప్పటివరకు పరీక్షించిన నీటి నమూనాల్లో ఆ వ్యాధి కారకాలేవీ కనిపించలేదు.

ఎలా వ్యాపిస్తోందంటే..
ఈ వ్యాధి చాలా విచిత్రంగా వ్యాపిస్తోంది. ఇది కుటుంబంలో ఉండే వారందరికీ సోకడం లేదు. దీన్ని బట్టి ఇది అంటువ్యాధి కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు అనారోగ్యానికి గురైనట్లు అధికారులు చెబుతున్నారు.

వయసుతో సంబంధం లేకుండా..
ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాపిస్తోంది. దీంతో ఆస్పత్రిలో చేరిన రోగుల రక్త నమూనాలను నిపుణుల టీమ్ పరిశీలించి ఎయిమ్స్ కు పంపారు. అందులో వచ్చే ఫలితాలను బట్టి కొంత స్పష్టత రావచ్చు.

అవి కలుషితం కావడం వల్లే..
మరోవైపు ఢిల్లీ నుండి వైద్య నిపుణులు ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి కూరగాయలు, పాలు వంటివి కలుషితం కావడం వల్లనే ఇలా జరిగిందేమోనని చెబుతున్నారు. కూరగాయలు తాజాగా కనబడేందుకు ఎక్కువ కెమికల్స్ కలిపారేమోనని.. అలాగే చేపలు, రొయ్యల చెరువుల్లో వాడిన మందులు కూడా ఇటీవల వరదలకు బయటికొచ్చి ఆహార ఉత్పత్తులు కలుషితమై, దాని ప్రభావం ఏమైనా ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకుని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications