For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణానికి ముందు ఏ వ్యాధి బారిన పడ్డారంటే...!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సుదీర్ఘకాలం ఏ వ్యాధితో పోరాడి మరణించాడో ఇప్పుడు తెలుసుకుందాం.

|

భారతదేశ మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ భీష్ముడిగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ 84 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆగస్టు 31వ తేదీన తుదిశ్వాస విడిచాడు. ఈ రాజకీయ యోధుడు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి.. చికిత్స నిమిత్తం
ఆసుప్రతిలో చేరారు.

What was the cause of Pranab Mukherjee death? Details in Telugu

కోవిద్-19 వైరస్ బారిన పడకముందే ఆయనకు బ్లడ్ క్లాట్ లేదా బ్రెయిన్ అటాక్ కు సంబంధించిన ఓ సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కొన్ని రోజుల నుండి వెంటిలేటర్ పైనే ఉండేవాడు. అయితే అలాంటి పరిస్థితి ఎవరెవరికి ఎదురవుతుంది. ఇలాంటి ప్రమాదం ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? ఇంతకీ అది ఎందుకు వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బ్రెయిన్ అటాక్..

బ్రెయిన్ అటాక్..

మనిషి యొక్క మెదడులో ఏర్పడిన బ్లడ్ క్లాట్ నే స్ట్రోక్ అని లేదా బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. మెదడులో ఏ భాగానికి రక్త ప్రసరణ జరగకపోయినా.. కావాల్సినంత రక్తప్రసరణ జరగకపోతే ఈ స్ట్రోక్ వస్తుంది.

మెడికల్ ఎమర్జెన్సీ

మెడికల్ ఎమర్జెన్సీ

ఇలాంటి పరిస్థితులలో మెదడులో ఉన్న టిష్యులకి కావాల్సిన ఆక్సీజన్ గానీ.. న్యూట్రియెంట్లు గానీ అస్సలు అందవు. ఇలా ఎక్కువసేపు ఉంటే బ్రెయిన్ లో ఉన్న సెల్సులన్నీ చనిపోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీ కన్సిడర్ అని పిలుస్తారు. ఇలాంటి సమయంలో ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే.. అంత త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

కొన్ని సంకేతాలు..

కొన్ని సంకేతాలు..

ఇలాంటి స్ట్రోక్ రావడానికి ముందు.. మన శరీరానికి కొన్ని సంకేతాలు వస్తాయి. అవేంటంటే..

  • అకస్మాత్తుగా సరిగ్గా మాట్లాడలేకపోతారు. ఒకవేళ మాట్లాడినా వారి మాటలను ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతారు.
  • ఉన్నట్టుండి చూపు మందగిస్తుంది.
  • బ్రెయిన్ క్లాట్ స్పష్టత..

    బ్రెయిన్ క్లాట్ స్పష్టత..

    ప్రతిదీ రెండుగా కనిపించొచ్చు. ఇలా ఒక కన్నుకే కాదు.. రెండు కళ్లకు కూడా జరగొచ్చు.

    • ఆహారం, నీరు వంటివి తీసుకోలేకపోతారు. ఇలా జరిగినప్పుడు బ్రెయిన్ క్లాట్ అని స్పష్టంగా తెలుస్తుంది.
    • అకస్మాత్తుగా ఎక్కువ తలనొప్పిగా కూడా అనిపిస్తుంది. నడవటం కష్టమౌతుంది. మన మీద మనకు బ్యాలెన్స్ తప్పుతుంది.
    • కళ్లు తిరుగుతన్నట్లుగా, వాంతులు వచ్చినట్టుగా కూడా అనిపించవచ్చు.
    • ఎవరికి ఎక్కువగా వస్తుందంటే..

      ఎవరికి ఎక్కువగా వస్తుందంటే..

      • ఎవరైతే కుటుంబ సభ్యులలో ఇదివరకే ఇలాంటి సమస్యను ఎదుర్కొని ఉంటారో వారి వస్తుంది.
      • 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండేవారికి
      • ఎక్కువ బరువు ఉండే వారికి
      • మధుమేహం, బ్రెయిన్ ట్యూమర్స్ ఉండే వారికి
      • ఈ అలవాట్లు ఎక్కువగా ఉంటే..

        ఈ అలవాట్లు ఎక్కువగా ఉంటే..

        • నిరంతరం వ్యాయామం చేయనివారికి
        • గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి
        • బ్లడ్ థిన్నింగ్ కోసం మందులు వాడే వారికి
        • రెగ్యులర్ గా మద్యపానం.. ధూమపానం.. డ్రగ్ అలవాటు ఉండే వారికి
        • ఇలా రాకుండా ఉండాలంటే..

          ఇలా రాకుండా ఉండాలంటే..

          • ఎక్కువగా ఒత్తిడి పెంచుకోకుండా ఉండాలి.
          • బరువును అదుపులో ఉంచుకోవాలి.
          • ధూమపానం అలవాటు ఉంటే మానేయాలి.
          • షుగర్ ను కంట్రోలులో ఉంచుకోవాలి.
          • హైబిపిని సైతం అదుపులో ఉంచుకోవాలి.
          • ఇవి తప్పనిసరి...

            ఇవి తప్పనిసరి...

            • శరీరంలో కొవ్వును తగ్గించుకోవాలి.
            • డ్రగ్స్ ను పూర్తిగా మానేయాలి.
            • ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి.
            • మద్యపానం జోలికి వెళ్లకూడదు.
            • మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండే పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి.

English summary

What was the cause of Pranab Mukherjee death? Details in Telugu

Here we talking Former President Pranab Mukherjee Passes away after prolonged illness. Read on
Desktop Bottom Promotion