Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పెరుగులో ఇవి కలిపి తింటున్నారా ? చాలా డేంజర్ అంటున్న నిపుణులు
మనలో ఛాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంత రుచికరమైన కూరతో భోజనం చేసినా చివరికి పెరుగుతో తినాల్సిందే. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. పెరుగులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగవడంతో పాటు శరీరంలో ఎన్నో జీవ క్రియలకు పెరుగు ఎంతో మేలు చేస్తుంది.
అయితే పెరుగుతో ఇతర కూరలు కలుపుకుని తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇతర కూరల్లో పెరుగు కలుపుకొని తినడం వల్ల.. పెరుగులో ఉండే ఔషద గుణాలు పోయి.. అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే పెరుగుతో కలిపి తినకూడని ఆ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగుతో ఏఏ కూరలు కలిపి తినొద్దంటే..
> పెరుగులో ఎప్పుడూ కూడా వెల్లుల్లి కలిపి తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో వేది చేసే గుణం ఉంటుంది. దీనిని పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల.. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
> సాధారణంగా పెరుగులో ఉల్లిపాయ వేసుకొని సలాడ్ మాదిరిగా చేసుకొని తింటూ ఉంటారు. ప్రతీ ఫంక్షన్‌లో ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా పెరుగులో ఉల్లిపాయలను కలిపి తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తినటం వల్ల పేగు నొప్పి వస్తుందని, జీర్ణ సంబంధిత సమస్యలూ పెరిగే అవకాశముందని అంటున్నారు.
> పెరుగులో కొందరు దొసకాయను కూడా కలిపి తింటూ ఉంటారు. దోసకాయలో 70% నీరు ఉంటుంది. దీంతో పెరుగు, దోసకాయ కలిపి తినడం వల్ల.. జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు..
> పెరుగులో టొమాటోను కూడా కలిపి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల.. అజీర్ణం, అసిడిటీ సమస్యలు వస్తాయట. టామోటాలో ఉండే ఆమ్ల గుణం, పెరుగులో ఉండే ఆమ్ల గుణం రెండు కలిపి తీసుకోవడం వల్ల.. ఈ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
> పాలకూర, పెరుగు రెండు కలిపి ఎప్పుడూ తినొద్దని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. పాలకూరలో యాక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్యాల్షియం శోషణకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. దీనివల్ల కడుపునొప్పితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఆహారాన్ని అయినా మనం ఒరిజినల్‌గానే ఆస్వాదిస్తే మంచిగా ఉంటుంది. పైగా అందులో ఉండే ఔషధ గుణాలు, శరీరానికి మేలూ చేసే పోషక విలువలు మన శరీరానికి సరిగ్గా అందుతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలన్నీ మాకు ఇంటర్నెట్‌లో అందించిన సమాచారం ఆధారంగానే అందించాము. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications