Latest Updates
-
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం!
భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మన చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా సడెన్ గా మన ఆరోగ్యాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. రుచికరమైన, పోషకాలతో కూడిన భోజనం చేయడం మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో.. తిన్న తర్వాత మనం చేసే పనులు కూడా మన ఆరోగ్యాన్ని అంతే ప్రభావితం చేస్తాయి. మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు చేయడం దైనందిన అలవాటుగా మారిపోతుంది.

కానీ తెలియక మనం చేసే ఆ చిన్న చిన్న తప్పులే మన జీర్ణవ్యవస్థను దెబ్బతీసి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని మీకు తెలుసా? భోజనం తర్వాత మనం చేసే 5 అతి పెద్ద తప్పులు ఏమిటో ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ యర్రగోళ్ల మల్లికా సాయి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియోలో తెలిపారు. అవేంటో ఇక్కడ చూడండి.
తిన్న వెంటనే పళ్లు బ్రష్ చేయడం
పంటి ఆరోగ్యం కోసం బ్రష్ చేయడం మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ భోజనం చేసిన వెంటనే పళ్లు తోముకోవడం చాలా పెద్ద తప్పు. మనం తినే ఆహారంలో ఉండే సిట్రిక్ ఆమ్లాలు మన పంటి ఎనామిల్ ను తాత్కాలికంగా సున్నితంగా మారుస్తాయి. ఆ సమయంలో వెంటనే బ్రష్ చేస్తే, ఎనామిల్ త్వరగా అరిగిపోయి పళ్లు దెబ్బతింటాయి, సెన్సిటివిటీ వస్తుంది. అందుకే తిన్న వెంటనే కాకుండా, కనీసం అరగంట ఆగి బ్రష్ చేసుకోవాలి. భోజనం తర్వాత కేవలం మంచి నీటితో పుక్కిలించడం బెటర్.
భోజనం తర్వాత వెంటనే స్నానం చేయడం
చాలామందికి సమయం లేకనో, అలవాటు వల్లనో తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదని డాక్టర్ మల్లికా సాయి తెలిపారు. భోజనం చేసినప్పుడు, ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన శరీరంలోని రక్తప్రసరణ పొట్ట భాగంలో చురుకుగా ఉంటుంది. కానీ స్నానం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత మారిపోయి, రక్తప్రసరణ పొట్టనుండి చర్మానికి మళ్లుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి అజీర్తి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. స్నానం చేయాలనుకుంటే భోజనానికి ముందే చేయాలి, లేదా తిన్న తర్వాత 45 నిమిషాలు ఆగాలి.
భోజనం ముగియగానే పండ్లు తినడం
పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అయితే పండ్లను ఏ టైంలో, ఎలా తినాలనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే, అవి మనం తిన్న ప్రధాన ఆహారంతో కలిసి త్వరగా జీర్ణం కాలేవు. పండ్లు త్వరగా అరిగే గుణం కలిగి ఉంటాయి, కానీ ఇతర ఆహారం వల్ల అవి కడుపులోనే ఆగిపోయి పులిసిపోతాయి. ఫలితంగా కడుపుబ్బరం, గ్యాస్, పుల్లటి తేన్పులు వస్తాయి. పండ్లను భోజనానికి గంట ముందు లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత స్నాక్స్ లాగా తీసుకోవడం బెటర్.
కడుపునిండా తిన్న వెంటనే పడుకోవడం
కడుపు నిండా తిన్నాక నిద్ర ముంచుకురావడం సహజం. కానీ తిన్న వెంటనే పడక ఎక్కడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ కచ్చితంగా వస్తాయి. మనం పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు పైకి ఎగదన్ని ఆహారనాళంలోకి వస్తాయి. పైగా, ఇలా చేయడం వల్ల బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఖాయం. భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి.
భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగడం
మనలో చాలామందికి తిన్న తర్వాత వేడివేడిగా ఓ కప్పు టీ లేదా కాఫీ పడకపోతే భోజనం పూర్తయిన ఫీలింగ్ రాదు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. టీ ఆకులలో ఉండే టానిన్స్, కాఫీలోని కెఫిన్ మనం తిన్న ఆహారంలోని ఐరన్, ప్రోటీన్లను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. మీకు ఆ అలవాటు ఉంటే భోజనం చేసిన కనీసం గంట తర్వాత తాగడం అలవాటు చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
