జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్‌.. భాగ్యనగరంలో అట్టహాసంగా ఊరేగింపు.. రథయాత్ర ప్రాముఖ్యత ఇదే.!

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథుడి రథయాత్ర నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. లక్షలాది భక్తుల సందడి నడుమ సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక, ఒడిశాలోని పూరీ క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ దేశవ్యాప్తంగా జగన్నాథుడి రథచక్రాలు వీధుల్లోకి బయలుదేరనున్నాయి. హైదరాబాద్‌లోనూ మరికాసేపట్లో రథయాత్ర కొనసాగనుంది.

jagannath ratha yatra across the hyderabad on july 16th know the significance of this procession

రథయాత్ర విశిష్టత

"రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే".. రథంపై ఉన్న జగన్నాథుడిని(వామన రూపాన్ని) ఒక్కసారి దర్శించుకుంటే చాలు. ఆ రథం తాడును తాకి లాగినా ఎనలేని అదృష్టం. తద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుందని, జన్మజన్మల పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వసిస్తుంటారు.

ఇంకా 15 రోజులే.. ఈ రాశుల వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని ధన యోగం.! ఇంకా 15 రోజులే.. ఈ రాశుల వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని ధన యోగం.!

భాగ్యనగరంలో అట్టహాసంగా ఊరేగింపు

ఈరోజు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయాల ఆధ్వర్యంలో జగన్నాథుడి రథయాత్ర ఊరేగింపులు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. అత్యంత వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంజారాహిల్స్‌లో ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథుల రథాల ఊరేగింపు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 8 వరకు కొనసాగుతుంది. నగరంలో వేల సంఖ్యలో భక్తులు రథయాత్రలో పాల్గొననున్నారు.

jagannath ratha yatra across the hyderabad on july 16th know the significance of this procession

ఇక, ఇస్కాన్‌ అబిడ్స్‌, బేగంబజార్‌ ఖాకీ అఖాడా, ఇస్కాన్‌ కూకట్‌పల్లి, ఐడీఏ బొల్లారం జగన్నాథ ఆలయాల్లోనూ రథయాత్ర కన్నుల పండువగా జరగనుంది. బేగంబజార్‌లో రథయాత్రలో భాగంగా స్వామివారికి 56 రకాల నైవేద్యాలు సమర్పించడం విశేషం. ఆయా ప్రాంతాల్లో రథయాత్రలో భాగంగా రద్దీని నివారించేందుకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

జగన్నాథ రథయాత్ర పురాణ నేపథ్యం..

జగన్నాథ రథయాత్రకి సంబంధించి పురాణాల్లో రెండు కథలు ప్రాచుర్యం చెందాయి. ప్రతి యేటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జగన్నాథుడు(శ్రీకృష్ణుడు), బలభద్రుడు, సుభద్ర సమేతంగా రథాలెక్కి వీథుల్లో ఊరేగుతూ భక్తులకు అభయాన్ని ఇస్తారు.

jagannath ratha yatra across the hyderabad on july 16th know the significance of this procession

మొదటి కథ..

శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకను పాలిస్తున్న కాలంలో ఆయన సోదరి సుభద్ర ద్వారకను, అక్కడి నగరాలను చూడాలనే అభిలాషలో ఉంది. ఈ కోరికను అన్నలకు చెప్పింది. ఆమె కోరిక మేరకు సుభద్రను ఒక ప్రత్యేక రథంపై కూర్చోబెట్టారు. తాము కూడా వేర్వేరు రథాలపై కూర్చుని నగరమంతా తిలకించేలా చేశారు. ఆషాఢ శుద్ధ విదియ రోజే ఇది జరగిందని.. అందుకే ప్రతి యేటా ఈ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఆషాఢం ప్రారంభం.. ఈ మాసంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, హిందూ సంప్రదాయ నియమాలేంటి.?ఆషాఢం ప్రారంభం.. ఈ మాసంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, హిందూ సంప్రదాయ నియమాలేంటి.?

రెండో కథ

శ్రీకృష్ణ, బలభద్ర, సుభద్రల మేనత్త గుండిచా దేవి. వీరు ముగ్గురూ కలిసి ద్వారకలో శ్రీ మందిరం నుంచి మూడు కి.మీ దూరంలో ఉన్న గుండిచా దేవి ఆలయానికి రథాలపై ప్రయాణిస్తారు. అనంతరం అక్కడ 9 రోజుల పాటు ఆతిథ్యం స్వీకరిస్తారు. ఈ ప్రయాణమే గుండిచా యాత్ర, రథయాత్రగా ప్రసిద్ధి చెందింది. తొమ్మిది రోజుల తర్వాత తిరిగి ద్వారకకు చేరుకుంటారు. ఆ యాత్రను బహుదా యాత్ర అంటారని పురాణాల కథ.

విగ్రహాల ఆకృతి వెనుక కథ

జగన్నాథుడి ఆలయంలో మూడు విగ్రహాలు అసంపూర్తిగా ఉండటం తెలిసిందే. జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలకు చేతులు, కాళ్లు పూర్తిగా చెక్కి ఉండవు. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. ఇంద్రద్యుమ్న మహారాజు అనే మహాభక్తుడు జగన్నాథునికి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఉంటాడు. ఈ మేరకు విగ్రహాలను చెక్కడానికి విశ్వకర్మను విన్నవించుకుంటాడు. అయితే విగ్రహాలు చెక్కేందుకు విశ్వకర్మ ఒక నిబంధన పెడతాడు.

తానే స్వయంగా గదిలో విగ్రహాలను చెక్కుతానని విశ్వకర్మ చెప్పాడు. ఆ సమయంలో ఎవరూ తలుపులు తీయకూడదని చెప్పడంతో ఆ నిబంధనను పాటిస్తారు. అయితే, కొన్ని రోజుల పాటు లోపల నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో రాజు ఆందోళన చెంది తలుపులు తెరుస్తాడు. దీంతో విశ్వకర్మ నిబంధనలు ఉల్లంఘించారనే కోపంతో అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను అలాగే వదిలేసి మాయమవుతాడు. ఇక, అప్పటి నుంచి జగన్నాథుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తూ తరాలుగా రథయాత్రతో భక్తుల పూజలు అందుకుంటున్న

Desktop Bottom Promotion