Latest Updates
-
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే!
వేసవిలో కూల్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
వేసవిలో మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఎక్కువగా చల్లటి నీళ్లను తాగుతూ ఉంటారు. వేడికి చెమటతో శరీరంలోని తేమ కోల్పోతే దాహం ఎక్కువగా వేస్తుంది. అప్పుడు చాలా మందికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లటి నీరు లేదా ఐస్ వాటర్ తాగాలనే ఆలోచన వస్తుంది. చల్లటి నీరు తాగితే ఒళ్లు చల్లబడినట్టు అనిపిస్తుంది కూడా. అయితే చల్లటి నీళ్లు తాగితే బరువు పెరిగిపోతారనే భావనలో చాలా మంది ఉన్నారు. అసలు నిజంగానే చల్లటి వాటర్ తాగితే బరువు పెరుగుతారా? కానీ దీని వెనుకున్న వైద్య పరమైన నిజాలు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చల్లటి నీరు దాహానికి చెక్, కానీ జీర్ణానికి?
నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది శరీరంలోని జీవక్రియల నిర్వహణకు కీలకం. అయితే నీరు ఎంత తాగాలో, ఎలా తాగాలో కూడా అంతే ముఖ్యమైన విషయం. చల్లటి నీరు తాగడం వల్ల శరీరంపై కొన్ని ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశముంది. ముఖ్యంగా జీర్ణక్రియపై ఇది ప్రభావం చూపే అవకాశం ఎక్కువ.

ఆహారం తిన్న వెంటనే లేదా తినే సమయంలో చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ఎందుకంటే చల్లదనం వల్ల జీర్ణ ఎంజైముల పని తీరుపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఫుడ్ ప్రాసెసింగ్ నెమ్మదిగా జరగవచ్చు. దీంతో అజీర్ణం, ఉబ్బసం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
బరువు పెరగడం లేదా తగ్గడంలో నీటి పాత్ర ఎంత?
చల్లటి నీళ్లు తాగితే బరువు పెరుగుతుందనే భావన అపోహ మాత్రమే. నీటిలో ఎలాంటి కేలరీలు ఉండవు. నిజానికి, మనం చల్లటి నీరు తాగినప్పుడు శరీరం కూడా కొంచెం కూల్ అవుతుంది. అయితే మళ్ళీ శరీరం తన ఒరిజినల్ ఉష్ణోగ్రతకు రావడానికి సాధారణం కంటే ఎక్కువ ఎనర్జీ ఉపయోగిస్తుంది. దీంతో కొంతమేర కాలరీలు ఖర్చవుతాయనే అభిప్రాయం కూడా ఉంది. కానీ ఇది చాలా స్వల్పంగా ఉండటంతో, దీని ఆధారంగా బరువు తగ్గుతారని భావించడం తగదు.
ఎప్పుడు, ఎంత నీరు తాగాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి కిలో శరీర బరువుకి సగటున 30-35 మిల్లీ లీటర్ల నీరు అవసరం. అంటే 60 కిలోల వ్యక్తికి కనీసం 2 లీటర్లు, ఎక్కువగా 2.5 లీటర్ల వరకు నీరు అవసరం. అయితే ఇది వాతావరణం, దేహ చురుకుదనం, చెమట వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. శరీరానికి గట్టి వత్తిడి లేకుండా ఉండాలంటే, జాగ్రత్తగా సమయానుసారంగా నీరు తాగడం మంచిది.
చల్లటి నీరు తాగినపుడు వచ్చే సాధ్యమైన సమస్యలు:
జీర్ణ వ్యవస్థలో సమస్యలు
గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లకు అవకాశం
తలనొప్పి లేదా మైగ్రైన్‌లను ప్రేరేపించే అవకాశాలు
శరీరం శీతలమై వెచ్చదనం కోల్పోయే ప్రమాదం
మంచి అలవాటు ఏమిటంటే..
గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు తాగడం ఆరోగ్యానికి ఉత్తమం. మితంగా, తగిన సమయంలో నీరు తాగడం ద్వారా శరీర హైడ్రేషన్‌ను సమతుల్యం చేసుకోవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగడం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. వంట తరువాత గోరువెచ్చని నీటిని తాగడం కూడా మంచిదే.
సంక్షిప్తంగా చెప్పాలంటే, వేసవిలో చల్లటి నీరు తాగడం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే గది ఉష్ణోగ్రతలో ఉండే నీటిని తాగడం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణుల సూచన.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











