ఈ 3 చేపలు ఫ్రీగా ఇచ్చినా తినకండి.. పొరపాటున తింటే భయంకరమైన వ్యాధులు!

చేపలు తరచుగా తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుందని డాక్టర్లు,నిపుణులు తరచుగా చెబుతుంటారు. అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లకు చేపలు మంచి మూలం. చేపలలో విటమిన్లు A,D,E,K,B2,B12 వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చేపలలో లభిస్తాయి. చేపలు తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుందని,గుండె ఆరోగ్యానికి మంచిదని,మెదడు కూడా షార్ప్ గా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతుంటారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం క్రమం తప్పకుండా చేపలు తినేవాళ్లలో డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. అయితే కొన్ని రకాల చేపల్లో పాదరం లేదా మెర్క్యురీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయని..వీటిని తినడం డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం తినకూడదని 3 చేపలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Eating Fish Beware of These 3 Dangerous Types

కింగ్ మాకేరెల్
మాకేరెల్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన ఆహార చేప. ఇది చాలా రుచికరంగా ఉంటుంది కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ రకాల మాకేరెల్ జాతులు ఉన్నాయి. ఇందులో కింగ్ మాకేరెల్ అనేది.. పెద్ద మాకేరెల్ జాతికి చెందిన చేప. దీనిలో పాదరసం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే శరీరంలో పాదరసం పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయని,వీటిని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణిలు, పాలిచ్చే తల్లులు ఈ మాకేరెల్ చేపలు తినకూడని సూచిస్తున్నారు. ఇవి కిడ్నీలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మగూర్ చేపలు
మగూర్ చేపలు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. ఈ చేపల పరిమాణం త్వరగా పెరగడానికి వీటి శరీరంలోకి వివిధ హార్మోన్లలను ఇంజెక్ట్ చేస్తుంటారు కొందరు చేపల పెంపకందారులు. కాబట్టి పెద్ద సైజులో ఉన్న మగూర్ చేపలు చేపలను కాకుండా చిన్న సైజులో ఉండేవి కొనాలి. ఇక,మనదేశంలో థాయ్ మగూర్ చేపల సాగును 2000వ సంవత్సరం నుంచి బ్యాన్ చేశారు. ఇవి ఇతర చేపలను తింటాయి. ఈ చేపలు మురికి,కలుషిత వాతావరణంలో కూడా జీవించగలవు. థాయ్ మాగూర్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు వీటిని కుళ్ళిన మాంసం వంటి పదార్థాలతో పెంచుతారు. ఇది నీటిని మరింత కలుషితం చేస్తుంది. జల పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తుంది. అందుకే వీటి సాగుని, దిగుమతిని భారత్ లో బ్యాన్ చేశారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ చేపల అక్రమ సాగు, అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం.

తిలాపియా
మనదేశంలోని ఏపీ,కేరళ,ఒడిషా రాష్ట్రాల్లో తిలాపియా చేపలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే చేప అని ఆక్వా రైతులు చెబుతుంటారు. ఈ చేపలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఈ చేపలకు కోడి వ్యర్థాలను అందిస్తుంటారు. దీంతో ఈ తిలాపియా చేపల్లో పెద్ద మొత్తం హానికరమైన కొవ్వులు ఉండి ఇవి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం,గుండె జబ్బులు,ఇతర వ్యాధులకు కారణమవుతాయి. ఆస్తమా,కీళ్లనొప్పులు ఉన్నోళ్లు ఈ చేపలను అసలు ముట్టుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిలాపియాలో ఉండే డైబ్యూటిల్టిన్ అనే రసాయం వల్ల ఇది తిన్నవారిలో ఉబ్బసం, అలర్జీలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని కాబట్టి వీటిని తక్కువ మొత్తంలో తినాలని,ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, May 4, 2025, 17:03 [IST]
Desktop Bottom Promotion