దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్‌ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్‌ ఇదే.!

దానిమ్మ పండ్లు కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. ఈ గింజల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా సంతానోత్పత్తి ప్రక్రియలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతుంటారు. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ స్థాయిల పెరుగుదల కోసం వీటిని తినాలని సిఫారసు చేస్తుంటారు. అయితే నిజంగానే ఈ హార్మోన్‌ లెవెల్స్‌ పెరుగుతాయా.. పురుషుల్లో వీర్య వృద్ధికి దానిమ్మ గింజలు ఎలా దోహదపడతాయో తెలుసుకుందాం..

eating pomegranates really boost testosterone men absolutely need to know

ముదురు ఎరుపు రంగు దానిమ్మ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ సి, విటమిన్‌ కె, ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియం, ఫైబర్‌, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. రక్తహీనత, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలకు దానిమ్మ గింజలు మంచి మెడిసిన్‌లా పనిచేస్తాయి. ఇదిలా ఉండగా.. దానిమ్మపండు తినడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయని చెబుతుంటారు. అంతేకాకుండా దీనిని 'నేచురల్‌ టెస్టోస్టెరాన్ బూస్టర్‌’గా పిలుచుకుంటారు.

పురుషుల్లో మెటబాలిజం పనితీరులో టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ పాత్ర కీలకమైనది. వారిలో బలం, కండరాల నిర్మాణం, శక్తి, వీర్యకణాల వృద్ధి, లైంగిక ఆరోగ్యంలో టెస్టోస్టెరాన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే దానిమ్మ గింజల్లో పాలీఫెనాల్లు, వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలు 16 శాతం నుంచి 24 శాతం వరకు పెరుగుతాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

అయితే, దానిమ్మపండ్లను తీసుకున్న కారణంగానే నేరుగా టెస్టోస్టెరాన్ హార్మోన్‌ స్థాయిలు పెరుగుతుందని చెప్పడం పూర్తిగా సరైనది కాదని నిపుణులు అంటున్నారు. ఆ గింజల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడేందుకు దోహదపడతాయి.

eating pomegranates really boost testosterone men absolutely need to know

దానిమ్మ గింజలతో పాటు ఇవి పాటించాలి..

టెస్టోస్టెరాన్‌ స్థాయిలను పెంచుకునేందుకు దానిమ్మ గింజలతో పాటు రెగ్యులర్‌గా వ్యాయామం, సరైన, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా మెరుగైన ఫలితం కనిపిస్తుంది. శారీరక శ్రమ, బరువులు ఎత్తడం ద్వారా ఈ హార్మోన్‌ సమతుల్యతను కాపాడుకోవచ్చు. సరైన బరువు, ప్రతిరోజూ సరైన సమయంలో 7 నుంచి 8 గంటలపాటు నిద్రతో వారిలో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుంది. మరీ ముఖ్యంగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అధిక ఒత్తిడి టెస్టోస్టెరాన్‌ స్థాయిలను తగ్గిస్తుంది.

హార్మోన్‌ బ్యాలెన్సింగ్‌ మాత్రమే కాదు

దానిమ్మ గింజల్లో ఐరన్‌ అధికంగా ఉన్న కారణంగా వీటిని తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పుష్కలంగా ఫైబర్‌ ఉండటంతో జీర్ణక్రియ సాఫీగా జరిగి మలబద్ధకాన్ని నివారస్తుంది. బీపీ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, October 4, 2026, 16:03 [IST]
Desktop Bottom Promotion