Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
భోజనం తర్వాత ఈచిన్న పని చేస్తే ఆ పెద్ద సమస్యకు చెక్ పెట్టొచ్చు..గ్యాస్ రిలీజ్ కూడా!
మారిన జీవనశైలి,ఒక టైం పాడు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. నడక ద్వారా బోలెడు న్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే భోజనం చేశాక కొద్దిసేపు నడవడం, ఆ సమయంలో సహజంగా గాలి పీల్చడం వల్ల జీర్ణక్రియతో పాటు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.
మన జీర్ణక్రియ ప్రక్రియ ఆహారం తిన్న వెంటనే మొదలవుతుంది. ఈ సమయంలో కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. తద్వారా ఆహారం త్వరగా జీర్ణమై కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం తగ్గుతుంది. అంతేకాకుండా నడక ప్రేగు కండరాలను కూడా ఉత్తేజపరుస్తుంది, ఇది జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారాన్ని సులభంగా ముందుకు కదిలించడంలో సహాయపడుతుంది.

గాలిని పంపడం ఎందుకు ముఖ్యం
జీర్ణక్రియ సమయంలో ప్రేగులలో సహజంగా వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ వాయువు సకాలంలో శరీరం నుంచి బయటకి వెళ్లకపోతే కడుపులో నొప్పి, అసౌకర్యం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. భోజనం తర్వాత నడుస్తున్నప్పుడు తేలికగా కదలడం వల్ల ఈ పేరుకుపోయిన వాయువు సులభంగా బయటకి వెళ్లిపోతుంది. దీనిని వాడుక బాషలో పిత్తులు అని పిలుస్తారు. ఒక్కసారి ఈ గ్యాస్ బయటకు వెళ్లిపోతే కడుపులో చాలా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. శారీరక ఆరోగ్యానికి ఇది చాలా సాధారణమైన, అవసరమైన ప్రక్రియ.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ అండ్ లివర్ డిసీజెస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం భోజనం తర్వాత తేలికపాటి శారీరక శ్రమ, ముఖ్యంగా నడక, కడుపు నుంచి ఆహారాన్ని ఖాళీ చేసే (గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్) ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల అజీర్ణం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.
మరో అధ్యయనం ప్రకారం భోజనం తర్వాత క్రమం తప్పకుండా నడిచే వారిలో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి వ్యాధుల ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. నడక క్రమమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది..గ్యాస్ పేరుకుపోయే ధోరణిని తగ్గిస్తుంది.
మొత్తంగా చూస్తే భోజనం చేసిన తర్వాత కనీసం 10-15 నిమిషాలు తేలికపాటి వేగంతో నడవడం మీ జీర్ణక్రియకు, తద్వారా మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాటును మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications