Latest Updates
-
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా..
రూపాయి ఖర్చు లేకుండానే హీరోయిన్ లాంటి అందం..డాక్టర్ చెప్పిన 5 హోమ్ రెమెడీస్
అందంగా కనిపించాలని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అందరికీ అందంగా కనబడాలనే ఉంటది. అందంగా కనబడేందకు చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్ లు,రకరకాల ప్రొడక్టులపై ఆధారపడుతుంటారు. అయితే అందంగా కనబడేందుకు అవసరమైన అన్ని మన వంటింట్లో,పెరట్లోనే ఉంటాయి. దీనికోసం వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టి క్రీములు వంటివి కొనక్కర్లేదు కూడా. ఖమ్మంలోని ప్రసిద్ధ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు చెందిన MD పీడియాట్రిక్స్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ గౌతమ్..అందంగా ఉండటానికి 5 హోం రెమెడీస్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
దోసకాయ..తక్షణ తాజాదనం కోసం
అలసిపోయిన కళ్ళు, వాడిపోయిన ముఖంతో ఇబ్బంది పడుతున్నారా? కీర దోసకాయ మీకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. దోసకాయ ముక్కలను కళ్ల మీద లేదా ముఖం మీద పెట్టుకోవడం వల్ల అందులోని అధిక నీటిశాతం చర్మానికి తేమను అందించి డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. కీర దోసకాయలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి ఫ్రెష్ గా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. కేవలం స్లైసెస్ మాత్రమే కాదు..దోసకాయ రసాన్ని ముఖానికి టోనర్ గా కూడా ఉపయోగించవచ్చు.

రోజ్ వాటర్..చర్మాన్ని స్మూత్ గా ఉంచుతుంది
రోజూ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. రోజ్ వాటర్ ఒక అద్భుతమైన సహజ క్లెన్సర్, టోనర్ గా పనిచేస్తుంది. ప్రతిరోజూ పొద్దున, రాత్రి దూదిని రోజ్ వాటర్ లో ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. ఇది చర్మం pH బ్యాలెన్స్ ను కాపాడి, చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుతుంది. దీని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే ఎరుపుదనాన్ని కూడా తగ్గిస్తాయి.
కలబంద..ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం
కలబందను సౌందర్య సంజీవని అని పిలవడంలో ఆశ్చర్యం లేదు. ఇందులో ఉండే విటమిన్లు, ఎంజైమ్ లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి అద్భుతమైన పోషణను అందిస్తాయి. రోజూ తాజా కలబంద(అలోవెరా) జెల్ ను ముఖానికి రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడమే కాకుండా సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది, మచ్చలను తగ్గించి, చర్మానికి సహజమైన గ్లో అందిస్తుంది.
పాలు,పసుపు..తలతలలాడే మేనిఛాయ కోసం
వంటలల్లోనే కాకుండా పెళ్లిళ్లలో, శుభకార్యాలలో కూడా పసుపును వాడటం మన సంప్రదాయంలో భాగం. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. పసుపులోని కుర్కుమిన్ అనే పదార్థం చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఒక సహజ ఎక్స్ ఫోలియెంట్ గా పనిచేసి మృతకణాలను తొలగిస్తుంది. ఒక చెంచా పాలలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మీ చర్మం తక్షణమే మెరిసిపోతుంది.
నిమ్మ, తేనె..టాన్ రిమూవల్ మ్యాజిక్
ఎండకు బయటకు వెళ్లడం వల్ల చర్మం నల్లబడటం అనేది ఒక సాధారణ సమస్య. దీనికి నిమ్మ, తేనె మిశ్రమం ఒక అద్భుతమైన పరిష్కారం. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి టాన్ ను తగ్గిస్తుంది. తేనె చర్మానికి తేమను అందించి, మృదువుగా చేస్తుంది. ఒక చెంచా తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications