Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పొరపాటున కూడా తేనెతో పాటు వీటిని తినొద్దు, ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది
తేనె.. ఆరోగ్య ప్రదాయిని. పలు రకాల వంటకాల్లో తేనెను వాడతారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా పాలు, టీ, కాఫీల్లో వేసుకుంటారు. తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల తేనెను ఆరోగ్య ప్రదాయినిగా అభివర్ణిస్తారు. అందుకే ఆయుర్వేదంలో తేనె వాడకం ఎక్కువగా ఉంటుంది.

తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదైనా తేనెతో పాటు కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ హానికరమైన తేనె కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీరు, వేడి పాలతో తేనె:
తేనె సహజంగానే వేడిగా ఉంటుంది. కాబట్టి తేనెను ఎప్పుడూ వెచ్చని వస్తువులతో పాటు తీసుకోకూడదు. వేడి వస్తువులతో తేనె కలిపి తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కొందరు వేడి నీటిలో, వేడి పాలలో తేనె కలుపుకుని తాగుతుంటారు. ఇది ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.
చేపలు, మాంసంతో తేనె:
మాంసాహారం ముఖ్యంగా చేపలు, మాంసంతో తేనెను కలిపి ఎప్పుడూ తినకూడదు. అలాగే వీటిని తిన్న ఒక గంట ముందు అలాగే గంట తర్వాత కూడా తేనెకు దూరంగా ఉండాలి. మాంసం, చేపలతో తేనె తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. అలా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
నెయ్యితో తేనెను కలిపి తీసుకోవద్దు:
తేనెను నెయ్యితో కలిపి ఎప్పుడూ తీసుకోవద్దు. ఎందుకంటే నెయ్యి మరియు తేనెలోని పోషకాలు ఒకదానికొకటి క్రాస్ చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కడుపు నొప్పి, తలనొప్పి వస్తుంది.
చక్కెరతో తేనె:
తేనెలో పంచదార కలిపితే ఆ మిశ్రమాన్ని విషంగా పరిగణించాల్సిందే. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. కనీసం ఒక గంట ముందు, గంట తర్వాత మాత్రమే తేనె కానీ చక్కెర కానీ తీసుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications