ఆల్కహాల్‌ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్‌.!

ఈ రోజుల్లో చాలా వరకు ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యతో ట్యాబ్లెట్స్‌ వాడుతున్న వాళ్లు ఉంటూనే ఉంటారు. అయితే కొందరు ఏదైనా సందర్భంలో ఆల్కహాల్స్‌ తీసుకుంటారు. మరికొందరికి రెగ్యులర్‌గా తీసుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలో మందు తాగిన తర్వాత ట్యాబ్లెట్‌ వేసుకోవచ్చా.. అని చాలా మందికి సందేహం ఉంటుంది. అసలు ఆల్కహాల్‌ తీసుకున్నాక మందులు వేసుకోవచ్చా.. దాని వల్ల కలిగే పరిణామాలేంటి.. వైద్యుల సలహాలు తెలుసుకుందాం..

Having tablets after taking alcohol know the disadvantages and health problems

శరీరంలోకి చేరిన ఆహారం, ఆల్కహాల్‌, మందులను కాలేయం ప్రాసెస్‌ చేస్తుంది. ఈ క్రమంలో మద్యపానం సేవించాక మందులు వేసుకున్నట్లయితే కాలేయంపై అదనంగా భారం పడుతుందని వైద్యులు అంటున్నారు. దీంతో ట్యాబ్లెట్స్‌ ప్రభావం తగ్గిపోవడం లేదా అవి అరుగుదల జరగక ఎక్కువ సేపు శరీరంలోనే ఉండిపోతుంది. ఫలితంగా వికారం, వాంతులు, తల తిరగడం, మగతగా ఉండటం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యల బారినపడే ప్రమాదం ఉంది.

పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!

అంతేకాకుండా కొన్ని రకాల మందులను ఆల్కహాల్‌తో కలిపి తీసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు. అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.

పెయిన్‌ కిల్లర్స్‌తో జాగ్రత్త

బాడీ పెయిన్స్‌, తల నొప్పి, ఫీవర్‌ వచ్చినప్పుడు ఎక్కువగా పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుంటారు. అయితే మద్యం సేవించాక వీటిని తీసుకోవడం చాలా ప్రమాదకరం. పారాసిటమాల్‌, డోలో వంటి మందులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా మద్యంతో పాటు వీటి భారం పెరిగి కాలేయం ఒత్తిడికి గురవుతుంది. ఆక్సికోడోన్‌ వంటి నొప్పి నివారణ మందులతో మగత తీవ్రంగా వస్తుంది. శ్వాస నెమ్మదిస్తుంది. ఓవర్‌డోస్‌ కావచ్చు. ఈ క్రమంలో ఆల్కహాల్‌ తీసుకున్న తర్వాత పెయిన్‌ కిల్లర్స్‌ వాడాల్సి వస్తే వైద్యుల సలహా తప్పనిసరి.

Having tablets after taking alcohol know the disadvantages and health problems

బీపీ, షుగర్‌ మందుల విషయంలో అలర్ట్‌

బీపీ, మధుమేహానికి మందులు వాడేవారు మద్యపానం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు. ఆల్కహాల్‌ తీసుకున్న తర్వాత మందులు వేసుకుంటే లో బీపీకి గురికావచ్చు. బలం తగ్గిపోతుంది. స్పృహ కోల్పోతారు. ఇంకా షుగర్‌ లెవెల్స్‌ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. వయసు పైబడిన వారు, రెగ్యులర్‌గా మందులు వాడే వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత డాక్టర్ల సలహా లేకుండా సొంత నిర్ణయాలు పనికి రాదు..

నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్‌లో ఏం తినాలో తెలుసా.?నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్‌లో ఏం తినాలో తెలుసా.?

ఒకవేళ మీరు ఆల్కహాల్‌ సేవించాక మీకు తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు తలెత్తితే సొంతంగా మందులు తీసుకోకుండా డాక్టర్లను సంప్రదించడం అవసరం. ఇప్పటికే మందులు వాడుతున్న వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని గుర్తుంచుకుని పరిమితి పాటించడం లేదా పూర్తిగా మానేయడం శ్రేయస్కరం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, September 26, 2026, 16:09 [IST]
Desktop Bottom Promotion