Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
బ్రిటన్ ప్రధానితో కలిసి మసాలా ఛాయ్ తాగిన మోదీ..వానాకాలంలో ఇది తాగడం వల్ల లభించే ప్రయోజనాలివే
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2 రోజుల అధికార పర్యటన కోసం బ్రిటన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 23,24 తేదీల్లో బ్రిటన్ లో మోదీ చేపట్టిన పర్యటనలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. చారిత్రాక్మక స్వేఛ్చా వాణిజ్యంపై భారత్,బ్రిటన్ దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పదం వల్ల భారత రైతులకు మేలు జరుగుతుందని, భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటన్ మార్కెట్ లో నూతన అభిస్తాయని..భారతీయ వస్త్రాలు,పాదరక్షలు, అనేక రంగాల్లో లబ్ది చేకూరుతుందని.. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ బప్పందంపై సంతకాలు పూర్తయినట్లు ప్రధాని మోదీ చెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన తర్వాత కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు.
గురువారం భారత్,బ్రిటన్ దేశాల మధ్య అతిపెద్ద,చారిత్మాక ఒప్పందంపై సంతకాల కార్యక్రమం తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రితో కలిసి మసాలా ఛాయ్ ని ఆస్వాదించారు ప్రధాని మోదీ. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నివాస ప్రాంగణంలో యూకేలో నివసించే భారత సంతతికి చెందిన అమలా చాయ్ వ్యవస్థాపకుడు అఖిల్ పటేల్ ఏర్పాటు చేసిన స్టాల్ దగ్గర మోదీ,కీర్ స్టార్మర్ మసాలా ఛాయ్ ని ఆస్వాదించారు. అసోం టీ తోటల నుంచి సేకరించిన పదార్థాలు, కేరళ ఫ్లేవర్స్ తో కలిపిన మసాలా ఛాయ్ న మోదీ,బ్రిటన్ ప్రధాని టేస్ట్ చూశారు. మోదీకి ఛాయ్ ని అందిస్తున్న సమయంలో ఒక ఛాయ్ వాలా మరొక ఛాయ్ వాలాకి టీ అందిస్తున్నాడు అంటూ అఖిల్ పటేల్ చేసిన వ్యాఖ్యలు అందరి ముఖాల్లో నవ్వు తెప్పించింది. అయితే మసాలా టీ కేవలం ఒక పానీయం కాదు, అదొక ఆరోగ్యకరమైన కషాయం.రుచి, సువాసన, ఆరోగ్యం..ఈ మూడింటి కలయికే మసాలా టీ. ఈ వానాకాలంలో మసాలా టీ ఎందుకు తాగాలో ఇక్కడ చూడండి.

జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం
వర్షాకాలంలో కామన్ వచ్చే జలుబు, గొంతు నొప్పికి మసాలా టీ దివ్యౌషధం. మసాలా టీలోని అల్లం, మిరియాలు అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి. అల్లంలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపును, నొప్పిని తగ్గిస్తాయి. మిరియాలు శ్లేష్మాన్ని తగ్గించి, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. వేడివేడి టీ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు కూడా క్లియర్ అవుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ఈ సీజన్ లో చాలామంది అజీర్తి సమస్యలతో బాధపడుతుంటారు. మసాలా టీలో వాడే యాలకులు,అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించి, జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది.
రోగనిరోధక శక్తికి బూస్టర్
వానాకాలంలో వాతావరణం చల్లగా, తేమగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వంటివి ఈజీగా వ్యాపిస్తాయి. మసాలా టీలో ఉపయోగించే లవంగాలు, దాల్చినచెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధుల నుండి కాపాడతాయి.
శక్తినిస్తుంది, ఉత్సాహాన్ని పెంచుతుంది
వర్షాకాలంలోని మబ్బులతో కూడిన వాతావరణం కొన్నిసార్లు బద్ధకాన్ని, నీరసాన్ని కలిగిస్తుంది. మసాలా టీలోని సుగంధ ద్రవ్యాల సువాసన, తేయాకులోని కెఫిన్ మన మెదడును చురుకుగా మార్చి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది బద్ధకాన్ని వదిలించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications