Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
తాటికల్లుతో వచ్చే లాభాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు..కల్లు-నీరా మధ్య తేడా ఇదే
మనదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కల్లు గురించి తెలియని వారుండరు. తాటికల్లుని దివ్య ఔషధంగా భావిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో దావత్ లలో ఖచ్చితంగా కల్లు ఉంటది. కోటీశ్వరుల ఇంట్లో ఫంక్షన్ అయినా కల్లు ఖచ్చితంగా ఉండితీరాల్సిందే. పిల్లలు, పెద్దలు, మహిళలు అన్ని వయస్సుల వారు కల్లుని తాగుతారు. ఇది తెలంగాణ కల్చర్ అని వాళ్లు చెబుతుంటారు. హైదరాబాద్ లో కూడా కల్లు అమ్మే దుకాణాల ఏర్పాటుకి కూడా ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూర చెట్లు, జీలగ చెట్లు నుంచి గీతకార్మికులు కల్లు తీస్తారు. చాలా మంది ఇప్పటికీ తాటి కల్లు తాగుతూ ఉంటారు. వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఈ కల్లు తాగుతారు. తాటి కల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. అయితే వాస్తవానికి అసలు తాటి కల్లు తాగితే ఏం ప్రయోజనం ఉంటుందో ఇక్కడ చూడండి.

తాటికల్లుతో ఈ ప్రయోజనాలు
తాటికల్లులో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే పూర్వీకులు తాటిచెట్టుని కల్పవృక్షంగా చెప్పేవారు. ప్రతి ఆరోగ్య సమస్యకి కల్లు ద్వారానే పరిష్కారం వెతుక్కునేవారు. తాటికల్లులో విటమిన్ B,విటమిన్ C,ఐరన్,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తాటికల్లు శరీర వేడిని కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ దాహం తీర్చడంలో తాటికల్లు సహాయపడుతుంది. తాటికల్లుని కొంతమంది హెల్త్ టానిక్ లా వాడతారు..ఎందుకంటే ఇది శరీరానికి తేలికపాటి ఎనర్జీని ఇస్తుంది.
కల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉండే ఓ సూక్ష్మజీవి కడుపులో ఉన్న క్యాన్సర్ కారకాన్ని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి తీయగానే తాగితే ఈ ఫలితాలు అందుతాయి. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్ కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో నివసించేవాళ్లు ప్రతిరోజు మసాల ఆహారాలు, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకుంటారు. దీంతో ఉదర సమస్యలతో బాధపడుతారు. అలాంటి వారికి కల్లు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కల్లులో ఉండే గుణాలు కడుపుని క్లీన్ చేస్తాయి.
కల్లు,నీరా మధ్య తేడా ఇదే
చాలామంది కల్లు,నీరా రెండూ ఒకటే అనుకుంటున్నారు. కానీ నీరా, కల్లు మధ్య చాలా తేడా ఉంటుంది. కల్లులో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. నీరాలో ఆల్కహాల్ కంటెంట్ ఉండదు. తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూర చెట్లు, జీలగ చెట్లు నుంచి నీరా సేకరిస్తారు. అయితే ఇలా సేకరించిన నీరాని సూర్యోదయం కంటే ముందే తాగాలి. ఎందుకంటే టెంపరేచర్ ఆరు డిగ్రీలు పెరిగితే నీరా పులిసిపోయి పులసి పోయి కల్లుగా మారుతుంది. చెట్ల నుంచి కల్లు కావాలంటే నీరాలో ఈస్ట్ అనే పదార్థం కలుపుతారు. ఆల్కహాల్ కంటెంట్ ఉండటం వల్ల కల్లు తాగడం వల్ల నిషా వస్తుంది. కానీ నీరా మాత్రం కొబ్బరి నీళ్ళలా తియ్యగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే నీరాని చెట్టు నుంచి తీసుకొని తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications