Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
జీవిత కాలాన్ని పెంచే గుండె నేస్తాలు...
సాధారణంగా మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఇంధనంలా పని చేస్తుంది. ఆహారం మన శరీరానికి మూడు విధాలుగా ఉపయోగపడుతుంది. అవి శరీర నిర్మాణానికి, శక్తిని చేకూర్చడానికి, శరీర కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి. మన శరీరం పని చేయడానికి ఆహారం, నీరు అతి ముఖ్య మైన పోషకావసరాలు. మన శరీరంలోకి ప్రవేశించే ప్రమా దకరమైన బాక్టీరియాతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతర శరీర ధర్మాల నిర్వహణకు ఆహారం ద్వారా లభించే రసాయనాల అవసరం ఎంతో ఉంది.
కొన్ని ఆహారాల్లో ఎక్కువగానూ, మరికొన్నింటిలో తక్కువగానూ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. మనం ఎంత తింటున్నామనేది మాత్రమే కాదు, ఏం తింటు న్నామనేది కూడా ముఖ్యమే. అన్ని రుచులు, పదార్థాలు కలిస్తేనే సంపూర్ణ ఆహారం అవుతుంది. కొన్ని పదార్థాలు కళ్లను కాపాడుకుంటే మరికొన్ని బలాన్నిస్తాయి. ఇంకొన్ని శరీరంలోని ఇతర భాగాలకు మంచి చేస్తాయి. అలాంటి వాటిలో గుండెకు మంచి చేసే ఏడు రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం...

ఆకు కూరలు: ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలు పాలకూర, మెంతి కూర, వంటి వాటిలో విటమిన్ - బి కాంప్లెక్ష్, నియాసిన్ అధిక మోతా దులో వుంటాయ. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుం డా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్, పుల్లటి రుచిగల పండ్లు వంటివాటిలోనూ ఎక్కువగా లభిస్తాయి.

గోధుమ: గుండెకు అవసరమయ్యే ఫైబర్, విటమిన్స్, మినరల్స్ గోధుమలో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెకు హాని కలిగించే ఫ్యాట్‌ని నివారిస్తుంది. ఫైబర్ కొవ్వుతో కలిసి దానిని బయటికి పంపేందుకు పనిచేస్తుంది.ఇంకా ఫైబర్ దొరికే పదార్థాలలో ఓట్స్, బార్లీ, రాగి, జొన్న వంటివి ముఖ్యమైనవి.

వెల్లుల్లి : వెల్లుల్లి గుణాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇందులో వుండే ఆక్సిడెంట్ల వల్ల గుండెకు ఎంతో మేలు జరుగు తుంది. అంతే కాదు ఇది గుండెకు హాని కలిగించే చెడు కొవ్వును నిరోధించడంలో సాయపడుతుంది. ఇవి రక్తాన్ని సరఫ రా చేసే నాళాలకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని అన్ని రకాల్లో వంటల్లోనూ, వేపుళ్ళలోని వుపయోగిస్తే రుచి పెరుగు తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

ఆపిల్స్ : విటమిన్స్, మినరల్స్, ఐరన్ ఆపిల్‌లో పుష్కలం గా వున్నాయి. ఇంకా ఇందులో పాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమి న్ ఏ, బి, సి కూడా ఇందులో అధిక మోతాదులో వుంటాయి. ëఇవి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే నరాలకు ఎంతో మంచి చేస్తాయిí అని న్యూట్రీషనిస్ట్ స్నేహా త్రివేది చెబుతున్నారు. ఇందులో గ్లైసెమిక్ చాలా తక్కువ మోతాదులో వుంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మంచిది అని చెబుతున్నారు.

చేపలు : చేపల్లో వుండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నరాల్లో రక్త సరఫరాను క్రమబద్ధం చేస్తాయి.ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. ఇవి శరీరంలో ఇమ్యునిటీ శక్తిని కూడా పెంపొందిస్తాయి. గుండెకు మంచి చేసే కొవ్వును పెంపొందిస్తాయి. అంతేకాదు శరీరంలో రక్తం గడ్డకట్టకుండా వుండేందుకు ఇది ఎంతో అవసరం.

పాల ఉత్పత్తులు: పాలు, పాల ఉత్పత్తులు ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి వుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పోలీఫెనల్స్ కూడా వీటిలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని చేరవేసే నాళాలలో బ్లడ్ ఫ్రెషర్‌ని తగ్గిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తాయి.

ఆలివ్ ఆయిల్ : ఆలివ్ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు వుపయోగపడతాయి.ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో వున్నాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు వుపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.



Click it and Unblock the Notifications
