Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ప్రతిరోజూ పండు కొంటున్నారా? గుండె పదిలం?
పండ్లు చాలా రుచి, నోరూరిస్తాయి. తినేందుకు తేలిక. వీటిని వేరే ఐస్ క్రీమ్ లేదా ఇతర ఆహారాలతో కూడా కలిపి తినేయవచ్చు. మరి మీ ఆహారంలో ప్రతిరోజూ పండ్లు తగినన్ని చేర్చి తింటున్నారా? మనమంతా ప్రతిరోజూ ముఖ సౌందర్యం మెరుగుపడాలని, చర్మం కాంతులీనాలని ఎన్నో క్రీములు, పౌడర్లు రాస్తూనే ఉంటాం.అందులో విటమిన్లు, పండ్లు వంటివి ఎన్నో ఉన్నాయంటూ తయారీదారులు చెపుతూనే ఉంటారు. అయితే, సహజంగా దొరికే పండ్లు కొనకుండా మనం వీటిని ఎందుకు కొనుగోలు చేస్తాం? మరి ప్రతిరోజూ మీరు ఎన్ని రకాల పండ్లు మీరు ఆహారంలో తినాలో పరిశీలించండి.

2010 సంవత్సరంలో చేసిన ఒక స్టడీలో ప్రతిరోజూ రెండు కప్పుల పండ్లు తినాలిట. అయితే, మీ బరువును బట్టి తీసుకోవాల్సిన కేలరీలను బట్టి కూడా తినాలని తెలిపారు. రోజుకు అయిదు సార్లు పండ్లు, కూరలు తింటే, అది మీ వయసు, లింగాన్ని బట్టి కూడా ఉంటుంది. మహిళలు 19 నుండి 50 సంవత్సరాల వారు రోజుకు 7 లేదా 8 సార్లు, పురుషులు 8 నుండి పది సార్లు తినాలి. 50 సంవత్సరాలు వయసు పైబడిన పురుషులు మహిళలు అయితే 7 సార్లు వెజిటబుల్స్ మరియు పండ్లు రోజుకు తింటే సరిపోతుంది.
ఇవన్ని విద్యాపరంగా చెప్పుకోటానికి బాగానే ఉంటాయి. పండ్లు కేన్సర్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి మొండి వ్యాధులు రాకుండా చేస్తాయి. పండ్లలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని పండ్లలో సహజ షుగర్ మరియు కొన్ని ద్రవాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. పండ్లలో పీచు పదార్ధం కూడా అధికంగా ఉండి మీకు ప్రతిరోజూ సుఖ విరోచనమై మలబద్ధకం లేకుండా చేస్తాయి. అంతేకాదు, బరువును తగ్గించటంలో గణనీయ పాత్రను పోషిస్తాయి. పండ్లు చాలావరకు తొక్క తీయకుండా, రసం తీయకుండా....ఎలా ఉన్నవి అలా తింటే ఎంతో ఆరోగ్యం
మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కల పండ్లను మీ ప్రతిరోజూ ఆహారంలో ఎలా చేర్చాలి?
రోజుకు రెండు కప్పుల పండ్లు తీసుకోవాలని నిర్దేశించారు కాబట్టి, వీటిని రోజుకు నాలుగు సార్లు తినండి. బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, సాయంత్రం చివరగా రాత్రి డిన్నర్ అయిన తర్వాత. నిలువ రసాయనాలు వేసిన డబ్బాలలోని పండ్ల రసాలు తాగకండి. వీటిలో షుగర్ అధికం, నిలువ కొరకు రసాయనాలు వేస్తారు. పండ్ల రసాలు లేదా తొక్క తీసినవి కాకుండా తాజా పండ్లు ఎలా ఉన్నవి అలా తింటే పోషక విలువలు అధికం అని తెలుసుకోండి. ఏ సీజన్ లో వచ్చే పండ్లను ఆ సీజన్ లో అధికంగా తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications