Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం?

వారానికి రెండు లేక మూడు రోజులపాటు చేపల ఆహారం తీసుకుంటే, గుండె జబ్బు రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్. డీ. పనాజియోటాకో తెలిపారు. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రత్యేకంగా ఏ రకానికి చెందిన చేపలు తింటే మరింత ఆరోగ్యంగా ఉంటారనేది తాము అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ప్రస్తుతం నిర్వహించిన పరిశోధనలననుసరించి చేపలు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటూ గుండె జబ్బులబారిన పడకుండా ఉంటారని ఆయన తెలిపారు. గుండె జబ్బుల రోగులకు
శుభ వార్తగా, పాత గుండె స్ధానంలో కొత్తరకం కృత్రిమ గుండె రెడీ అయినట్లు టెక్సాస్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఈ కొత్తరకం గుండె పాత గుండెవలే ‘లబ్ డబ్' ధ్వనులు చేయదట. ఈ కొత్త గుండెలో రక్తాన్ని తోడే పంపు చాలా చిన్నదిగా వుంటుందని సుమారు ఒక చిన్న బేటరీలా వుంటుందని కనుక దీనిని ఏ సైజు శరీరానికైనాగానీ అంటే పిల్లలకు కూడా అమర్చవచ్చని వీరు చెపుతున్నారు.
ఒరిజినల్ గుండె అంతగా దీర్ఘకాలం పని చేయకపోవచ్చుగానీ, అదే పనులను ఈ కొత్తరకం గుండె కూడా చేస్తుందని వీరు తెలుపుతున్నారు. దీని పనితనం సుమారు రెండు దశాబ్దాలవరకే వుంటుందట.
అయితే, దీర్ఘకాలంలో రక్త పోటు ప్రభావం ఎలా వుంటుందనేది సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. ఈ గుండెను పెట్టిన వారికి ఇంతవరకు రక్త ప్రసరణ బాగానేవుందని వారు జీవించే వున్నారని తెలిపారు.
ప్రస్తుతం గుండెపై జరిగే ఈ పరిశోధన మొదటి దశ అని ఈ పరికరాన్ని గనుక నిర్వహణలోకి పూర్తిగా తేగలిగితే మొదటి దశలో 50,000 నుండి 100,000 వరకు లబ్ది పొందగలరని సైంటిస్టులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications