Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
తీపి అధికంగా తింటే గుండె జబ్బులే!

ఈ నేపధ్యంలో, అధికంగా చక్కెరను తీసుకునేవారిలో ఊబకాయ సమస్యతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించినట్లుగా కూడా వీరు తెలిపారు. ప్రధానంగా మహిళలు రోజుకు వంద కేలరీలకు మించకుండా ఉండేలా షుగర్ తీసుకోవాలని లేదా ఆరు టీస్పూన్ల చక్కెరను మాత్రమే అంటే షుమారు 25 గ్రాములు మాత్రమే షుగర్ ను తీసుకోవాలని వీరు తెలుపుతున్నారు.
ఇదే విధంగా, పురుషులు రోజుకు 150 కెలోరీలకు మించకుండా ఉండేలా చక్కెరను తీసుకోవాలి. లేదా తొమ్మిది టీస్పూన్ల మేరకు అంటే 37.5 గ్రాముల చక్కెరను మాత్రమే తీసుకోవాలని వీరు సూచించారు. ఒకవేళ ఈ మోతాదుకుమించి చక్కెరను తీసుకున్నా లేదా తీపి పదార్థాలు తీసుకున్నా వీలైనంత మేరకు.... అధిక నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని అధికంగా తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయని పరిశోధకులు తెలుపుతున్నారు. కూల్ డ్రింక్ ల వంటివి తీసుకోవడంతో శరీర రక్తంలో షుగర్ నిల్వలు పెరగడంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోందని, తాము పరిశోధించిన దాదాపు ఆరువేలమందిలో 20 శాతం మేర వ్యక్తులలో చక్కెర అధికంగా తీసుకోవడం వలననే వారిలో అధిక కేలరీలు పెరిగినట్లు పరిశోధకులు తెలుపుతున్నారు.
మరి గుండె జబ్బులు దరికి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి?
గుండె జబ్బులు రాకుండా వుండాలంటే, ప్రధానంగా ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. ఒక పోషకాహార నిపుణుడిని సంప్రదించి గుండెకు ఆరోగ్యం కలిగించే ఆహారాలను తెలుసుకొని వాటిని ప్రణాళిక చేయాలి. ప్రతి 1000 కేలరీలకు కనీసం 14 గ్రాముల పీచు పదార్ధం ప్రతిరోజు తినే ఆహారంలో వుండేలా చూడాలి. పీచు వుంటే చెడ్ కొల్లెస్టరాల్ తగ్గుతుంది.
ఆహారంలో ఓట్లు, బ్రౌన్ బ్రెడ్, ఎండు బీన్స్, పండ్లు, బఠాణీలు, కూరలు మొదలైనవి అధిక పీచు కలిగి వుంటాయి. కొల్లెస్టరాల్ స్ధాయి పెంచే కొవ్వులు వదలండి. ఇవి రెడ్ మీట్, బటర్ ఘీ, డైరీ ప్రాడక్ట్ వంటివిగా వుంటాయి. కొల్లెస్టరాలో రోజుకు 300 మి.గ్రా కన్నా అధికంగా వుండరాదు. ప్రతిరోజు తినే ఆహారంలో కార్బో హైడ్రేట్లు 60 శాతం వరకు మాత్రమే వుండేలా చూడండి. అన్నిటినీ మించి రోజువారీ కార్యక్రమాలలో వ్యాయామం లేదా నడక, స్విమ్మింగ్, సైకిలింగ్, ట్రెడ్ మిల్ వంటివి కనీసం 30 నిమిషాలనుండి ఒక గంట వరకు తప్పక చేయాలి. వీటిని కనీసం వారానికి 5 లేదా 6 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. ఏ వ్యాయామమైనా సరే ఖచ్చితంగా తీవ్రంగా చేసే ముందు శారీరక పరీక్షలకై వైద్యుని సంప్రదించాలి. అధిక బరువు ఇప్పటికే వున్నవారు సరైన బరువుకై తప్పక కృషి చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications