Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
గుండె సంబంధిత డాక్టర్ ను సంప్రదించేటపుడు .....!

మనం డాక్టర్ దగ్గరకు గుండె సంబంధిత వ్యాధులతో వెళ్ళేటపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
1. గుండెకు సంబంధిచిన వ్యాధుల వలన కలిగిన లక్షణాలను ఒక స్లిప్ లో వ్రాసుకోండి. దీనివలన మీరు మరచిపోయే ప్రమాదం ఉండదు. మరియు డాక్టర్ కు అన్ని లక్షణాలు తెలిసి మరింత మెరుగైన వైద్యం అందవచ్చు.
2. డాక్టర్ అడిగిన ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానం చెప్పండి. మనం అందించే సమాచారాన్ని కూడా వైద్యం చేసేటపుడు పరిగణనలోకి తీసుకొంటారని మరిచిపోవద్దు.
3. డాక్లర్లతో మాట్లాడేటపుడు చిరునవ్వుతో, మెల్లగా మాట్లాడండి.
4. ఏదైనా కారణాలవల్ల డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకోకపోతే వాటిని ఆయనకు చెప్పండి. అవసరమైతే ఆయన రాసిచ్చిన మందులు కూడా తీసుకుపొండి.
5. అవకాశముంటే మీరు ఆరోగ్య వివరాలను, మీరు అడగదల్చుకొన్న ప్రశ్నలను, మీకు అపాయింట్ మెంట్ సమయం కన్నా ముందే డాక్టర్ గారికి ఇవ్వండి. దీనివల్ల ఆయన వాటిని అర్ధం చేసుకొని మరింత బాగా సలహాలివ్వవచ్చు.
6. డాక్టర్ ను సంప్రదించేందుకు అపాయింట్ మెంట్ ముందుగానే తీసుకోండి. అప్పటికపుడు వెళ్ళి అపాయింట్ మెంట్ దొరకక హైరాన పడడం అక్కడివారిని ఇబ్బంది పెట్టడం చేయవద్దు.
7. ఆ హాస్పిటల్ లో పనిచేసే ఉద్యోగుల మీద నర్సుల మీద ఎటువంటి ఆరోపణలు డాక్టర్ల దగ్గర చేయవద్దు. వారు తమకు అపాయింట్ మెంట్ త్వరగా ఇవ్వలేదని, సరిగ్గా ట్రీట్ చేయలేదని వంటివి చెప్పకండి. మన మాదిరిగానే చాలా మంది రోగులు డాక్టర్ దగ్గరకు వస్తారన్న విషయం మరచిపోవద్దు. అందరినీ చూడాల్సిన భాధ్యత వారిపై ఉంటుందని గమనించండి.
8. గుండెకు సంబంధించిన వ్యాధులతోపాటు షుగర్, బి.పి. లాంటి ఇతర వ్యాధులేవైనా ఉంటే నిర్భయంగా డాక్టర్ కు చెప్పండి. ఎందుకంటే మీ కోసం మరింత జాగ్రత్తగా చికిత్స చేయాల్సి ఉంటుంది. మీరు హాస్పిటల్ కు వెళ్ళినపుడు ఈ సలహాలను పాటించండి. మీతో పాటు ఇతరులకు కూడా ఇబ్బంది ఉండదు.
జీవితంలో పాజిటివ్ యాటిట్యూడ్, మీ గుండెకెంతో మేలు చేస్తుంది. ప్రశాంతమైన సంగీతం వినటం, ప్రకృతి అందాలను ఆస్వాదించటం, మనసునిండా నవ్వటం, రిలాక్స్ కోసం రుచికరమైన ఆరోగ్యకరమైన పానీయాలు సేవించటం, నవ్వుతూ నవ్విస్తూ ఎపుడూ పాజిటివ్ గా వుండటం ఇవన్నీ మీ గుండెకు మేలు చేసే అంశాలే.
మీ గుండెకు హాని చేసే ఆహారాలేమిటో తెల్సుకుని ఆ ఆహారాలకు దూరంగా ఉండండి. మీ గుండెకు మేలు చేసే సాత్విక ఆహారాన్ని, మంచి పౌష్టికాహారాన్ని మాత్రమే తినండి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్స్, మీ ఆహారంలో ప్రతిరోజూ ఉండి తీరాలి. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం మాత్రమే తినండి. మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే మీ గుండెకు అంత మంచిది. పూర్వకాలం నాటి వారితో పోలిస్తే నేటి తరం వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు అధికం. ఇందుకు కారణాలు అనేకం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications