Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
గుండె జబ్బులు వున్న రోగులకు ఎసిడిటీ వుంటే?

గుండె జబ్బుకలవారికి ఎసిడిటీ వుంటే తగు జాగ్రత్తలు...
1. ఎసిడిటీ ఉన్నవారు ఆహారాన్ని ఒకేసారి అధిక మొత్తంలో కాకుండా అప్పుడపుడు కొంత తింటుంటే చాలా మంచిది. ఇది వారి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది.
2. ఎసిడిటీ ఉన్నవారు ఎక్కువ సమయం ఆకలితో ఉండకూడదు. తమ కడుపులో ఏమీ లేక ఖాళీగా ఉండటం వల్ల గ్యాస్ ఏర్పడి త్రేన్పులు రావడం కడుపులో మంటగా ఉండటం వంటివి జరగవచ్చు.
3. కొన్ని కోలా పానీయాలు, మరియు చాక్ లెట్లు ఈ ఎసిడిటీని ఇంకా ఎక్కువ చేస్తాయని మరచిపోవద్దు. కనుక కూల్ డ్రింక్స్ ఇతర చిరుతిళ్ళు తగ్గించండి.
4. చాలామందిలో కాఫీ అధికంగా తాగే అలవాటు ఉంటుంది. ఎసిడిటీ ఉన్నా దానిని మాత్రం వారు తగ్గించరు. కాఫీలోని కెఫిన్ అనే పదార్ధం గుండెలలో కడుపులో మంటకు కారణమవుతుందనేది ఎవరూ కాదనలేని సత్యం. కనుక కాఫీ తగ్గించటం చేయాలి. లేదా పూర్తిగా మానివేయాలి.
5. ఏదైనా ఆరోగ్య సమస్యలకు, డాక్టర్ సూచించిన మందులు వేసుకోవాలనుకుంటే కడుపుకు ఏమన్నా కొంచెం ఆహారం తీసుకొన్న తర్వాత మందులు వేసుకోండి. ఖాళీగా ఉన్న కడుపులో మాత్రలు వేసుకోవడం వలన కడుపులో నొప్పి, మంట వచ్చే అవకాశముంది.
6. ఎసిడిటీ ఉన్నవారు ప్రధానంగా తగ్గించవలసింది కారం, పులుపు, అధికంగా ఉండే ఆహార పదార్ధాలు. అలాగే కొవ్వు పదార్ధాలు, వేపుళ్ళను కూడా సాధ్యమైనంత తక్కువగా వాడాలి. ఈ విధంగా మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే, ఎసిడిటీ నుంచి ఉపశమనం లభించి తద్వారా కడుపులో గుండెల్లో మంట లేకుండా నివారించవచ్చు.
గుండె క్రమపద్ధతిలో కొట్టుకోకపోవడం -
ఇది అంత పెద్ద వ్యాధి కాదనుకుంటే చాలా పొరపాటు. ఆరోగ్యవంతమైన మనిషి శరీరానికి గుండె క్రమానుసారం కొట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. గుండె నిమిషానికి సగటున 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. క్రమానుసారం గుండె సంకోచ, వ్యాకోచాలకు గురికావడం వల్ల రక్తం శరీరంలోని అన్ని భాగాలకు సక్రమంగా ప్రవహిస్తుంది.
కారణాలు - ఈ విధంగా గుండె క్రమ పద్ధతిలో కొట్టుకోకపోవడానికి కరోనరీ ధమనుల వ్యాధులు, డయాబెటీస్, కార్డియోమయోపతి, డ్రగ్స్ వాడకం, ధైరాయిడ్ వ్యాధులు కారణాలు కావచ్చు. ఒక్కోసారి ఇతర కారణాల వల్ల కూడా ఇది జరుగవచ్చు.
ఈ వ్యాధిని ఇసిజి పరీక్ష ద్వారా మనం గుండె యొక్క పనితీరును నమోదు చేసి గుర్తించవచ్చు. అంతే కాకుండా హార్ట్ మానిటర్ ద్వారా గుండె కొట్టుకొనే తీరును తెలుసుకొని ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధిని తగ్గించడానికి కొన్ని రకాల మందులు వాడితే సరిపోతుంది. అయితే కొందరిలో ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే అవకాశాలున్నాయి. కాబట్టి ఎవరైనా రోగి ఈ మందులు వాడటం వలన ఏదైన దుష్పరిణామాలకు గురైతే డాక్టర్ కు ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలియచేయాల్సి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications