Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
గుండె ఆరోగ్యాన్ని పాడు చేసే కూల్ డ్రింకులు!

వీటిలో వుండే కార్బోహైడ్రేట్లు లేదా షుగర్లు ఏ రకమైన పోషకాలు కలిగి వుండవని, శరీరానికి కేలరీలు అధికంగా చేరి బరువుకు పెరగటానికి సహకరిస్తాయని చెపుతునారు. అంతేకాదు బోస్టన్ లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు చేసిన ఒక సర్వేలో ఈ కూల్ డ్రింక్ లు పురుషుల గుండెలకు సమస్యలు కలిగిస్తున్నాయని వెల్లడైంది. కనుక వేసవి వచ్చిందంటే కూల్ డ్రింక్ లు తాగే వారు జాగ్రత్తగా వుండాలి.
వీటిని తాగినందువలన గుండె జబ్బుల రిస్కు కనీసం 20 శాతం అధికంగా వుంటుందని పరిశోధకులు ఒక తాజా అధ్యయనంలో తెలిపారు. డైట్ సోడాల వంటివి ప్రతిరోజూ తాగే వారికి మరింత హాని. ఈ డైట్ సోడాలు 61 శాతం అధిక రిస్కు కలిగించి రక్తనాళాలను సైతం పగిలేలా చేస్తాయట. ఇక చల్లదనం, దాని లోని తీపి కి ఆకర్షించబడే పిల్లలు కనీసం అంటే 40 నుండి 100 మి.లీ. కూల్ డ్రింక్ తాగేస్తారు. దీని కారణంగా సంవత్సరానికి వీరు 3 నుండి 5 కిలోల బరువు పెరుగుతున్నట్లు స్టడీ తెలిపింది.
కూల్ డ్రింకులు, సోడాలకు బదులుగా, సహజమైన శీతల పానీయాలు పండ్లరసాలు, పుచ్చకాయ వంటి పండ్లు, మండే ఎండలలో తాగటం లేదా తినటం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, తాగే పండ్ల రసాలలో సైతం షుగర్ లేకుండా లేదా తక్కువ మొత్తాలలో వాడటం మంచిది. కూల్ డ్రింకులు, సోడాలు తాగే సమయంలో చల్లగా వుండి మంచి భావనలు కలిగించినప్పటికి దీర్ఘకాలంలో వీటి ప్రభావం శరీర ఆరోగ్యంపై చెడుగా పడి దుష్ఫలితాలను కలిగిస్తుందనటంలో సందేహం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
