Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
రక్తపోటు తగ్గించే అద్భుత కాంబినేషన్ పిల్!

తాజాగా చేసిన ఒక అధ్యయనంలో రీసెర్చర్లు రెండు లేదా అంతకంటే అధిక మందులు కలగలిపిన ఒక సూపర్ పిల్ కనిపెట్టారని అది రక్తపోటును అదుపులో వుంచి గుండె జబ్బులు రాకుండా చేస్తుందని వెల్లడైంది. చాలామంది అధిక రక్తపోటు వున్న రోగులు అనేక రకాల మందులను వాడుతూంటారు. అవి కూడా రోజులో వివిధ సమయాలలో వేసి గుండె జబ్బు లేదా పోటు లేదా స్ట్రోక్ వంటివి రాకుండా జాగ్రత్త పడుతూంటారు. రోగులు కొందరు వయసుపైబడినవారైన కారణంగా వివిధ రకాల టాబ్ లెట్లను వివిధ సమయాలలో వేసుకోవడం కష్టంగానే వుంటుంది. కొన్ని మార్లు, కనీసం ఒక మందు అయినా తాము మరచిపోతూంటారు. దాని కారణంగా కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూంటాయి. లేదా ఏది ముందు, ఏది తర్వాత వేయాలి అనే అంశం కూడా వారికి సందిగ్ధంగానే వుంటుంది.
రీసెర్చి మేరకు ఇంగ్లాండ్ దేశంలో ఇరవై లక్షల మంది వ్యక్తులు ప్రతిరోజూ రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ వ్యాధికి మూడు లేదా అంతకంటే ఎక్కువగా టాబ్ లెట్స్ వేస్తున్నారు. అయితే వీరిలో కనీసం 80 శాతంమంది రోగులు, వైద్యులు చెప్పిన విధంగా నిర్దేశిత మందులు వాడటం లేదని కూడా అధ్యయనంలో వెల్లడైంది. అంటే దీని అర్ధం వారి రక్తపోటు సరిగా నియంత్రించబడటం లేదని కూడా చెప్పవచ్చు.
కనుక ఈ మూడు లేదా అంతకంటే అధికంగా వున్న రకాల మాత్రలను ఒకే మందుగా రూపొందించి దాని వినియోగాన్ని సమర్ధవంతం చేయడానికి గాను రీసెర్చర్లు ఒకే సూపర్ పిల్ కనుగొన్నట్లు స్ట్రోక్ అసోసియేషన్ డిప్యూటీ డైరెక్టర్ డా. పీటర్ కోల్ మన్ పేర్కొన్న్నట్లుగా డెయిలీ ఎక్స్ ప్రెస్ పత్రిక పేర్కొంది. సుమారు 13.6 శాతంమంది రోగులు అధిక రక్తపోటులకు వైద్యం చేయబడినప్పటికి తీవ్రమైన గుండె జబ్బులబారిన పడినట్లు స్టడీ వెల్లడిచేసింది. అయితే, అన్నీమందులు కలిపిన ఒకే సూపర్ పిల్ వేసినపుడు గుండెపోట్ల శాతం 8.3 కు పడినట్లు తెలిసింది.
కనుక కాంబినేషన్ పిల్ తో చేసే వైద్యం రోగులకు లబ్దికరంగా వుందని గుండె సమస్యలను తగ్గించడమే కాక మందుల వ్యయం కూడా తగ్గిందని స్టడీ నేత డా. జొనాధన్ బెస్లీ తెలిపారు. సుమారుగా పది మిలియన్ రోగుల మెడికల్ రికార్డులను వీరు పరిశీలించారు. అయితే, ఈ కాంబినేషన్ పిల్ అందరికి వాడరాదని, ప్రతి వ్యక్తి రోగ సమస్యను పరిశీలించి వారికి వినియోగించాలని డా. కోల్ మన్ ప్రకటించారు. ఈ స్టడీని జర్నల్ ఆఫ్ మెడికల్ ఎకనామిక్స్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications