Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
తియ్యటి డ్రింకులు...తీవ్ర గుండె జబ్బులు!
స్వీట్ సోడా అనేది నురగలు కక్కే ఒక కృత్రిమ రుచి కల డ్రింక్. ఈ డ్రింక్ లో తేలికగా జీర్ణం అయ్యే షుగర్ కలిపేస్తారు. అది తాగిన వెంటనే కడుపులో మంట కలిగి మీకు తేలికగా అయినట్లుంటుంది. కాని మీ రక్తంలోని లిపిడ్స్ బాగా పెరుగుతాయి. ఈ పెరుగుదల గుండె జబ్బులకు దోవతీస్తుంది. మీరు వాటిని ఎంత అధికంగా తీసుకుంటే, అంత రిస్కు పెరుగుతుంది. మరి స్వీట్ సోడాలకు, గుండె పనితీరుకుగల సంబంధం పరిశీలిద్దాం.

షుగర్ మరియు నురగల డ్రింకులు పిల్లలకు ఊబకాయం కలిగిస్తాయి. నేటి రోజులలో పిల్లలు ఈ తియ్యటి కూల్ డ్రింకులను అధికంగా తాగుతున్నారు. వీరికి జ్యూసులు, నీరు కంటే కూడా కూల్ డ్రింకులు, తియ్యటి సోడాలపై మక్కువ ఎక్కువ. వీరిలోని ఈ అలవాటు వారికి చెడు కలిగిస్తోంది. ఈ డ్రింకులలో పోషకాలు ఏమీ ఉండవు. షుగర్ మాత్రమే ఉంటుంది. షుగర్ అధిక కేలరీలను ఇస్తుంది అవి బరువు అధికం చేస్తాయి. మీలోని ఎనర్జీని తగ్గిస్తాయి. పైగా పిల్లలు, ఈ కూల్ డ్రింకులను జంక్ ఫుడ్ అంటే పిజ్జాలు, బర్గర్లతో కలిపి తాగుతారు. ఈ రెండు కలిపి పొట్టలోకి పంపటం చాలా హానికరం అని గ్రహించాలి.
సోడాకు గుండెకు సంబంధం ఏమిటి? అనేదానిపై హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ షుమారుగా 43 వేలమంది వ్యక్తులపై 22 సంవత్సరాలపాటు పరిశోధన చేసింది. వీరి వయసులు 40 నుండి 75 సంవత్సరాలవరకు ఉన్నాయి. ఈ సమయంలో వారు తినే అలవాట్లను పరిశీలించారు. తినటం, ఈ డ్రింకులను తాగటం చేసిన షుమారు 18 వేలమంది నుండి రక్త నమూనాలు తీసుకున్నారు. తరచుగా ఈ కూల్ డ్రింకులు లేదా తియ్యటి సోడాలు తీసుకున్న వారిలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదకరమైన ట్రిగ్లసెరైడ్స్ మరియు కొవ్వులు కనపడ్డాయి. ఈ రీసెర్చి ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించారు. 12 ఔన్సుల తియ్యటి డ్రింకులు తాగితే చాలు గుండె జబ్బులు 20 శాతం పెరిగినట్లు తేలింది.
ఇక మధ్య వయసు వారిలో ప్రతిరోజూ ఒకటి లేదా రెండు డ్రింక్ లు తాగితే చాలు వారు జీవక్రియ సంబంధిత వ్యాధులు పొందారు. అంటే, అధిక రక్తపోటు, బరువు పెరగటం, కొల్లెస్టరాల్ అధికంగా ఉండటం, మరియు ఇన్సులిన్ ప్రభావం తగ్గటం జరిగింది. కేన్సర్ కలిగించే ఈ షుగర్లు తరచుగా అధిక ఫ్రక్టోస్ కార్న్ సిరప్ రూపంలో సోడాలు, డ్రింకులలో ఉంటాయి. కనుక ఏదేని తియ్యటి కృత్రిమ పానీయం తాగేముందు దాని పోషకాలు మరియు కేలరీలు పరిశీలించి అది ఆరోగ్యాన్ని ఇస్తుందని భావిస్తేనే తాగండని పరిశోధకులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications