For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ ల గుండె జబ్బుకు కారణాలేమిటి?

By B N Sharma
|

What causes heart diseases ?
డయాబెటీస్ రోగులకు గుండెజబ్బు రావటంలో కారణమేమిటి? డయాబెటీస్ రోగుల రక్తనాళాలు గట్టిపడతాయి. నాళాలలో గడ్డలు ఏర్పడతాయి. వీరి రక్తంలోని కొన్ని పదార్ధాలు విభిన్నంగా వుండి ఎల్లపుడూ గడ్డ కట్టేందుకు రెడీగా వుంటుంది. గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలలో గడ్డలు ఏర్పడితే, గుండెకు రక్తం అందక గుండెపోటు వచ్చే అవకాశం వుంది.

డయాబెటీస్ రోగి గుండెజబ్బుకు కారణాలేమిటి? కుటుంబం సభ్యులలో గుండె జబ్బు చరిత్ర వుంటే డయాబెటీస్ రోగులకు గుండె జబ్బు తప్పక వస్తుంది. అది కూడా కుటుంబ సభ్యులు పురుషులు 55 సంవత్సరాల లోపు, మహిళలు 65 సంవత్సరాల లోపు గుండెజబ్బు కలిగి మరణించివుంటే వీరికి మరింత చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

సెంట్రల్ ఒబేసిటీ - సెంట్రల్ ఒబేసిటీ అంటే నడుము చుట్టూ కొవ్వు పేరుకుంటే అంటే పిరుదుల భాగం కాకుండా నడుము పురుషులలో 40 అంగుళాల పైన, స్త్రీలలో 35 అంగుళాల పైన వుంటే దీనిని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. ఈ అధిక పొట్ట కొవ్వు చెడు కొల్లెస్టరాల్ కలిగించి రక్తనాళాలలో గడ్డలు పెంచి అడ్డుపడుతూంటుంది. ఆ సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం వుంది. రక్తనాళాలలో లిపోప్రొటీన్ అంటే చెడు కొల్లెస్టరాల్ అధిక సాంద్రత కలిగి వుండి గుండెకు రక్తం చేర్చే రక్తనాళాలలో అడ్డంకులేర్పరచడం, ట్రిగ్లీసెరైడ్స్ అధికమై రక్తాన్ని మరింత చిక్కబరచటం కూడా కారణాలుగా వుంటాయి. కనుక డయాబెటిక్ రోగులలో ట్రిగ్లీసెరైడ్స్, లిపోప్రొటీన్లు తక్కువగా వుండాలి.

డయాబెటిక్ రోగులలో అధిక రక్తపోటు వుంటే గుండె పోటు వచ్చే అవకాశాలు అధికంగా వుంటాయి.
డయాబెటిక్ రోగికి పొగతాగే అలవాటు వుంటే అది రక్తనాళాలపై డయాబెటీస్ ప్రభావాన్ని అధికం చేస్తుంది. కన్ను, కిడ్నీ మొదలైన సమస్యలు కూడా కలిగిస్తుంది. అవయవాలు తీసివేసే పరిస్ధితికూడా వస్తుంది. కనుక డయాబెటిక్ రోగులు పొగతాగరాదు.

English summary

What causes heart diseases ? | డయాబెటిక్ ల గుండె జబ్బుకు కారణాలేమిటి?

Smoking- Smoking on its own doubles the risk of having heart disease since it narrows down blood vessels and it can only worsen the impact of diabetes on blood vessels. It also increases the risk of other complications like eye and kidney problems, besides increasing the risk of amputation. Hence it is paramount for a diabetic to quit smoking.
Story first published:Sunday, January 22, 2012, 12:26 [IST]
Desktop Bottom Promotion