Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
గుండెను పదిలంగా ఉంచే 10 సముద్రపు ఆహారాలు...!
మాంసాహార ప్రియల్లో చాలా మంది సీఫుడ్(సముద్రపు ఆహారాల) ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇవి మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు మంచి రుచి కూడా. ఇలా ఆరోగ్యాన్ని, రుచిని రెండింటిని అంధించే ఆహారపు కాంబినేషన్ చాలా అరుదు. ఈ సీఫుడ్స్ లో మరో అదనపు ప్రయోజనం ఏంటంటే... ఆహారాలు తయారు చేయడం కూడా చాలా సులభం. అతి తక్కువ సమయంలో తాయరు చేసేయొచ్చు. వీటిని ఎక్కువగా ఉడికించాల్సిన పనిలేదు. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
సీఫుడ్స్ గుండె ఆరోగ్యానికి మంది. అందుకు కారణం వీటిలో ఉండే మంచి కొలెస్ట్రాల్ లేద ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్సే. కాబట్టి వీటిని కరెక్ట్ గా తయారు చేయడంలోనే ఉంది గుండె ఆరోగ్యం. మరికొన్ని సీఫుడ్స్ ప్రాన్స్, ఓస్ట్రస్ వంటి క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలే. క్యాల్షియం ఆధారిత ఆహారాలు ముఖ్యంగా మహిళలకు చాలా అవసరం. ఇంకా ఎముకలు బలహీనంగా ఉండే స్త్రీలకు ఈ ఆహారాలు ఎంతో అవసరం.
మరికొన్ని హెల్తీ సీ ఫుడ్స్ లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది అనేక రకాల పోషకాంశల ఉత్పత్తి చేస్తుంది. ఈ జింక్ ఉన్న ఆహారాలు చాలా తక్కువగా ఉన్నాయి. జింక్ ఫుడ్స్ ముఖ్యంగా పురుషులకు చాలా అవసరం. ఎందుకంటే ఇది మగవారిలో టెస్టోస్టిరోస్ స్థాయిని రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి సీఫుడ్స్ స్త్రీ, పురుషులిద్దరికి చాలా అవసరం మరియు ఆరోగ్యం కూడా. కాబట్టి ఈ క్రింది తెలిపిన సీఫుడ్స్ ను మీ డైలీ మెను(రోజువారి ఆహారంలో)చేర్చుకోండి. ఆరోగ్యం జీవించండి.

సాల్మన్: ఈ ఫిష్ ను మెమరీ ఫుడ్ అని పిలుస్తారు. అంతే కాదు ఈ సాల్మన్ ఫిష్ లో ఉండి విటమిన్ ఎ మరియు విటమిన్ డితో పాటు మంచి కొవ్వులను కలిగి ఉండి నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఓయిస్ట్రస్: సముద్రంలో చేపల తర్వాత స్థానం ఓయిస్ట్రస్. వీటిలో జింక్ మరియు కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే వీటిని స్త్రీలు మరియు పురుషులు తీసుకోవడం చాలా అవసరం.

ట్రోట్(Trout)/ఆహారంగా తినగలిగే మంచి నీటి చేప: నిజానికి ట్రోట్ అనే ఈ నీటి చేప ఆయిల్ ఫిష్ అంటారు. ఇందులో ఎక్కువగా ఆరోగ్యకరమైన ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఉడికించి లేదా కాల్చి తినవచ్చు.

పీతలు: సముద్రంలో ఉండే పీతలు అధిక సోడియంను కలిగి ఉంటాయి. కాబట్టి ఉప్పు లేకుండా వీటిని వండాలి. అంతే కాదు వీటిలో సాల్మాన్ ఫిష్ లోలాగే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఆరోగ్యకరమైన ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి.

స్కాలొప్స్(డిప్పలు): సముద్రంలో లభించే ఈ స్కాలోప్స్ జీరో ఫ్యాట్ మరియు రుచికరమైన ప్రోటీనులు కలిగి ఉన్నాయి. కాబట్టి పొట్ట పెంచని ఈ జీరో ఫ్యాట్ డిప్పలను ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది.

ప్రాన్స్(రొయ్యలు): సీఫుడ్స్ అన్ని అత్యంత రుచికరంగా ఉండటం చేతనే ఇవి చాలా పాపులర్ అయినాయి. సీఫుడ్స్ మరో అద్భుతమైన టేస్ట్ ను ఇచ్చేది ప్రాన్స్. ఇది రుచికి మాత్రమే కాదు, క్యాన్సర్ తో పోరాడే యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్యంను పైబడనియ్యకుండా కాపాడుతుంది. అయితే వీటి ఎక్కువగా ఉడికించకూడదు.

సార్డిన్స్(Sardines): అమెరికెన్ హార్ట్ అసోషియన్ వారు ఈ సార్డిన్ ఫిష్ లో అత్యంత పోషకవిలువలున్నాయని రేట్ చేశారు. మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావల్సినన్ని ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉండి అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

క్యాట్ ఫిష్: ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ మరియు అత్యధిక మోతాదులో విటమిన్ బి12 కలిగినటువంటి ఒక ఆరోగ్యకరమైన సీఫుడ్.

క్రేఫిష్: మీరు సెలీనియం, మాంగనీస్, కాపర్, పొటాషియం మరియు విటమిన్ బి12 వంటి కాంబినేషన్స్ ఖనిజాలను ఈ క్రేఫిష్ లో కనుక్కోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ బి12 నరాల సమస్యలకు చాలా మంచిది.

హ్యాడ్దక్: ఇది చూడటానికి చాలా పొడవుగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, నియాసిన్ మరియు ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలకు మరియు ఎముకలకు చాలా ఆరోగ్యకరం.



Click it and Unblock the Notifications