Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Hearing loss: ఇయర్ ఫోన్స్,హెడ్ ఫోన్స్ వాడుతున్నారా? ఇది తెలుసుకోకుంటే చెవిటివాళ్లైపోతారు!
మనదేశంతో పాటు ప్రపంచంలోని చాలాదేశాల్లో చెవిటివాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకరమైన విషయమే. కొన్నేళ్ల క్రితం వరకు దీనిని వృద్ధాప్యంతో సంబంధం ఉన్న సమస్యగా పరిగణించేవారు. వయస్సు పైబడినవారికి వినికడి లోపం లేదా చెవుడు ఉండటం సహజం అని భావించేవాళ్లం. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఈ సమస్య యువకులను, పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. వరల్డ్ హైల్త్ ఆర్టనైజేషన్(WHO) ప్రకారం మనదేశంలో దాదాపు 6 కోట్ల మంది వినికిడి లోపం లేదా చెవుడుతో బాధపడుతున్నారు. చెవిటితనంతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది 14 సంవత్సరాల వయస్సులోపు వారని రిపోర్ట్ లు తెలియజేస్తున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశ జనాభాలో 19% మంది బధిరులు. జీవనశైలికి సంబంధించిన కొన్ని సమస్యలు దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా వీడియో గేమ్‌లు ఆడే వ్యక్తులు, హెడ్ ఫోన్ లేదా ఇయర్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగించేవారు, పెద్ద శబ్దాలకు గురయ్యే వ్యక్తులకు వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవలి అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు. BMJ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం WHO సహకారంతో నిర్వహించబడింది. 50,000 మందికి పైగా వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనాన్ని విశ్లేషించిన బృందం వీడియో గేమ్ లు ఆడటం వల్ల ఉత్పన్నమయ్యే శబ్దం అనుమతించదగిన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉందని కనుగొంది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రమాదం
12- 35 సంవత్సరాల మధ్య వయస్సు గల 10 కోట్ల కంటే ఎక్కువ మంది వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ఉందని WHO ఓ రిపోర్ట్ లో హెచ్చరించింది. దీనికి ప్రధాన కారణం ఎక్కువసేపు ఇయర్‌బడ్‌ల ద్వారా పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినడం, శబ్దం చేసే ప్రదేశాలలో ఉండటం అని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇయర్ బడ్‌లు లేదా హెడ్‌ఫోన్‌లను ఉపయోగించే దాదాపు 65% మంది వ్యక్తులు వాటిని 85 (డెసిబెల్) కంటే ఎక్కువ వాల్యూమ్ తో స్థిరంగా ఉపయోగిస్తున్నారని.. అంత తీవ్రత గల శబ్దం చెవి లోపలి భాగాలకు చాలా హానికరం, ఇది యువకులను కూడా చెవిటివాళ్లగా చేస్తుందని తెలిపారు. యువతలో ఇయర్ బడ్ ల వంటి పరికరాల వినియోగం పెరగడం వల్ల 40 ఏళ్ల వయసు వచ్చేసరికి వినికిడి లోపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు.
చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం
వినికిడి లోపం చెవి సమస్యలకే పరిమితం కాదని.. అటువంటి వ్యక్తులలో మెదడు సంబంధిత వ్యాధులైన చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం రెండు రెట్లు పెరుగుతుంది. అస్సలు వినలేని లేదా చెవిటి వ్యక్తులకు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువ ఉంటుందని తెలిపారు.
ఎంత శబ్దం సరిపోతుంది
సాధారణ ప్రజలకు 25-30 డెసిబెల్స్ శబ్దం సరిపోతుందని..80-90 డెసిబెల్స్ శబ్దం శాశ్వత వినికిడి నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు తెలిపారు. వీడియో గేమింగ్ సమయంలో చాలా మంది వ్యక్తుల శబ్ద స్థాయి 85 నుండి 90 డెసిబెల్స్ వరకు ఉందని కనుగొనబడింది, ఇది చెవుల సహనం కంటే చాలా ఎక్కువ.
టిన్నిటస్ ప్రమాదం
వీడియో గేమ్‌లు మరియు హెడ్‌ఫోన్‌ల నుండి వచ్చే పెద్ద శబ్దం ప్రమాదకరమని,ఇది వినికిడిని తగ్గించడంతో పాటు టిన్నిటస్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిపుణులు అంటున్నారు. టిన్నిటస్ అనేది ఒక వ్యక్తి తల లేదా చెవుల లోపల నిరంతరం ఏదో ఒక రకమైన శబ్దాన్ని వినే పరిస్థితి. ఈ శబ్దం మోగడం, సందడి చేయడం, బుసలు కొట్టడం లేదా గర్జించడం కావచ్చు.
టిన్నిటస్ మానసిక ఒత్తిడి, ఆందోళనను పెంచడమే కాకుండా, పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అలాంటి వారికి ఏకాగ్రత, నిద్ర సమస్యలు ఉంటాయి, ఇది వారి ప్రొడక్టివిటీని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications