Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఏ పండ్లు,కూరగాయలలో ఎక్కువ పురుగుమందులు ఉంటాయి?..శుభ్రంగా ఎలా తినాలి?
ఆరోగ్యమే మహా భాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కోట్లు సంపాదించినా ఆరోగ్యం మంచిగా లేకుంటే వేస్ట్. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత నుంచే మనుషుల్లో ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తత మొదలైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా ముందు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండేది కొంతమందిలో కానీ కరోనా తర్వాత నుంచే అందరిలో ఆరోగ్యంగా ఉంటే చాలురా బాబు అనే అప్రమత్తత పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు,పండ్లు ఎక్కువగా తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. సీజనల్ కూరగాయలు, పండ్లలో విటమిన్లు,ప్రోటీన్లు,ఫైబర్,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
కొన్ని కూరగాయలు, పండ్లపై పురుగుమందులు కూడా ఉంటాయి. కూరగాయలు లేదా పండ్ల ఉత్పత్తిని పెంచడానికి పురుగుమందులు పిచికారీ చేయబడతాయి. ఈ పురుగుమందు ఆహారం ద్వారా శరీరంలోకి చేరితే రక్తంలో కలిసిపోయి రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు ఈ విషం శరీరంలో ఎక్కువ కాలం కలిసి ఉంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. ఆహారంలో ఇచ్చే ఈ పురుగుమందు పునరుత్పత్తిలో,పిండం అభివృద్ధిలో కూడా సమస్యలను కలిగిస్తుంది.

ఈ ప్రమాదాలు అన్నీ ఉంటాయి కాబట్టి మార్కెట్ నుండి కొనుగోలు చేసిన కూరగాయలు లేదా పండ్లను తినడానికి ముందు బాగా శుభ్రంగా కడగాలి. అయితే బాగా కడిగిన తర్వాత కూడా కొన్ని రకాల కూరగాయలు,పండ్లు అధికశాతం పురుగుమందులను కలిగి ఉంటాయి. అవి ఏంటో ఇక్కడ చూడండి.
కడిగిన తర్వాత కూడా వీటిల్లో పురుగుమందులు
పాలకూర
మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన బచ్చలికూరలో పెర్మెత్రిన్ అనే ఒక రకమైన పురుగుమందు ఉంటుంది. ఇది ఒక రకమైన న్యూరోటాక్సిన్, ఇది మానవులకు, జంతువులకు హానికరం. ఈ రసాయనం శరీరంలోకి చేరితే క్యాన్సర్,నరాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పాలకూర మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే వాటిని ఉప్పు నీటిలో నానబెట్టి బాగా కడగాలి.
ద్రాక్ష,ఆపిల్
ద్రాక్ష,యాపిల్స్‌లో పురుగుమందులు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది దీనిని మార్కెట్ నుండి కొనుగోలు చేసి కడుక్కోకుండా నోటిలో పెట్టుకుంటారు. ఫలితంగా శరీరానికి అత్యంత హానికరమైన డైఫెనిలామైన్ అనే రసాయనం చేరుతుంది. కాబట్టి వీటిని మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే వాటిని కొంతసేపు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత బాగా కడిగి అప్పుడే తినాలి.
జామపండు
జామ చాలా పుష్టికరమైన పండు. కానీ బాగా కడగకుండా తింటే కష్టం. జామపండులో దాదాపు 64 రకాల క్రిమిసంహారక మందులు కనుగొనబడ్డాయి. ఈ రసాయనాలన్నీ శరీరానికి విషం. కడుపు తీవ్రమైన కాలేయ వ్యాధికి కారణమవుతాయి.
పచ్చని ఆకు కూరలు
ఏ రకమైన కూరగాయలలోనైనా చాలా రసాయనాలు ఉంటాయి. కూరగాయల ఆకుల నుండి దాదాపు 103 రకాల క్రిమిసంహారక పదార్థాలు కనుగొనబడ్డాయి. మీరు గింజలు లేదా మరేదైనా కూరగాయలను కొనుగోలు చేసినా ఉప్పు నీటిలో బాగా కడిగి ఉడికించాలి.
ఈ చిట్కాతో మొత్తం కంప్లీట్ గా పోతాయి
దుకాణంలో కొనుగోలు చేసిన రసాయన ద్రావణంలో కూరగాయలను కడగవద్దు. బదులుగా ఇంట్లో బేకింగ్ సోడా, నీటి ద్రావణాన్ని తయారు చేయండి. ఈ ద్రావణంలో కూరగాయలను 15 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత దాన్ని తీసుకుని శుభ్రమైన కుళాయి నీటితో కడగాలి. 90 శాతం పురుగుమందులు కొట్టుకుపోతాయి.
-సమాన పరిమాణంలో నీరు,వెనిగర్ కలపి ఈ ద్రావణంలో చిటికెడు ఉప్పు కలపండి. ఈ సమయంలో ఈ ద్రావణంలో పచ్చి కూరగాయలు,పచ్చి ఆకులు,పండ్లను 10 నుండి 15 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత ద్రావణం నుండి తీసివేసి శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. ఈ విధంగా పచ్చి సలాడ్ తినడానికి ముందు కూరగాయలను బాగా కడగాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications