Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వర్షాకాలంలో పాదలకు ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఇలా సంరక్షించుకోండి
వర్షాకాలంతో పాటు రోగాలు కూడా వస్తాయి. వాతావరణ మార్పు కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చి ఇబ్బంది పెడతాయి. వానలు పడటం మొదలైందంటే చాలు రకరకాల క్రిమి కీటకాలు పెరిగిపోతాయి, అలాగే బ్యాక్టీరియా, వైరస్ లు వ్యాపిస్తాయి. ఇవన్నీ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో సులువుగా రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. వర్షాకాలంలో వీలైనంత మేరకు రోగాలు దూరంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
వర్షాకాలంలో మరీ ముఖ్యంగా పాదాలను ఆరోగ్యంగా చూసుకోవాలి. వానలు కురవడం వల్ల ఇంటి పరిసరాలు తడిగా మారుతాయి. నీటిలో, బురదలో, మురికిలో నుంచి నడవాల్సి వస్తుంది. బయటకు వెళ్లాల్సి వచ్చినా పైన రెయిన్ కోట్ లేదా గొడుగు వాడతం.

శరీరం తడవకుండా చూసుకుంటాం. కానీ పాదాలను చాలా వరకు కవర్ చేసుకోం. దీంతో పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అవి రకరకాల చర్మ సంబంధిత వ్యాధులకు కారణం అవుతాయి. ఈ వానాకాలంలో పాదాలను సురక్షితంగా ఉంచుకోవడం చాలా కీలకం.
వర్షాకాలంలో పాదాల దురద తగ్గాలంటే:
వర్షాకాలంలో పాదాలను ఇన్ఫెక్షన్లు సోకడం చాలా మందిలో కనిపిస్తుంది. వాన నీటిని తుడుచుకోకపోవడం, బయటి నుంచి వచ్చినప్పుడు కాళ్లు కడుక్కోకపోవడం వల్ల బ్యాక్టీరియా, క్రిమికీటకాలు, వైరస్ లు పాదాలపై అలాగే ఉండిపోయి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. అవి కాస్త దురదకు దారితీస్తాయి. ఇలాంటి దురద సమస్యతో బాధపడే వారు బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కచ్చితంగా కాళ్లూ చేతులూ కడుక్కోవాలి. పాదాలను టవల్ తో తుడుచుకుని పొడిగా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం, వెనిగర్ లను కలిపిన మిశ్రమాన్ని రాసుకోవాలి. దురద ఉన్న చోట ఇలా రాసి కాసేపాగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే దురద తగ్గుతుంది.
పాదాలపై మృతకణాలు తొలగిపోవాలంటే:
పాదాపై సహజంగానే చర్మ మృత కణాలు ఉండిపోతాయి. కొద్దిగా తడిగా ఉన్నా.. అవి రాలి పోకుండా పాదాలకే అతుక్కుపోతాయి. అలాంటి మృత కణాలను వదిలించుకోవడం ముఖ్యం. ఇందుకోసం పాదాలను రోజూ స్క్రబర్ సాయంతో రుద్దుకోవాలి. ముందుగా కొద్దిగా తడి చేసి కాసేపాగి తర్వాత స్క్రబర్ తో రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే పాదాకు అతుక్కున్న మృత కణాలు తొలగిపోతాయి. పాదాలు మృదువుగా కూడా మారతాయి. అలాగే రోజూ రాత్రి పాదాలకు కొబ్బరినూనెను రాసి సాక్స్‌లు వేసుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
సూక్ష్మక్రిములు తొలగించుకోవాలి:
వర్షాకాలంలో పాదాలపై సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. వాటిని రోజూ తొలగించుకోకపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి. సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా తొలగించుకోవడానికి గోరు వెచ్చని నీటితో కాళ్లను కడగాలి. బకెట్ లో గోరు వెచ్చని నీరు పోసి, సాల్ట్ వేసి బాగా కలిపి అందులో పాదాలను ఉంచాలి. ఓ 15 నిమిషాల తర్వాత తీసేసి శుభ్రంగా, పొడిగా ఉండేలా తుడుచుకోవాలి.
వర్షాకాలంలో పాదాలకు తడి ఎక్కువగా అంటుకుంటుంది. ఇంటికి రాగానే మొదట పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పొడి టవల్ తో తుడుచుకోవాలి. కాలివేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి. ఈ కాలంలో లెదర్ షూలు, ఇతర బూట్లు ధరిస్తే అందులో నీరు చేరి మరింత ఎక్కువ సేపు తడిగా ఉంటుంది. వర్షాకాలంలో స్లిప్పర్లు, క్లాగ్స్ లాంటివి వేసుకోవాలి. అవి రబ్బరు లాంటి పదార్థంతో తయారు కావడం వల్ల ఎక్కువసేపు తడిగా ఉండవు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications