Latest Updates
-
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం!
ఈ చిట్కాలతో మెడనొప్పి ఒక్కరోజులో మటుమాయం.. ట్రై చేయండి..!
ఇప్పుడు చాలా మంది మెడ నొప్పి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల్లో 9 గంటలపాలు ఆలాగే కూర్చోవడం వల్ల, లేదా ఇంటికి వచ్చిన తరువాత సినిమాను ఫోన్లో, ల్యాప్‌టాపుల్లో అలాగే చూడ్డం వల్లనో లేదా సరిగ్గా పడుకోకపోవడటం వల్లనో మెడనరాలు పట్టుకొని మెడనొప్పి వస్తుంది. ఈ మెడ నొప్పి వచ్చినప్పుడు పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. మెడను ఒక పక్కకు కూడా తిప్పడానికి వీలుపడదు. మరి ఈ మెడనొప్పిని ఎలా తగ్గించుకోవాలి. వైద్యూలు సూచిస్తున్న చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
వెన్నూపూసలో వుండే డిస్కులు వత్తిడికి గురయి ఒకదానిపైన ఒకటి ప్రెజర్ ఏర్పడడం వల్ల మెడనొప్పి రావడానికి ఆస్కారం వుంది. ఈ ఒత్తిడికి గురికావద్దంటే మెడను, వెన్నుపూసను వంచకుండా కూర్చుంటే ఈ మెడనొప్పి రాకుండా వుంటుంది. వచ్చినా త్వరగా తగ్గుతుంది.
మెడనొప్పి రాగానే రాత్రి పడుకునే సమయంలో దిండును ఉపయోగించవద్దు. దిండు లేకుండానే పడుకోవాలి. కూర్చొని ఉద్యోగం చేసేవారు, మెడను వంచి ఉద్యోగం చేసేవారు దిండు వాడకపోతే జరిగే నష్టం ఏమీ లేదని, దాని వల్ల మెడనొప్పి రాకుండా వుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

మెడకు కొబ్బరి నూనె లేదా మస్టర్డ్ ఆయిల్ రాసి దానిపై వేడి నీళ్లతో కాపడం చేసుకోవాలి. లేదంటే మెడకు నూనె రాసుకున్న తరువాత మెడపై కొన్నినిమిశాల పాటు వేడినీళ్లు పోసుకున్నా మంచి ఫలితం వుంటుంది. నీరు మరీ ఎక్కువ వేడి లేకుండా జాగ్రత్తపడాలి.
మెడను ముందుకు వంచే పనులు గానీ, వ్యాయామాలు గానీ చేయవద్దను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యనమస్కారాలు, ఆసనాలు, వ్యాయామాలు కొన్ని రోజుల వరకు ఇవేవీ చేయకుండా ఆపివేయాలి.
ఆఫీసుల్లో కూర్చున్నా లేక ఇంట్లో కూర్చున్నా మెడను నిటారుగా మాత్రమే పెట్టాలి. అప్పుడు నరాలపైన ఒత్తిడి తగ్గి మెడనొప్పి తగ్గే అవకాశం వుంటుంది. మెడను నిటారుగా పెట్టి అలసిపోయినట్టు అనిపిస్తే మెడను కొన్ని నిమిశాలు వెనక్కి వంచి అలాగే రిలాక్స్ అవ్వాలి.
మెడను వెనక్కి వంచే యోగాసనాలు వుంటే వాటిని సాధన చెయ్యాలి. వీటి కోసం ఫిజియోథెరపీ సాయాన్ని కూడా తీసుకోవచ్చు. మూడు యోగాసనాల వల్ల మెడనొప్పిని తగ్గించుకోవచ్చని అంటున్నారు. మొదటిది మత్స్యాసనం. ఈ మత్స్యాసనంలో పద్మాసనం వేసుకొని కాళ్లను మడిచి తలను వెనక్కి వంచి భూమికి ఆనించాలి. పద్మాసనం వేసి చేయలేకపోతే పడుకొని కూడా ఈ మత్స్యాసనాన్ని వేయవచ్చు.
ఇక రెండవది ఉష్ట్రాసనం. ఈ ఆసనంలో మోకాళ్లపై నిల్చొని మెడను వెనక్కి వంపి, చేతులను వెనక అరికాళ్లపై పెట్టడం వల్ల మెడనొప్పి తగ్గుతుంది. ఈ ఆసనంలో శరీరం ధనుస్సు లాగా మారుతుంది. దీని వల్ల వెన్నపూస కొంచం వంగడం వల్ల, డిస్కులను నరాలు వత్తడం వల్ల శరీరం, వెన్నుపూస, మెడ రిలాక్స్ అవుతుంది.
మూడవది భుజంగాసనం. ఈ ఆసనంలో బోర్లా పడుకొని, అరచేతులను భూమికి ఆనంచి మెడను, వీపును పైకి లేపి వెనక్కి వంచే ప్రయంత్నం చేస్తారు. రెండు మూడు నిమిశాలు శరీరాన్ని ఈ ఆసనంలో వుంచితే మెడనొప్పి సులభంగా తగ్గుతుంది. ఈ పై మూడు ఆసనాలు ఉదయం మూడు సార్లు, సాయంత్రం మూడు సార్లు వేయడం వల్ల రెండు రోజుల్లో మెడనొప్పి మటుమయం అవడం ఖాయం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications