For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడం ఎలా!!

|

వాటికి కొలెస్టరాల్ రాక్షసులు అనే పేరుండడం వల్ల, గుడ్లు, రొయ్యల్లాంటి ఆహారాలను మీరు మానేస్తుంటే, మీరు మీ వ్యూహాన్ని పునరాలోచించుకోవాలి. పోషకాహార నిపుణులు ఏమంటున్నారంటే తినే గుడ్డులో కొలెస్టరాల్ ఎక్కువుందచ్చు గానీ, చాలా మందిలో అసలైన ప్రమాదకారులతో పోలిస్తే ఆహారం ద్వారా వచ్చే కొలెస్టరాల్ చాలా తక్కువ - అవే కరిగిన కొవ్వు పదార్ధాలు, కొవ్వు ఆమ్లాలు. కొలెస్టరాల్ అధికంగా వుండే గుడ్డు లాంటి ఆహారాల్లో కొవ్వు పదార్ధాలు తక్కువగా వుంటాయి, చౌకగా దొరికే మాంసకృత్తులు అలాగే ఇతర పోషకాలు కూడా వుంటాయి.

ఆహారంలో కొలెస్టరాల్ ప్రభావ౦:

కొసమెరుపు ఏమిటంటే ఆహారంలో కొలెస్టరాల్ రక్తం లోని కొలెస్టరాల్ స్థాయిని వృద్ది చేస్తుంది, కానీ మిగతా కారణాలు చాలా ముఖ్యం. చాలా మంది ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో సాధారణంగా ఆహారం లోని కొలెస్టరాల్ నాటకీయంగా రక్తపు కొలెస్టరాల్ స్థాయి ని పెంచదు.

అంత మాత్రం చేత మీరు ఆమ్లెట్ ఆర్దరివ్వడానికి ఇది ప్రోత్సాహక సంకేతం కాదు. కొలెస్టరాల్ ఎక్కువగా వుండే ఆహారం తింటే పెరిగే రక్త పోతూ తో పాటు ఇతరాలైన అననుకూల ప్రభావాలు వుంటాయని సన్ పేర్కొంది.

Controlling Cholesterol

కొలెస్టరాల్ అంటే ఒక మోస్తరు పరిమాణంలో జీవితానికి, ఆరోగ్యానికి పనికి వచ్చే ఒక కొవ్వు పదార్ధం. గుండె జబ్బుతో సహా అధిక కొలెస్టరాల్ స్థాయిలకు గుండె రక్తనాళాలకు ఉండే సంబంధం వల్ల మీ రక్తం లోని కొలెస్టరాల్ పరిమాణం చాలా ముఖ్యం. మధుమేహం లేదా కాలేయ సమస్యలున్న వారికి కూడా రక్తం లోని అధిక కొలెస్టరాల్ చాలా ప్రమాదకారి.

20 ఏళ్ళు పైబడ్డ వారికి సాధారణంగా ప్రతి డి ఎల్ రక్తానికి 200 మిల్లిగ్రాముల కన్నా తక్కువ మొత్తం రక్త కొలెస్టరాల్ వుండాలని జాతీయ కొలెస్టరాల్ విద్యా కార్యక్రమం సిఫార్సు చేస్తోంది. ఎల్ డి ఎల్ లేదా చెడు కొలెస్టరాల్ అయితే ప్రతి డి ఎల్ రక్తానికి 100 మిల్లిగ్రాముల కన్నా తక్కువ ఉండాలి, హెచ్ డి ఎల్ లేదా మంచి కొలెస్టరాల్ ఇది 60 మిల్లిగ్రాముల కన్నా తక్కువ వుంటే గుండె వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయ పడుతుందని పరిగణించ బడుతుంది.

ఇంకో కొవ్వు పదార్ధం ట్రైగ్లిసరైడ్ల స్థాయి కూడా ముఖ్యమే. ఆరోగ్యకరమైన వ్యక్తులకు సాధారణంగా ట్రైగ్లిసరైడ్ల స్థాయి 150 ఎం జి/డి ఎల్ ఉండాలి.

ఆరోగ్యకరమైన వ్యక్తులు ఆహరం ద్వారా రోజుకి కనీసం 300 ఎమ్ జి/డి ఎల్ కి తక్కువకకుండా కొలెస్ట్రాల్ తీసుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి ఆహార నియమావళి సూచిస్తుంది. అందుకే గుడ్లు, రొయ్యలు లాంటి ఆహార పదార్ధాలు దృష్టిని ఆకర్షిస్తాయి. ఒక పెద్ద గుడ్డులో 185 ఎమ్ జి/డి ఎల్ కొలెస్ట్రాల్ 3-ఔన్స్ ల రొయ్యల వంటకంలో 100 ఎమ్ జి/డి ఎల్ కన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది.

మొత్తం కొవ్వు పదార్ధాలపై ద్రుష్టి

ఆహార పదార్ధాలలో కొవ్వును తగ్గించడమే రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి మార్గం కాదు. ఆహరం మొత్తం మీద ధ్యాస ఉంచి మొత్తం కొవ్వు పదార్ధాలు ఎంత తీసుకుంటున్నామో కూడా చూసుకోవాలి. కొన్ని రకాల మా౦సాలూ, వెన్నల్లో ఉండే కరిగిన కొవ్వుల బదులు ఆరోగ్యకరమైన మోనో-అన్-సాచురేటేడ్, పాలీ-అన్-సాచురేటేడ్ కొవ్వు పదార్ధాలు తీసుకోవడం చాలా ముఖ్యం. జన్యువులు, జీవన శైలి కూడా రక్త కొలెస్ట్రాల్ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తాయి. మీరు ఆహారం ద్వారా కొలెస్ట్రాల్ ఎక్కువ తిన్నా, తక్కువ తీసుకున్నా మీ శరీరం దానంతటఅది కూడా కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేస్తుంది. వంశపారంపర్యంగా కొంతమందిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. అధిక బరువు ఉండటం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం కూడా కొలెస్ట్రాల్ కి ప్రధాన కారకాలు.

రోజుకొక గుడ్డు?

అధిక కొలెస్ట్రాల్ ని ఎదుర్కోవడంలో ఎన్నాళ్ళ నుంచో పెద్ద శత్రువుగా గుడ్డు భావించబడుతుండగా, రోజుకి ఒక గుడ్డు చొప్పున మోతాదులో వాడితే గుడ్లు గుండెజబ్బు ప్రమాద అవకాశాన్ని గణనీయంగా పెంచదని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అయితే, మధుమేహం ఉన్నవారిలో గుడ్లు గుండేజబ్బుకి దారితీస్తాయని కూడా పరిశోధనలో తేలింది.

"మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమశ్యలు ఉన్నవారు, కొలెస్ట్రాల్ కేంద్రీకృతమై ఉండే గుడ్డులోని పచ్చ సొనను వదిలేసి, తెల్ల సొనను మాత్రమే తీసుకోవాలని" కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వాటిలో ఉండే అధిక కొలెస్ట్రాల్ పరిమాణంతో పాటుగా గుడ్లు సాధారణంగా సాస్, వెన్న, నెయ్యి, లాంటి కరిగిన కొవ్వులుండే ఆహార పదార్ధాలతో పాటుగా వడ్డిస్తారు. అయితే, గుడ్లలో విటమిన్ ఎ, డి, బి కాంప్లెక్స్, ఫాస్ఫరస్ ల తోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. వాటిలో ఉండే లుటీన్, జియక్సాంతిన్ ఆరోగ్య కరమైన చూపుని ఇస్తాయి. పోషకాహార నిపుణులు కూడా ఒక రక్తపు స్థాయి, లేదా ఒక పోషణ మీద ధ్యాస ఉంచడం తప్పని చెప్తున్నారు. "అన్నిట్లో మితవాదం" పాటించడం ఉత్తమ మార్గం.

English summary

Controlling Cholesterol | కొలెస్టరాల్ నియంత్రించడం ఎలా...!!

If you’ve been avoiding foods like eggs and shrimps because of their reputation as cholesterol monsters, you might need to rethink your strategy. Nutrition experts note that while foods such as the incredible edible egg are high in cholesterol, the impact of dietary cholesterol for most people pales in comparison with the real villains: saturated fats and trans fats. And some high-cholesterol foods such as eggs are excellent sources of low-fat, inexpensive protein as well as many other nutrients.
Story first published: Thursday, January 3, 2013, 17:37 [IST]
Desktop Bottom Promotion