Latest Updates
-
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.!
లో బీపీ ఉన్నప్పుడు ఉప్పు నీళ్లు తాగడం సరక్షితమేనా? సమ్మర్ లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో రక్తపోటు (బీపీ) సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. కొందరు హై బీపీతో బాధపడితే, మరికొందరు లో బీపీ (తక్కువ రక్తపోటు)తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా మండుతున్న వేసవి కాలంలో లో బీపీ ముప్పు చాలా ఎక్కువ. ఎండల తీవ్రతకు ఉన్నట్లుండి బీపీ పడిపోవడం అనేది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. కాబట్టి ఈ సమస్య పట్ల సరైన అవగాహన, తక్షణమే తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.

లో బీపీ ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి?
ఎండాాకాలంలో చెమట రూపంలో శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గిపోయి డీహైడ్రేషన్ బారిన పడటం, బరువు తగ్గడం, పనుల ఒత్తిడిలో పడి ఎక్కువ సేపు పస్తులు ఉండటం, ఉప్పు శాతం తగ్గడం లేదా కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల లో బీపీ వస్తుంది. బీపీ పడిపోయిన వ్యక్తిలో అకస్మాత్తుగా తల తిరగడం, విపరీతమైన నీరసం రావడం, కళ్ల కింద నల్లబడటం, కళ్లు బైర్లు కమ్మడం, విపరీతంగా చెమటలు పట్టడం లేదా ఒక్కోసారి స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అలాంటప్పుడు కంగారు పడకుండా ఏం చేయాలి?
ఈ పరిస్థితి ఎదురైనప్పుడు చుట్టుపక్కల వారు కంగారు పడకూడదు. ఎవరికైనా ఉన్నట్లుండి బీపీ పడిపోతే, ముందుగా ఆ వ్యక్తిని ప్రశాంతమైన, చల్లటి ప్రదేశంలో నేలపై పడుకోబెట్టండి. వారి కాళ్లను పైకి ఎత్తండి. అవసరమైతే కాళ్ల కింద రెండు, మూడు దిండ్లు కూడా పెట్టవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గుండె నుంచి మెదడుకు రక్త ప్రసరణ వేగంగా జరిగి, తలతిరగడం ఆగుతుంది. బాధితులు త్వరగా కోలుకుంటారు.

ఉప్పు నీరు సంజీవనిలా పనిచేస్తుందా?
లో బీపీతో బాధపడుతున్న వ్యక్తికి వెంటనే గ్లాసు నీటిలో కొద్దిగా ఉప్పు, పంచదార కలిపి తాగించడం అద్భుతమైన ప్రథమ చికిత్సగా డాక్టర్లు చెబుతున్నారు. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. బీపీ పడిపోయినప్పుడు శరీరంలో సోడియం లోపిస్తుంది. కాబట్టి ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగడం వారికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఇది కేవలం ప్రథమ చికిత్స మాత్రమేనని, పరిస్థితి కుదుటపడిన తర్వాత తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించి పూర్తిస్థాయి ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు అప్రమత్తం కావాలి?
ఒకవేళ గుండె సంబంధిత వ్యాధులు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం లేదా మరేదైనా పెద్ద ఆరోగ్య సమస్య వల్ల బీపీ పడిపోతే.. కేవలం ఉప్పు నీరు తాగించడం మాత్రమే సరిపోదు. ఇలాంటి సందర్భాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కి తరలించాలి. తరచుగా లో బీపీకి గురయ్యే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసాలు చేయకూడదని సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఎండాకాలంలో రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగాలి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలి. సరైన సమయానికి పౌష్టిక ఆహారం తీసుకుంటే ఈ లో బీపీ సమస్యను మనం సులభంగా జయించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications