Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే..నిపుణులు సూచిస్తున్న అద్భుతమైన డ్రింక్స్
మన శరీరంలో అత్యంత కీలకమైన భాగాలు మూత్రపిండాలు (కిడ్నీలు). ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారం, పీల్చే గాలి ద్వారా శరీరంలోకి చేరే హానికరమైన వ్యర్థాలను, కాలుష్య కారకాలను రక్తం నుండి వడపోసి బయటకు పంపే ఒక నిరంతర ఫిల్టర్ లా ఇవి పనిచేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వీటి పాత్ర అమూల్యం. అయితే మన కోసం ఇంత కష్టపడే మూత్రపిండాలను మనం ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి?
కేవలం ఆరోగ్యకరమైన జీవనశైలి, తగినంత నీరు తాగడం, సరైన విశ్రాంతి మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన నేచురల్ డ్రింక్స్ కూడా మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి, వాటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. పోషకాహార నిపుణులు సూచిస్తున్న కొన్ని అద్భుతమైన డ్రింక్స్ ఏవో ఇక్కడ చూడండి.

బీట్ రూట్ జ్యూస్
పోషకాహార నిపుణుడు ర్యాన్ ఫెర్నాండో ప్రకారం..బీట్ రూట్ జ్యూస్ మూత్రపిండాలకు ఒక వరం లాంటిది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 100 మిల్లీలీటర్ల తాజా బీట్ రూట్ రసం తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా ఇది మూత్ర నాళాన్ని శుభ్రంగా, ఇన్ఫెక్షన్లు లేకుండా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ పానీయాన్ని మీ దినచర్యలో చేర్చుకునే ముందు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
అల్లం-పసుపు టీ
మూత్రపిండాలను సహజంగా నిర్విషీకరణ (detox) చేయడానికి అల్లం-పసుపు టీ ఒక ఉత్తమమైన మార్గమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక కప్పు ఈ టీ తాగడం వల్ల మూత్రపిండాల వాపు సమస్యలు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడంలో ఇది సమర్థవంతంగా సహాయపడుతుందని చెబుతున్నారు.
నిమ్మ-దోస-కొత్తిమీర నీరు
ఇదొక సులభమైన, ప్రభావవంతమైన పానీయం. రెండు కప్పుల నీటిలో గుప్పెడు కొత్తిమీర తరుగు వేసి బాగా మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత, అందులో కొద్దిగా నిమ్మరసం, కొన్ని దోసకాయ ముక్కలు కలపాలి. ఈ నీటిని రోజుకు మూడు, నాలుగు సార్లు తాగడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడి, అవి ఆరోగ్యంగా ఉంటాయి.
పరిశోధనలు సూచిస్తున్న ఇతర టీలు
పైన చెప్పినవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన టీలు కూడా మూత్రపిండాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. గ్రీన్ టీ, సాధారణ టీ ఆకులతో చేసే రెడ్ టీ ఇందులో ముఖ్యమైనవి. ఇంతేకాకుండా 2023లో బ్రిటిష్ బయోబ్యాంక్, కరోనరీ ఆర్టరీ రిస్క్ డెవలప్‌మెంట్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం హైడ్రేంజ టీ, సాంబోంగ్ (Sambong) టీ కూడా కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తేలింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
