Latest Updates
-
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే!
నెయ్యి తింటున్నారా? అయితే ముందుగా ఇవి తెలుసుకోండి.. లేదంటే..!
నెయ్యి అనేది ఆరోగ్యానికి మంచిదనే విషయం మనందరికీ తెలిసిందే. రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే మన శారీరానికి అవసరమైన, ఆరోగ్యకరమైన పోషకాలు అందుతాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే మార్కెట్‌లో మనకు ఆవు నెయ్యి, గేదె నెయ్యి రెండూ దొరుకుతాయి. వీటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, ఈ రెండిటికి మధ్య తేడా ఏంటిది అనేది తెలుసుకుందాం.
రెండిటి మధ్య తేడా ఏంటంటే?
గేదె నెయ్యి ఆవు నెయ్యితో పోలిస్తే కొంచెం తెల్లగా ఉంటుంది. అదే ఆవు నెయ్యి గేదె నెయ్యితో పోలిస్తే కొంచెం పసుపు రంగులో ఉంటుంది. గేదె నెయ్యిలో ఎక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని బరువు పెరగాలనుకునే వారు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా గేదె నెయ్యి తినాలని, అందులో ఎముకలను పోషించే పోషకాలు చాలా ఉంటాయంటున్నారు.

అదే ఆవు నెయ్యి తింటే గుండెకు చాలా మంచిదని, ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉండడంతో పాటు, క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. తద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, బరువు తగ్గాలనుకునే వారు కూడా ఆవు నెయ్యిని తీసుకోవాలని చెబుతున్నారు.
ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే?
ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యానికి ఆవు నెయ్యి మంచిదని తెలుస్తోంది. గేదె నెయ్యితో పోలిస్తే ఆవు నెయ్యిలోనే ఎక్కువ మోతాదులో పోషక విలువలు ఉంటాయి. ఆవు నెయ్యిలో పోషకాలతో పాటు కొన్ని సానుకూల శక్తులు కూడా ఉంటాయని నమ్మకం. వివిధ రకాల వ్యాధులకు నయం చేసే క్రమంలో మెడిసిన్‌గా ఆవు నెయ్యిని కూడా వినియోగిస్తారు. కొన్ని రకాల మూలికల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు.
ఏది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది?
సాధారణంగా నెయ్యి అనేది చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే ఆవు నెయ్యితో పోలిస్తే గేదె నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. గేదె నెయ్యి సుమారు రెండేళ్ల పాటు నిల్వ ఉంటే, ఆవు నెయ్యి మాత్రం ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు తాజాగా నిల్వ ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారు ఏది తినాలి:
నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాబట్టి చాలామంది తింటూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు గేదె నెయ్యి జోలికి పోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉండడంతో పాటు క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. దీంతో సులువుగా బరువు పెరుగుతారు.
అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఆవు నెయ్యిని తీసుకోవాలని సూచిస్తున్నారు. అందులో కొవ్వు శాతం చాలా తక్కువ మోతాదులో ఉంటుందని, క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఉండే లినొలిక్ యాసిడ్ జీవక్రియను మెరుగుపరిచి, ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుందని, తద్వారా బరువు కూడా తగ్గొచ్చని చెబుతున్నారు.
ఏ నెయ్యి తింటే మంచిది?
ఆవు నెయ్యి తినడం వల్ల స్థూలకాయం బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలాగే అనేక వ్యాధుల నుండి కూడా ఇది మనల్ని రక్షణ కల్పిస్తుంది. అయితే అథ్లెట్లు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు గేదె నెయ్యిని తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వారికి ఎక్కువ శక్తి అందించేందుకు గేదె నెయ్యి దోహపడుతుంది. అలాగే చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనంలో మేము అందించిన అంశాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
