Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.!
Sleep and Diabetes : సరిగ్గా నిద్రపోకపోతే డయాబెటిస్ వస్తుంది..పరిశోధనలో షాకింగ్ విషయాలు..?
ఆరోగ్యంగా ఉండాలంటే ముందు కంటి నిండా నిద్ర కూడా ఉండాలి. కేవలం ఆహారం, వ్యాయామం మాత్రమే మనల్ని ఆరోగ్యంగా వుంచలేదు. శరీరంలో అవయవాలు అన్నీ సరిగ్గా పనిచేయాలంటే, అవి రీచార్జ్ కావాలంటే ఖచ్చితంగా నిద్ర కావాలి. అత్యంత బిజీగా ఉన్న బిలియనేర్లు కూడా తమ ఆరోగ్యం కోసం కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా నిద్రించకపోతే డయాబిటీస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎక్కవయ్యే ప్రమాదం ఉంది. నిద్రకు డయాబెటీస్‌కు ఎలాంటి సంబంధం ఉన్నదో మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతీ రోజు కనీసం ఏడు నుంచి 9 గంటల నిద్ర శరీరానికి ఖచ్ఛితంగా అవసరం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏడుగంటల కంటే తక్కువగా నిద్రించిన వారు కొన్ని అనారోగ్యం సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పరిశోధనలో తేలింది. మారుతున్న జీవనశైలి కూడా నిద్రపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ఫోన్, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నిద్రించాల్సిన సమయాన్ని లాగేసుకుంటున్నాయ్. దీంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు పెరిగిపోతున్నాయ్. ముఖ్యంగా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నవారు సరిగ్గా నిద్రించక డయాబెటీస్ బారిన పడుతున్నారు. డయాబెటీస్ ఉన్న వారు మరింత పెంచుకుంటున్నారు.

సర్వే చెబుతున్న వాస్తవాలు
నిద్రించే సమయం, ఆరోగ్యం పై ఎలా ప్రభావం చూపెడుతుందో తెలుసుకోవడానికి ఓ ప్రముఖ సర్వే సంస్థ 248000 మందిపై సర్వే నిర్వహించింది. వారిలో రోజుకి 5 గంటలు, 3 గంటలు, 4 గంటలు నిద్రపోయేవారి లిస్ట్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. వారి ఆరోగ్య స్థితిగతులను గమనించారు. తక్కువగా నిద్రపోయిన వారు టైప్ 2 డియాబెటీస్‌తో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది.
7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల డయాబెటిస్ మాత్రమే కాదు భవిష్యత్తులో ఉబకాయం సమస్య కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే తక్కువ సమయం నిద్రపోవడం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది తెలుసుకుందాం.
తక్కువ నిద్ర దాని ప్రభావం
తక్కువగా నిద్రించడం వల్ల ఆకలి ఎక్కవగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకునే పరిస్థితి వస్తుంది. వ్యాయామం చేయడానికి కూడా బుద్ధి మందగిస్తుందని అంటున్నారు.
ఒక క్రమం ప్రాకరం నిద్రపోకుండా కేవలం 5 గంటలు, 4 గంటలు నిద్రపోయేవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని తేలింది. ఇలాంటి వారు ఎక్కువగా చిరుతిళ్లు, వేపుడులు, బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడంతో ఆహారం పౌష్టికంగా లేక క్యాలరీలు ఎక్కవై బరువు పెరుగుతున్నారు. వీటితో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయ్.
శరీరంలో కీలక మార్పులు నిద్రించే సమయంలోనే జరుగుతుంది. నిద్రించకపోవడం వల్ల ఆ ప్రక్రియ దెబ్బతినడంతో బరువు పెరగడానికి ప్రధాన కారణమౌతుంది.
నిద్రలేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగ్గిపోతుంది. దీంతో గ్లూకోస్ స్థాయిలు అమాంతంగా పెరిగి డయాబెటీస్‌కు కారణమౌతోందని వైద్యులు చెబుతున్నారు.
ఆకలికి సంబంధించి శరీరంలో లెప్‌టిన్, గ్రెలిన్ అనే హార్మోన్లు కీలకంగా వ్యవహరిస్తాయ్. సరిగ్గా నిద్రించకపోవడం వల్ల లెప్టిన్ తగ్గి గ్రెలిన్ హార్మోన్లు పెరుగుతాయ్.. ఇలా కావడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకొని బరువు పెరగడానికి పరోక్షంగా దోహదపడి అది డయాబెటీస్‌కు ప్రధాన కారణంగా మారుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
