Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
ఎంతకీ దగ్గు తగ్గడం లేదా? ఇలా చేస్తే ఇట్టే తగ్గిపోతుంది, కావాలంటే ట్రై చేసి చూడండి
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఒక్కొక్కటిగా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మొదటి జలుబుతో మొదలవుతుంది. కొంత మందిలో దగ్గు వస్తుంది. తర్వాత జ్వరాలు వచ్చేస్తాయి. కలుషిత నీరు తాగడం, వాతావరణ మార్పు, ఇన్ని రోజులు చల్లని నీరు తాగిన అలవాటులో వాటినే తాగుతుండటం వల్ల గొంతు సమస్యలు తలెత్తి దగ్గు మొదలవుతుంది. కొంత మందిలో 2, 3 రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది. కానీ కొంత మంది మాత్రం వారాల తరబడి దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు.
అదే పనిగా దగ్గడం వల్ల ఎదుటి వారికి ఇబ్బంది, మనకూ ఇబ్బందే. ఇలాంటి దగ్గును కొన్ని చిట్కాలు ఇట్టే తగ్గించుకోవచ్చని పెద్దలు ఎప్పుడూ చెప్పేది. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో తడి పెరుగుతుంది. తడి వాతావరణం, చల్లని వాతావరణంలో సూక్షక్రిములు పెరగడానికి అనువైన పరిస్థితులు. దీంతో నీటిలో, ఆహారంలో సూక్షక్రిములు చేరుతాయి. వాటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు చేరి రోగాలకు కారణం అవుతాయి. శరీరంలోకి చేరిన బ్యాక్టీరియాను తరిమికొట్టేందుకు మనలోని రోగనిరోధక శక్తి ప్రయత్నిస్తుంది. ఈ రోగనిరోధక శక్తిని కొద్దిగా చేయూత అందిస్తే రోగాలను సులభంగా తగ్గించుకోవచ్చు.
దగ్గు మొదలు కాగానే చాలా మంది మందులు, సిరప్ లు తాగుతుంటారు. దీని వల్ల బయటి నుంచి వచ్చే యాంటీ బాడీలు బ్యాక్టీరియాను చంపి దగ్గు తగ్గిస్తుంది. కానీ ఇలా తరచూ చేయడం మంచిది కాదు అంటున్నారు వైద్యులు. బయటి మందులకంటే కూడా మనలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే వ్యాధులపై పోరాడేలా చూడాలంటున్నారు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
ఆవిరి పట్టుకోవాలి:
జలుబు చేసినా, దగ్గు ఇబ్బంది పెట్టినా చాలా మంది పాటించే చిట్కా ఆవిరి పట్టుకోవడం. ఈ పద్ధతి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే ఈ రెమిడీ చాలా కాలంగా పాటిస్తూ వస్తున్నాం. వేడి వేడి నీటిలో పసుపు, శొంఠి లాంటివి వేసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. నీరు, ముక్కు ద్వారా ఆవిరి పీలిస్తే.. గొంతులోని మ్యూకస్ కణాలు చనిపోతాయి. ఆవిరి వేడికి అవి చనిపోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. ఇలా ఒకటీ రెండూ సార్లు చేస్తే దగ్గు, జలుబు ఇట్టే తగ్గిపోతుంది.
వేడి నీరు, తేనె:
తేనెకు ఆయర్వేదంలో ప్రముఖ స్థానం ఉంటుంది. ఆయుర్వేద మందుల్లో తేనెను ఎక్కువగా వాడతారు. అందులోని పోషక విలువల వల్ల తేనె తీసుకోవడం మంచిది అని చెబుతుంటారు. తేనెలోని పోషకాలు ఆరోగ్యానికి మంచివి. వేడి వేడి నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తలకు కావాల్సిన మాయిశ్చర్ అందుతుంది. ఇలా చేస్తే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.
నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది. విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయలో, ఉసిరికాయల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. సప్లిమెంట్ల రూపంలో కంటే కూడా విటమిన్-సిని పండ్లు, ఫలాల రూపంలో తీసుకోవడం మరింత మంచిది. అలాగే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications