Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హోం రెమెడీస్ తో సిద్దూ భార్య క్యాన్సర్ నయం..ఇది సాధ్యమేనా?
సాధారణంగా క్యాన్సర్ అనగానే ఇక రోజులు దగ్గరపడ్డట్లేనని భావిస్తుంటారం. ఇక లాస్ట్ స్టేజ్ లో క్యాన్సర్ ఉన్నట్లు తేలితే ఇక చావుకి రోజులు దగ్గరపడ్డాయి అని కుంగిపోతుంటారు. అయితే మాజీ టీమిండియా క్రికెటర్,పంజాబ్ కాంగ్రెస్ లీడర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల ఓ మీడియా సమావేశంలో స్టేజ్ 4 క్యాన్సర్ తో బాధపడుతున్న తన భార్య గురించి చెప్పిన కొన్ని విషయాలు అందరినీ షాక్ కు గురిచేశాయి. తన భార్య నవజ్యత్ కౌర్ కేవలం డాక్టర్లమీదనే ఆధారపడకుండా ఆయుర్వేదం,ఆహార నియమాలతో తీవ్రమైన స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడిందని సిద్దూ చెప్పారు.
పాటియాలోని రాజేంద్ర మెడికల్ కాలేజీలో కౌర్ కు ట్రీట్మెంట్ అందించారని..ఆమె క్యాన్సర్ ను డబ్బు ఓడించలేదని క్రమశిక్షణ,కఠినమైన దినచర్య,డైట్ క్యాన్సర్‌ను జయించిందని తెలిపారు. డాక్టర్లు బతికే అవకాశం కేవలం 3 శాతం మాత్రమే ఉందని చెప్పినప్పటికీ తన భార్య ఆహారంలో తులసి ఆకులు, వేప ఆకులు,పచ్చి పసుపు, యాపిల్ సైడర్, నిమ్మరసం, వెనిగర్,కొబ్బరినీరు,ఉసిరి వంటి వాటిని చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్ ను జయించినట్లు సిద్దూ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. తన భార్య గుమ్మడి, దానిమ్మ, క్యారెట్, ఉసిరి, బీట్ రూట్ తో చేసే జ్యూస్ లు తాగేదని, వాల్ నట్స్ తినేదని సిద్దూ చెప్పారు.

కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు, బాదం నూనెలతో చేసిన వంటలు మాత్రమే తన భార్య తీసుకుందని, దీంతో పాటు ఆమె ఉదయం టీలో దాల్చిన చెక్క,లవంగాలు,బెల్లం,యాలకులు తీసుకున్నట్లు సిద్దూ తెలిపారు. కౌర్ సాయంత్రం తీసుకునే ఆహారంలో రోటీలు కూడా ఉండేవి కాదని..క్వినోవా మాత్రమే తీసుకునేదని చెప్పారు. హీపెచ్ లెవెల్ 7 నీటిని మాత్రమే కౌర్ తాగేవారని..ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడంలో ఇది కూడా కీలకపాత్ర పోషించిందని సిద్దూ తెలిపారు.
సిద్దూ ప్రకటన తర్వాత చాలా మంది క్యాన్సర్ రోగులు తాము కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుల,కామెంట్లు పెడుతున్న క్రమంలో టాటా మెమోరియల్ హాస్పిటల్‌కు చెందిన 200 మందికి పైగా క్యాన్సర్ నిపుణులు ఒక లేఖను రిలీజ్ చేశారు. తప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానాల ద్వారా సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించకుండా ఉండేందుకు ఈ లేఖను వాళ్లు రిలీజ్ చేశారు.
డాక్టర్లు సిద్దూ వాదనలను పూర్తిగా తిరస్కరించారు. వైద్య శాస్త్రంలో అలాంటి ట్రీట్మెంట్ కు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయుర్వేదంపై పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ పసుపు, వేపను క్యాన్సర్ నిరోధకమైనవిగా ధృవీకరించడానికి బలమైన డేటా అందుబాటులో లేదన్నారు. ఇలాంటి వార్తలను నిజమని నమ్మవద్దని,క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి తప్పుడు సమాచారం ప్రాణాంతకం కావచ్చని ఓ నిపుణుడు తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఆలస్యం చేయవద్దని కోరారు. నిరూపించబడని ట్రీట్మెంట్ లు ఆలస్యానికి దారితీయవచ్చు తద్వారా మరణం సంభవించే అవకాశముందని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications