Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గుండెల్లో మంటగా అనిపిస్తుందా?..వెంటనే ఇలా చేయండి
పండగలొచ్చాయంటే చాలు, మన ఇళ్లన్నీ సందడిగా మారిపోతాయి. కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా వంటి పర్వదినాలలో నోరూరించే పిండివంటలు, ఘుమఘుమలాడే వంటకాలు, తీపి పదార్థాలు తినకుండా ఉండటం ఎవరికైనా కష్టమే. బంధుమిత్రులతో కలిసి సరదాగా భోజనం చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువగా తిన్నామా అని కూడా అనిపించదు. అయితే ఇదే సమయంలో కొంచెం ఎక్కువగా నూనె వంటకాలు, స్వీట్లు తిన్నారంటే గుండెల్లో మంట మొదలవుతుంది.
ఛాతీలో మొదలైన ఈ మంట కొన్నిసార్లు గంటల తరబడి, రోజుల తరబడి మనల్ని వేధిస్తుంది. ఏమీ తినాలన్నా, తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు కడుపులో యాసిడ్ పెరిగి, తేన్పులతో చికాకు పుడుతుంది. అయితే ఈ సమస్యతో మీరు బాధపడుతుంటే వెంటనే మెడికల్ షాపుకి పరుగెత్తాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యకు వెంటనే చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి.

చల్లని పాలు
మీకు గుండెల్లో మంట తీవ్రంగా అనిపిస్తే వెంటనే ఫ్రిజ్‌లోంచి తీసిన చల్లని పాలు చక్కెర కలపకుండా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. పాలలో ఉండే కాల్షియం కడుపులోని అదనపు యాసిడ్ ను న్యూట్రలైజ్ చేసి మంట నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఇది అత్యంత ఈజీ, ప్రభావవంతమైన చిట్కా.
సోంపు, పటిక బెల్లం
భోజనం తర్వాత కొద్దిగా సోంపు, పటిక బెల్లం కలిపి నమలడం మనకు అలవాటే. ఇది కేవలం నోటికి సువాసన ఇవ్వడమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరిచి అసిడిటీని తగ్గిస్తుంది. ఈ రెండింటినీ నమిలిన తర్వాత గ్లాసు చల్లటి నీరు తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నీళ్లు, అరటిపండు
కొబ్బరి నీళ్లు శరీరానికి చలువ చేసి, కడుపులోని యాసిడ్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. అదేవిధంగా పొటాషియం అధికంగా ఉండే అరటిపండు కూడా జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. పండగ తర్వాత శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, మంటను తగ్గించుకోవడానికి ఈ రెండూ అద్భుతంగా పనిచేస్తాయి.
అల్లం
అల్లంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు జీర్ణశక్తిని పెంచి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఒక చిన్న అల్లం ముక్కను నమలవచ్చు లేదా అల్లం టీ, అల్లం రసం నీళ్లలో కలుపుకుని తాగినా మంచిదే.
ఉసిరికాయ
గుండెల్లో మంటకు ఉసిరికాయ ఒక దివ్యౌషధం. దీనిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులోని మంటను తగ్గించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చి ఉసిరికాయను తినవచ్చు లేదా ఉసిరి రసం, ఉసిరి మురబ్బా (జామ్) రూపంలోనైనా తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications