Latest Updates
-
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు!
Salman Khan: సల్మాన్ ఖాన్ కి ఇన్ని రోగాలా? స్వయంగా షాకింగ్ నిజాలు బయటపెట్టిన భాయిజాన్
బాలీవుడ్ కండల వీరుడు, కోట్లాది అభిమానుల భాయిజాన్ సల్మాన్ ఖాన్ పేరు వినబడగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆయన స్టైల్, స్వాగ్, వెండితెరపై ఆయన సృష్టించే మ్యాజిక్. అయితే ఆ వెలుగుల వెనుక, ఆ నవ్వుల మాటున నిత్యం సల్లూభాయ్ అనుభవిస్తున్న నరకం గురించి, ఆయన చేస్తున్న నిశ్శబ్ద యుద్ధం గురించి చాలామందికి తెలియదు. ఈ మధ్యకాలంలో సల్మాన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు ఇటీవల ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో ఆయనే స్వయంగా తెరదించారు. ఆయన చెప్పిన నిజాలు అభిమానుల హృదయాలను కలచివేశాయి.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కపిల్ శర్మ తనదైన శైలిలో సల్మాన్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే.. సల్మాన్ ఖాన్ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. నాకు పెళ్లంటే భయం లేదు, కానీ నా అనారోగ్యం నన్ను భయపెడుతోంది. ఇప్పుడు నా వయసు 59. ఈ వయసులో పెళ్లి చేసుకుని, ఏ కారణంగానైనా విడిపోతే నా జీవిత భాగస్వామి నా ఆస్తిలో సగం తీసుకుంటుంది. చిన్న వయసులో అయితే మళ్ళీ కష్టపడి సంపాదించుకోగలను కానీ ఇప్పుడు అది అసాధ్యం అని చెబుతూనే తన ఆరోగ్య సమస్యల చిట్టా విప్పారు.

సల్మాన్ ఖాన్ చెప్పిన మాటలు విన్న ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. నా ఎముకలు రోజూ విరుగుతూనే ఉంటాయి. పక్కటెముకలు విరిగాయి. నాకు ట్రైజెమినల్ న్యూరల్జియా ఉంది, నా మెదడులో అనూరిజం ఉంది, ఏవీ మాల్‌ఫార్మేషన్ కూడా ఉంది. అయినా నేను ఇంకా నిలబడి ఉన్నాను, పనిచేస్తున్నాను అని సల్మాన్ చెప్పినప్పుడు ఆయన కళ్ళలో కనిపించిన బాధ వర్ణనాతీతం. సల్మాన్ ఖాన్ తనను పట్టిపీడిస్తున్న మూడు భయంకరమైన ఆరోగ్య సమస్యల గురించి వివరించారు.
సల్మాన్ పోరాడుతున్న మూడు ప్రధాన వ్యాధులు
ట్రైజెమినల్ న్యూరల్జియా(trigeminal neuralgia)
ఇది అత్యంత భయంకరమైన నరాల వ్యాధి. దీనిని ఆత్మహత్య వ్యాధి అని పిలుస్తారు. ఫేస్ మీద హఠాత్తుగా కరెంట్ షాక్ కొట్టినట్లు భరించలేని నొప్పి వస్తుంది. ముఖం నుండి మెదడుకు సంకేతాలు పంపే ట్రైజెమినల్ నరం దెబ్బతినడం వల్ల ఈ నొప్పి కలుగుతుంది. ఈ నొప్పితో జీవించడం నరకప్రాయం. 2017లోనే సల్మాన్ ఈ వ్యాధి గురించి మాట్లాడారు.
బ్రెయిన్ అనూరిజం(brain aneurys)
ఇది ప్రాణాంతకమైన పరిస్థితి. మెదడులోని రక్తనాళం ఒకచోట బలహీనపడి రక్తంతో నిండి బెలూన్ లా ఉబ్బుతుంది. ఇది ఎప్పుడు పగులుతుందో తెలియదు. పగిలితే మెదడులో రక్తస్రావం జరిగి, ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు. దీని లక్షణాలు కూడా అది పగిలేంత వరకు బయటపడవు.
ఏవీ మాల్‌ఫార్మేషన్(AVM)
ఇది మెదడులోని ధమనులు, సిరల మధ్య ఏర్పడే అసాధారణమైన చిక్కుముడి. దీనివల్ల రక్త ప్రసరణకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇది మూర్ఛలు, తీవ్రమైన తలనొప్పి, రక్తస్రావం వంటి అనేక మెదడు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications